Saturday, September 5, 2026 11:42 PM
Saturday, September 5, 2026 11:42 PM

బండి భగీరథ్‌ కు బిగుస్తున్న ఉచ్చు.. సంచలన పరిణామం..!

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కుమారుడు బండి భగీరథ్ సాయిపై నమోదైన పోక్సో కేసులో తెలంగాణ పోలీసులు దర్యాప్తును మరింత ముమ్మరం చేశారు. ఈ కేసుకు సంబంధించి ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయడంతో విచారణ శరవేగంగా సాగుతోంది. తాజా పరిణామాల్లో భాగంగా పోలీసులు గచ్చిబౌలి మరియు మొయినాబాద్ ప్రాంతాల్లో కీలకమైన క్షేత్రస్థాయి పరిశీలన జరిపి, సాంకేతిక ఆధారాలను సేకరించారు.

Also Read : నా కోసం ట్రాఫిక్ ఆపొద్దు.. లోకేష్ కీలక నిర్ణయం..!

ఈ హై-ప్రొఫైల్ కేసులో బాధితురాలైన 17 ఏళ్ల మైనర్ బాలికకు పోలీసులు నగరంలోని ప్రముఖ ఆసుపత్రిలో అధికారికంగా వైద్య పరీక్షలు నిర్వహించారు. ప్రాథమికంగా పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌ లో పోక్సో చట్టంలోని సెక్షన్ 11, 12 కింద నమోదైన ఈ కేసును, బాధితురాలి తాజా వాంగ్మూలం ఆధారంగా పోలీసులు మరింత దూకుడుగా విచారణ చేస్తున్నారు. ఈ కేసులో లైంగిక దాడి ఆరోపణలు తోడవడంతో, మరింత తీవ్రమైన ‘అగ్రివేటెడ్ పెనెట్రేటివ్ సెక్షన్స్’ ను ఎఫ్‌ఐఆర్ లో జోడించారు.

Also Read : విరాట్ కోహ్లీ విశ్వరూపం.. కోహ్లీ ఖాతాలో కొత్త రికార్డులు..!

గత ఏడాది డిసెంబర్ 31న మొయినాబాద్‌ లోని ఒక ఫామ్‌ హౌస్‌ లో ఈ ఘటన జరిగినట్లు బాధితురాలి కుటుంబ సభ్యులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో విచారణాధికారులు మొయినాబాద్‌ ఫామ్‌ హౌస్‌ తో పాటు గచ్చిబౌలిలోని పలు ప్రాంతాలను సందర్శించారు. నిందితుడు, బాధితురాలి మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా సిల్వార్ లొకేషన్లు, సీసీటీవీ ఫుటేజీలు మరియు డిజిటల్ ల్యాగ్స్ వంటి సాంకేతిక ఆధారాలను ఐటీ నిపుణుల సాయంతో సేకరించారు. కూకట్పల్లి డీసీపీ నేతృత్వంలో ప్రత్యేక బృందాలు బాధితురాలి ఇంటికి వెళ్లి సుదీర్ఘంగా వివరాలు సేకరించినట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ కేసుపై విచారణ జరిపేందుకు సిట్ అధికారులు నిందితుడు భగీరథ్‌కు నోటీసులు జారీ చేసి, విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. అయితే, భగీరథ్ ఈ పోలీసు విచారణకు హాజరుకాలేదు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ప్లేట్ తిప్పేసిన రాజగోపాల్...

తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో గత కొంతకాలంగా...

ఏపీ ఉద్యోగులకు సీఎం...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సుదీర్ఘకాల సమస్యల...

టీవీకే టార్గెట్‌లో డీఎంకే...

తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త రణం మొదలైంది....

ఏపీ రాజకీయాల్లో బిగ్...

ఏపీ రాజకీయాల్లో అత్యంత సీనియర్ నాయకుడు,...

సాయి రెడ్డి పార్టీకి...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత కొన్నాళ్ళుగా తీవ్ర...

తెలంగాణలో రేపే మంత్రివర్గ...

తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా...

పోల్స్