Tuesday, August 25, 2026 08:48 AM
Tuesday, August 25, 2026 08:48 AM

వివాహేతర సంబంధాలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..!

భార్యాభర్తల మధ్య తలెత్తే వివాదాల్లో వివాహేతర సంబంధాన్ని నిరూపించేందుకు భాగస్వామి యొక్క మొబైల్ కాల్ డేటా రికార్డులను, హోటల్ బుకింగ్ వివరాలను సేకరించడం రాజ్యాంగం కల్పించిన గోప్యతా హక్కు ఉల్లంఘన కిందకు అస్సలు రాదని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కింద పౌరులకు లభించే వ్యక్తిగత గోప్యతా హక్కు అనేది సంపూర్ణమైనది కాదని, ఇది ఎల్లప్పుడూ సాజిక శ్రేయస్సు మరియు ప్రజా ప్రయోజనాలకు లోబడి ఉంటుందని జస్టిస్ మన్మోహన్, జస్టిస్ కె. వినోద్ చంద్రన్‌లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది.

Also Read : మళ్లీ పట్టాలెక్కనున్న భారత్-బంగ్లాదేశ్ క్రికెట్ సమరం..?

వైవాహిక బంధంలో మోసానికి గురైన భాగస్వామి న్యాయాన్ని పొందేందుకు, అవతలి వ్యక్తి తప్పును నిరూపించేందుకు అవసరమైన డిజిటల్ సాక్ష్యాలను కోరవచ్చని, అలాంటి ఆధారాలను సేకరించాలని కుటుంబ న్యాయస్థానాలు ఇచ్చే ఆదేశాలు పూర్తిగా చట్టబద్ధమైనవేనని కోర్టు తేల్చి చెప్పింది. మొబైల్ రికార్డుల వెల్లడి తన ప్రాథమిక హక్కుకు భంగం కలిగిస్తోందంటూ ఒక భర్త దాఖలు చేసిన పిటిషన్‌ ను కొట్టివేస్తూ గతంలో దిల్లీ హైకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పును సుప్రీంకోర్టు తాజాగా పూర్తిగా సమర్థించింది.

ఈ కేసు వివరాల్లోకి వెళ్తే.. సదరు దంపతులకు 1998లో వివాహం కాగా, 2000 సంవత్సరంలో ఒక కుమార్తె జన్మించింది. అయితే, తన భర్త మరొక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని, జైపూర్‌ లోని ఒక హోటల్‌లో ఆమెతో కలిసి రూమ్ బుక్ చేసుకుని ఉన్నాడని భార్య బలమైన ఆధారాలతో గుర్తించింది. ఈ క్రమంలో ఆమె హిందూ వివాహ చట్టం కింద విడాకులు, మనోవర్తి కోసం ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది. కోర్టులో భర్త తప్పును బలంగా నిరూపించేందుకు అతని మొబైల్ కాల్ డిటైల్ రికార్డ్స్, హోటల్ రూమ్ బుకింగ్ వివరాలు, గుర్తింపు కార్డుల సమాచారాన్ని సేకరించాల్సిందిగా ఫ్యామిలీ కోర్టును కోరింది.

Also Read : అన్నం తిన్న తర్వాత విపరీతమైన బద్ధకం, నీరసం వస్తున్నాయా..?

దీనిని తీవ్రంగా ఆక్షేపిస్తూ భర్త దిల్లీ హైకోర్టుకు, ఆ తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్లాడు. తన భార్యతో ఉన్న వివాదంలో తన వ్యక్తిగత వివరాలను, కాల్ రికార్డులను సేకరించడం గోప్యతా హక్కుకు విరుద్ధమని, అది తన అంతర్గత విషయాల్లో చట్టవిరుద్ధమైన జోక్యం అని వాదించాడు. అయితే న్యాయస్థానం అతని వాదనను పూర్తిగా తిరస్కరిస్తూ, కుటుంబ వ్యవస్థను దెబ్బతీసే ఇలాంటి విషయాల్లో మోసాన్ని దాచడానికి చట్టాన్ని వాడుకోలేరని పేర్కొంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

కారుమూరి అరెస్ట్ కక్షసాధింపు...

వైసీపీ పాలనలో జరగని స్కామ్‌లు, జరగని...

వైసీపీ టైం లో...

కాకినాడ అసిస్టెంట్ ఇంజనీర్ నూకరాజు కుటుంబం...

విశాఖ స్టీల్ ప్లాంట్.....

విశాఖ స్టీల్ ప్లాంట్ పై కేంద్రం...

పథకం మంచిదే.. కానీ...

ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించాలనేది...

నాకేం సంబంధం లేదు.....

కాకినాడ: రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన...

కారుమూరికి ఈడీ షాక్..!

మద్యం రవాణా కుంభకోణం కేసులో కీలక...

పోల్స్