Wednesday, August 12, 2026 02:02 PM
Wednesday, August 12, 2026 02:02 PM

డిప్యూటి సీఎంగా త్రిష..? మాజీ మంత్రి సంచలనం..!

తమిళనాడు రాజకీయాల్లో నటి త్రిష కృష్ణన్, ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్‌లను లక్ష్యంగా చేసుకుని విపక్షాలు చేస్తున్న వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. తాజాగా అన్నాడీఎంకే సీనియర్ నేత, మాజీ మంత్రి ఆర్‌.బి. ఉదయ్‌కుమార్ ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ… సీఎం విజయ్ తన సొంత సినిమాలకు పనిచేసిన నిర్మాతలను, సాంకేతిక నిపుణులను, తనకు అత్యంత సన్నిహితులైన వారికే ప్రభుత్వంలో కీలక పదవులను కట్టబెడుతున్నారని ఆరోపించారు.

Also Read : ప్రకాష్ రాజ్ కు ఎన్నికల సంఘం షాక్..!

ఈ క్రమంలోనే ఆయన మరింత ముందుకు వెళ్తూ, “విజయ్‌కు ప్రియమైన త్రిషను ఎప్పుడు డిప్యూటీ సీఎంగా నియమిస్తారోనని తమిళనాడు ప్రజలు ఆశ్చర్యంతో ఎదురుచూస్తున్నారు” అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఆర్‌.బి. ఉదయ్‌కుమార్ గతంలో కూడా నటి త్రిషను ఉద్దేశించి ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన దాఖలాలు ఉన్నాయి. సినిమా రంగానికి చెందిన వ్యక్తులను రాజకీయాల్లోకి లాగుతూ, మహిళా నటులను కించపరిచేలా మాట్లాడటంపై తమిళగ వెట్రి కజగం పార్టీ శ్రేణులు మరియు త్రిష అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Also Read : శాంతిభద్రతలపై సీఎం నేడు కీలక సమావేశం..!

ఉదయ్‌కుమార్ వ్యాఖ్యలు పూర్తిగా మహిళల గౌరవానికి భంగం కలిగించేలా ఉన్నాయని పేర్కొంటూ టీవీకే స్థానిక నాయకులు, మహిళా విభాగాలు పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేశారు. ఆయనపై తక్షణమే కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తమిళనాడు రాజకీయాల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు విపక్షాలు త్రిష పేరును నిరంతరం వాడుకోవడం ఒక ట్రెండ్‌గా మారింది. గత వారమే డిఎంకె నేత ఉదయనిధి స్టాలిన్ సైతం త్రిషను ఉద్దేశించి డబుల్ మీనింగ్ వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై అరెస్ట్ అయి, ఆ తర్వాత స్టేషన్ బెయిల్‌పై విడుదలయ్యారు. ఈ వివాదం సద్దుమణగక ముందే ఇప్పుడు అన్నాడీఎంకే నేత ఉదయ్‌కుమార్ చేసిన డిప్యూటీ సీఎం వ్యాఖ్యలు తమిళ రాజకీయాల్లో సరికొత్త రచ్చకు దారితీశాయి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ప్రకాశ్ రాజ్ ఓటు...

బెంగళూరు నియోజకవర్గంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్...

డిప్యూటి సిఎం భార్యపై...

తెలంగాణ ఉపముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి...

శాంతిభద్రతలపై సీఎం నేడు...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా...

ఢిల్లీ వేదికగా మళ్లీ...

రాష్ట్రంలో ప్రగల్భాలు పలికే వైకాపా అధినేత...

బాలినేని – దామచర్ల...

ఒంగోలు నియోజకవర్గంలో గత కొన్ని రోజులుగా...

మార్కాపురం జిల్లాకు కూటమి...

కొత్తగా ఏర్పడిన మార్కాపురం జిల్లా వాసులు...

పోల్స్