Monday, August 24, 2026 08:03 PM
Monday, August 24, 2026 08:03 PM

సిబిఐ పై జగన్ గౌరవం.. న్యాయమూర్తులు, లాయర్లు షాక్

APPSC గ్రూప్-1 స్కామ్‌పై వైసీపీ చీఫ్, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనూహ్యంగా CBI విచారణ డిమాండ్ చేయడం వెనుక ఉన్న అసలు వ్యూహాన్ని నెటిజన్లు పసిగట్టేశారు. క్రికెట్‌లో ఓ బ్యాట్స్‌మెన్ తనకు బాగా ఎక్స్‌పీరియన్స్ ఉన్న పిచ్ మీద ఆడేందుకు ఇష్టపడినట్లే. జగన్ కూడా తనకు దశాబ్ద కాలంగా అనుభవం ఉన్న CBI అయితేనే బెటర్ అని బలంగా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. తన అక్రమాస్తుల కేసుల్లో సీబీఐ కోర్టు విచారణను ఏకంగా 3,041 సార్లు ఎగ్గొట్టి, రకరకాల కారణాలతో వాయిదాలు వేయించుకున్న ఘన చరిత్ర జగన్ సొంతం. అలాంటి వ్యక్తి ఇప్పుడు APPSC వ్యవహారంపై CBI విచారణ కావాలి అని కోరడం చూసి జనం పగలబడి నవ్వుకుంటున్నారు.

Also Read : గ్రూప్-1 స్కామ్‌.. జగన్‌కు కూటమి దిమ్మతిరిగే కౌంటర్!

ఇటీవలి ప్రెస్‌మీట్‌లో CBI విచారణకు ఇవ్వండి.. అని జగన్ పదే పదే డిమాండ్ చేయడం వెనుక ఉన్న ఆంతర్యం ఇదేనని విమర్శకులు ఎద్దేవా చేస్తున్నారు. గ్రూప్-1 స్కాంను గనక సీబీఐకి ఇస్తే.. దాన్ని కూడా తన అక్రమాస్తుల కేసుల్లాగే ఏళ్ల తరబడి సాగదీయవచ్చని జగన్‌ భావిస్తున్నట్లు సెటైర్లు పేలుతున్నాయి. అడుగడుగునా పిటిషన్లు వేయడం, మినహాయింపులు అడగడం, వాయిదాలు వేయించుకుంటూ సులువుగా విచారణ నుంచి తప్పించుకోవచ్చన్నదే జగన్ అసలు ప్లాన్ అని కామెంట్లు చేస్తున్నారు.

Also Read : ఒక్క రోజే 400 కేసులు క్లోజ్.. సమాధాన్ సమారోహ్..!

ఒక కేసును వాయిదాల మీద వాయిదాలు వేయించుకుంటూ కాలయాపన చేయడంలో జగన్ ట్రాక్ రికార్డ్ చూసి న్యాయమూర్తులు, లాయర్లే షాక్ అయ్యే పరిస్థితి నెలకొంది. తన సొంత కేసుల్లో సాధించిన ఇన్నేళ్ల అనుభవాన్ని.. ఇప్పుడు APPSC స్కామ్‌లోనూ వాడేసి, విచారణ నుంచి చాకచక్యంగా తప్పించుకోవచ్చన్న జగన్ వ్యూహం బెడిసికొట్టింది. సీబీఐ విచారణ వెనుక ఉన్న జగన్ అసలు ఉద్దేశం బట్టబయలు కావడంతో సోషల్ మీడియాలో #FekuJagan హ్యాష్‌ట్యాగ్‌తో నెటిజన్లు ఓ రేంజ్‌లో ఆడుకుంటున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

కారుమూరి అరెస్ట్ కక్షసాధింపు...

వైసీపీ పాలనలో జరగని స్కామ్‌లు, జరగని...

వైసీపీ టైం లో...

కాకినాడ అసిస్టెంట్ ఇంజనీర్ నూకరాజు కుటుంబం...

విశాఖ స్టీల్ ప్లాంట్.....

విశాఖ స్టీల్ ప్లాంట్ పై కేంద్రం...

పథకం మంచిదే.. కానీ...

ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించాలనేది...

నాకేం సంబంధం లేదు.....

కాకినాడ: రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన...

కారుమూరికి ఈడీ షాక్..!

మద్యం రవాణా కుంభకోణం కేసులో కీలక...

పోల్స్