Saturday, June 20, 2026 05:22 PM
Saturday, June 20, 2026 05:22 PM

తిరుపతిలో కేఎఫ్‌సీ, డొమినోస్‌ ల ఫుడ్ తింటున్నారా..?

ప్రముఖ అంతర్జాతీయ ఫుడ్ బ్రాండ్ల ఆహార నాణ్యతపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్న తరుణంలో, ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో ఫుడ్ సేఫ్టీ అధికారులు జరిపిన మెరుపు దాడులు కలకలం రేపాయి. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, ఫుడ్ సేఫ్టీ విభాగం సంయుక్తంగా నగరంలోని భవానీ నగర్, ఎయిర్ బైపాస్ రోడ్డు పరిసరాల్లోని ప్రముఖ రెస్టారెంట్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు ఈ దాడుల్లో కేఎఫ్సి, డొమినోస్, మెక్‌ డొనాల్డ్స్, సబ్‌ వే వంటి అంతర్జాతీయ చైన్ రెస్టారెంట్లతో పాటు పలు స్థానిక హోటళ్లలో విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి.

Also Read : ప్రపంచంలోనే తొలి క్రికెటర్ గా స్మ్రితి మందన్న..!

ఈ తనిఖీల్లో ప్రధానంగా రెండు కేఎఫ్సీ ఔట్‌ లెట్లలో భారీ స్థాయిలో నిబంధనల ఉల్లంఘనలను అధికారులు గుర్తించారు. బెంగళూరు నుంచి తెప్పించిన దాదాపు 1,300 కిలోలకు పైగా చికెన్‌ ను నిబంధనలకు విరుద్ధంగా, అత్యంత అపరిశుభ్ర వాతావరణంలో నేలపై నిల్వ చేసినట్లు అధికారులు కనుగొన్నారు. ఈ మాంసం ఇప్పటికే కుళ్లిపోయి, తీవ్రమైన దుర్వాసన వస్తుండటంతో ప్రజా ఆరోగ్యానికి హానికరమని తేల్చారు. అలాగే ఆహార పదార్థాలపై ఉండాల్సిన కనీస గడువు లేబుళ్లు లేకపోవడాన్ని అధికారులు తీవ్రంగా పరిగణించారు.

Also Read : తిరుపతిలో వడ్డీ మాఫియా.. భూమన అనుచరుల దందా..!

నిబంధనలు ఉల్లంఘించినందుకు గానూ రెండు కేఎఫ్సీ సంస్థలకు నోటీసులు జారీ చేసి, ఒక్కొక్క దానికి రూ.10,000 చొప్పున జరిమానా విధించారు. ఈ ఉదంతం కేవలం తిరుపతికే పరిమితం కాకుండా, దేశవ్యాప్తంగా బ్రాండెడ్ ఫుడ్ ప్రియులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. నూడుల్స్ ప్యాకెట్లలో కల్తీ, ఆన్‌ లైన్ డెలివరీల్లో కీటకాలు రావడం, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో నాణ్యత లోపించడం వంటి వరుస ఘటనలపై ఇప్పటికే కేంద్ర ఆహార భద్రతా సంస్థ సుమోటోగా స్పందించి పలు అంతర్జాతీయ సంస్థలకు నోటీసులు ఇచ్చింది. వేల రూపాయలు ఖర్చు పెట్టి కార్పొరేట్ రెస్టారెంట్లను నమ్ముతున్న వినియోగదారులకు కుళ్లిన మాంసం, అపరిశుభ్రమైన ఆహారాన్ని వడ్డిస్తుండటంపై సామాన్య ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. బ్రాండ్ల ముసుగులో సాగుతున్న ఈ ప్రాణాంతక వ్యాపారాలపై ప్రభుత్వం మరింత కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తిరుపతిలో వడ్డీ మాఫియా.....

తిరుపతి నగరంలో వడ్డీ వ్యాపారం పేరుతో...

సాయికృష్ణ కేసులో వైసీపీ...

విజయవాడ రౌడీ షీటర్‌ గాదె సాయికృష్ణ...

బ్రేకింగ్: అల్లు అర్జున్‌...

హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య...

తెలంగాణాలో జనసేన తొలి...

గత కొన్నాళ్ళుగా తెలంగాణాలో పార్టీ బలోపేతం...

బ్రేకింగ్: కొడాలి అరెస్ట్...

ఏపీలో వైసీపీ కీలక నేతలకు చట్టపరమైన...

‘పెద్ది’కి బిగ్ సర్‌ప్రైజ్.....

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

పోల్స్