సాధారణంగా రాజకీయ నాయకులు వెళ్తున్న సమయంలో పెద్ద ఎత్తున ట్రాఫిక్ ను ఆపేస్తూ ఉంటారు అధికారులు. ప్రజా ప్రతినిధుల పర్యటనలకు ఏ విధమైన ఆటంకాలు ఉండకూడదు అనే ఉద్దేశంతో పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేయడం మనం చూస్తూనే ఉంటాం. అయితే ట్రాఫిక్ ఎక్కువగా ఉండే సమయాల్లో.. ఇలా ఆపడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ నేపధ్యంలో.. తనపై విమర్శలు రాకుండా ఉండేందుకు.. ఏపీ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
Also Read : పొదుపు మొదలుపెట్టిన మోడీ.. కీలక నిర్ణయాలు..!
సాధారణ ప్రజలకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ఆయన తీసుకున్న ఒక కీలక నిర్ణయం ఇప్పుడు సోషల్ మీడియాలో, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. తాజాగా విజయవాడలోని మహానాడు కూడలి మీదుగా మంత్రి నారా లోకేశ్ కాన్వాయ్ వెళ్తున్న సమయంలో, భద్రతా కారణాల రీత్యా అక్కడి ట్రాఫిక్ పోలీసులు సాధారణ వాహనాల రాకపోకలను నిలిపివేశారు. దీనితో రోడ్డుపై పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. తన ప్రయాణం కారణంగా రోడ్డుపై కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరడాన్ని నారా లోకేశ్ తన కారులో నుంచే గమనించారు.
Also Read : హార్దిక్ పాండ్యా ఒంటరిగా ప్రాక్టీస్.. జట్టుతో విభేదాలే కారణమా..?
ప్రజలు పడుతున్న ఇబ్బందిని చూసి ఆయన వెంటనే స్పందించారు. విజయవాడ ట్రాఫిక్ పోలీసులకు మంత్రి లోకేశ్ కీలక సూచనలు చేశారు. ఇకపై తన పర్యటనలు, ప్రయాణాల సమయంలో భద్రత పేరుతో సాధారణ ప్రజలను ఇబ్బంది పెడుతూ ట్రాఫిక్ నిలిపివేయవద్దని ఆయన స్పష్టం చేశారు. విధుల్లో ఉండే వీఐపీల కంటే ప్రజల సమయమే అత్యంత విలువైందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక లోకేష్ నిర్ణయంతో అటు ఇతర మంత్రులు కూడా ఈ నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారు. మంత్రి తీసుకున్న ఈ నిర్ణయం పట్ల వాహనదారులు, విజయవాడ నగర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

