Thursday, September 17, 2026 10:45 PM
Thursday, September 17, 2026 10:45 PM

ప్రజల్లోకి వెళ్ళాల్సిందే.. చంద్రబాబు కీలక ఆదేశాలు..!

ఏపీలో అధికారుల తీరుపై విమర్శలు వస్తున్న నేపధ్యంలో సిఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేసారు. తాజాగా సిఎం చంద్రబాబు.. రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో అధికారుల పనితీరుపై కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం పాలనా బాధ్యతలు చేపట్టి రెండేళ్లు దాటిన నేపథ్యంలో, యంత్రాంగం అంతా అప్రమత్తంగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు. ఎక్కడా ఎటువంటి తప్పులు జరగకుండా, ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేయాలని హెచ్చరించారు.

Also Read : కాషాయ నేతలతో బీ కేర్ ఫుల్..!

పాలనను మరింత పారదర్శకంగా మార్చేందుకు ఇకపై అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించడం తప్పనిసరి అని ముఖ్యమంత్రి స్పష్టం చేసారు. ప్రజల్లోకి వెళ్ళకపోతే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు సిఎం. ఇందులో భాగంగా ప్రతి జిల్లా కలెక్టర్ తమ పరిధిలోని ప్రతి నియోజకవర్గాన్ని కనీసం నాలుగు సార్లు సందర్శించాలని సూచించారు. క్షేత్రస్థాయికి వెళ్లడం ద్వారానే ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని, వాటిని వేగంగా పరిష్కరించవచ్చని సీఎం అభిప్రాయపడ్డారు.

Also Read : దేవరకొండ అరుదైన గ్లోబల్ రికార్డ్..!

ఇకపై అధికారులు, ప్రభుత్వ ఉద్యోగుల పనితీరును కేవలం పైపైన కాకుండా 360 డిగ్రీల కోణంలో సమగ్రంగా విశ్లేషిస్తామని చంద్రబాబు వెల్లడించారు. అలాగే, ప్రజా సమస్యల పరిష్కారంలో మరింత పారదర్శకత కోసం ఒక కొత్త వ్యవస్థను తీసుకురాబోతున్నట్లు తెలిపారు. దీని ద్వారా ప్రజలు ఇచ్చే ఫిర్యాదులు ఏ దశలో ఉన్నాయో అర్జీదారులే స్వయంగా ట్రాక్ చేసుకునే వీలు కలుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

మరో వైసీపీ కీలక...

అనంతపురం జిల్లాలో జరుగుతోన్న అక్రమ మైనింగ్...

కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్‌హౌస్...

తెలంగాణ మాజీ సిఎం, బీఆర్ఎస్ అధినేత...

చంద్రబాబుపై కేంద్ర మంత్రి...

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత...

రచ్చకెక్కిన ఉత్తరాంధ్ర వైసీపీ...

శ్రీకాకుళం జిల్లాలో సుదీర్ఘ రాజకీయ అనుభవం...

గ్రామాల్లో అభివృద్ధి పండుగ,...

ఏపీ డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్...

నేను లండన్ వెళ్తా...

సోషల్ మీడియా సెలబ్రిటీ, ప్రముఖ యూట్యూబర్...

పోల్స్