Wednesday, September 23, 2026 02:10 PM
Wednesday, September 23, 2026 02:10 PM

ఎవడు ఆపినా ఎన్నికలు ఆగవు: లోకేష్

ఏపీ కేబినేట్ భేటీ సందర్భంగా మంత్రులతో మంత్రి నారా లోకేష్ ప్రత్యేకంగా బ్రేక్‌ఫాస్ట్ సమావేశాన్ని నిర్వహించి పలు కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రస్తుతం రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో సామాన్య ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా చూసుకోవాల్సిన కనీస బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. క్షేత్రస్థాయిలో ఉన్న అధికారులతో ప్రజాప్రతినిధులు నిరంతరం సమన్వయం చేసుకుంటూ సహాయక చర్యలను ముమ్మరం చేయాలని ప్రజాప్రతినిధులకు సూచించారు.

Also Read : బ్రేకింగ్: వైసీపీ కీలకనేతలపై రౌడీ షీట్ లు..!

ముంపు ప్రాంతాల ప్రజలకు తక్షణ సహాయం అందేలా యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలని మంత్రులకు సూచించారు. వర్షాల వల్ల తలెత్తే ఇబ్బందులను ఎదుర్కొనేందుకు వీలుగా ప్రభుత్వ విభాగాలన్నీ సమన్వయంతో ముందడుగు వేయాలని స్పష్టం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని ఈ సమావేశంలో తేల్చి చెప్పారు. రాబోయే అక్టోబర్ నెలలో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఖచ్చితంగా జరుగుతాయని, దీనికి అన్ని విభాగాల శ్రేణులు సమాయత్తం కావాలని నారా లోకేష్ పిలుపునిచ్చారు.

Also Read : అమరావతికి క్యూ కడుతున్న ప్రతిష్ఠాత్మక సంస్థలు..!

ఎన్నికలు జరిగే అన్ని స్థానాల్లోనూ కూటమి అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించేలా నాయకులు ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని దిశా నిర్దేశం చేశారు. కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు మరియు పొత్తుల అంశాన్ని సమన్వయ కమిటీతో పాటు అధిష్ఠానం చూసుకుంటుందని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎలాగైనా వాయిదా పడాలంటూ ప్రతిపక్షమైన గొడ్డలి పార్టీ చేస్తున్న కుయుక్తులు ఇకపై ఏమాత్రం పనిచేయవని మండిపడ్డారు. ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను కప్పిపుచ్చుకునేందుకే విపక్షాలు ఎన్నికలను ఎదుర్కోవడానికి భయపడుతూ నాటకాలు ఆడుతున్నాయని విమర్శించారు. కూటమి ఐక్యతతో ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

బ్రేకింగ్: వైసీపీ కీలకనేతలపై...

విజయవాడ నగరంలో తీవ్ర కలకలం రేపిన...

అమరావతికి క్యూ కడుతున్న...

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని అంతర్జాతీయ స్థాయి...

టీచర్లపై దాడిలో అరాచక...

విజయవాడలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్...

జగన్‌కు ఊహించని షాక్...

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్...

టాలీవుడ్ కు ఏపీ...

తెలుగు చలనచిత్ర మరియు టెలివిజన్ రంగాలకు...

తప్పు చేసి కొత్త...

బెజవాడలో టీచర్లపై చేసిన దాడిని, తాము...

పోల్స్