Saturday, June 20, 2026 07:33 PM
Saturday, June 20, 2026 07:33 PM

సాయికృష్ణ వ్యవహారంలో వైసీపీకి ఒరిగిందేమిటి?

సాయికృష్ణ ఘటనను ఆధారంగా చేసుకుని గత రెండు రోజులుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో రాజకీయ పోరాటం సాగించింది. ఈ ఘటనను కేవలం ఒక వ్యక్తిగత విషాదంగా కాకుండా, కాపు సామాజికవర్గానికి జరిగిన అన్యాయంగా చిత్రీకరిస్తూ ప్రభుత్వం లక్ష్యంగా విమర్శలు గుప్పించింది. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా విఫలమయ్యాయని, రెడ్‌బుక్ పాలన కొనసాగుతోందని, ఈ ఘటనకు హోం మంత్రి అనితతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నైతిక బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తూ రాజకీయంగా పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించింది.

Also Read : సాయికృష్ణ కేసులో వైసీపీ అసలు ఆసక్తి వేరే..!

ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత జగన్ స్వయంగా సాయికృష్ణ కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి మద్దతు ప్రకటించడం ద్వారా ఈ అంశాన్ని రాజకీయంగా తమకు అనుకూలంగా మలుచుకోవాలని ప్రయత్నించింది. ఈ వివాదం ద్వారా ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేక భావనను పెంచి, పార్టీకి రాజకీయంగా ప్రయోజనం చేకూరుతుందని వైసీపీ వర్గాలు ఆశించాయి. అయితే, తదుపరి పరిణామాలు ఆ అంచనాలకు పూర్తిగా భిన్నంగా మారాయి.

సాయికృష్ణ కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి, ప్రభుత్వం ఇప్పటికే వేగవంతమైన విచారణకు ఆదేశాలు జారీ చేసిందని, ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐ నాగరాజును సస్పెండ్ చేసిన విషయాన్ని గుర్తించి సంతృప్తి వ్యక్తం చేశారు. అంతేకాకుండా, తమకు ప్రభుత్వం అండగా నిలిచిందని, ముఖ్యమంత్రి చంద్రబాబు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌పై పూర్తి విశ్వాసం ఉందని బహిరంగంగా ప్రకటించారు. అలాగే తమ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన అన్ని రాజకీయ పార్టీలు మరియు మీడియాకు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ పరిణామాల అనంతరం వైసీపీ రాజకీయ వ్యూహంలో వైరుధ్యాలు స్పష్టంగా కనిపించాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నిన్నటి వరకు సీఐ నాగరాజుపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించిన నాయకులు, ఆయనను సస్పెండ్ చేసిన వెంటనే ప్రభుత్వం తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు పోలీసు అధికారులను బలి చేస్తోందని విమర్శించడం గమనార్హం. అలాగే, నిన్నటి వరకు సాయికృష్ణకు మద్దతుగా మాట్లాడిన నేతలు, ఇప్పుడు అతనిపై ఉన్న కేసుల సంఖ్యను ప్రస్తావిస్తూ భిన్నమైన వాదనలు వినిపించడం కూడా ప్రశ్నలను రేకెత్తిస్తోంది.

Also Read : తిరుపతిలో వడ్డీ మాఫియా.. భూమన అనుచరుల దందా..!

మొత్తంగా చూస్తే, ఒక సున్నితమైన అంశాన్ని పూర్తిగా రాజకీయ కోణంలో ఉపయోగించుకోవాలని చేసిన ప్రయత్నం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. బాధిత కుటుంబం స్వయంగా ప్రభుత్వంపై విశ్వాసం వ్యక్తం చేయడంతో, ఈ అంశం ద్వారా రాజకీయ మైలేజ్ పొందాలన్న వైసీపీ వ్యూహం ఆశించిన మేర ఫలించలేదనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. దీనితో, ఒకే అంశంపై పరిస్థితులకు అనుగుణంగా మారుతున్న వైఖరి పార్టీ ద్వంద్వ ప్రమాణాలపై కొత్త చర్చకు దారితీసింది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తిరుపతిలో కేఎఫ్‌సీ, డొమినోస్‌...

ప్రముఖ అంతర్జాతీయ ఫుడ్ బ్రాండ్ల ఆహార...

తిరుపతిలో వడ్డీ మాఫియా.....

తిరుపతి నగరంలో వడ్డీ వ్యాపారం పేరుతో...

సాయికృష్ణ కేసులో వైసీపీ...

విజయవాడ రౌడీ షీటర్‌ గాదె సాయికృష్ణ...

బ్రేకింగ్: అల్లు అర్జున్‌...

హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య...

తెలంగాణాలో జనసేన తొలి...

గత కొన్నాళ్ళుగా తెలంగాణాలో పార్టీ బలోపేతం...

బ్రేకింగ్: కొడాలి అరెస్ట్...

ఏపీలో వైసీపీ కీలక నేతలకు చట్టపరమైన...

పోల్స్