ప్రస్తుతం పశ్చిమాసియా దేశాల మధ్య జరుగుతున్న యుద్ధ వాతావరణం, అంతర్జాతీయ ఉద్రిక్తతల కారణంగా ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన ఇంధన, విద్యుత్ సంక్షోభం తలెత్తింది. ముడిచమురు సరఫరాకు కీలకమైన స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ మార్గం గుండా రవాణా నిలిచిపోవడంతో అన్ని దేశాలు అప్రమత్తమయ్యాయి. ఈ సంక్షోభాన్ని తట్టుకునేందుకు వివిధ దేశాలు తమ పౌరులపై విధిస్తున్న ఆంక్షలు, తీసుకుంటున్న కఠినమైన పొదుపు చర్యల గురించి ఓ లుక్ వేద్దాం. గల్ఫ్ సంక్షోభం నేపథ్యంలో ఇంధన వినియోగాన్ని, విదేశీ మారక నిల్వలను కాపాడుకోవడానికి ప్రపంచ దేశాలు లాక్ డౌన్ తరహా కఠిన నిబంధనలను అమలు చేస్తున్నాయి.
Also Read : పొదుపు మొదలుపెట్టిన మోడీ.. కీలక నిర్ణయాలు..!
అమెరికా: పెట్రోల్ వినియోగాన్ని తగ్గించేందుకు అనేక రాష్ట్రాల్లో ఐటీ, ఇతర రంగాల ఉద్యోగులను వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాల్సిందిగా ప్రోత్సహిస్తున్నాయి.
పాకిస్తాన్: తీవ్ర ఇంధన కొరత కారణంగా పాకిస్తాన్ సూపర్ లీగ్ క్రికెట్ మ్యాచ్ లను మైదానాల్లో ప్రేక్షకులు లేకుండా ఖాళీ స్టేడియాల్లో నిర్వహించారు. అంతేకాకుండా వారానికి 4 రోజులు మాత్రమే పనిదినాలుగా మార్చి, పాఠశాలలను మూసివేశారు.
దక్షిణ కొరియా: విద్యుత్ డిమాండ్‌ను తగ్గించడానికి వాషింగ్ మెషీన్లు, వాక్యూమ్ క్లీనర్లను కేవలం వారాంతాల్లో మాత్రమే వాడాలని ప్రభుత్వం పౌరులను కోరింది.
శ్రీలంక: ఇంధనాన్ని ఆదా చేసేందుకు వీలుగా ప్రతీ బుధవారాన్ని జాతీయ సెలవు దినంగా ప్రకటించింది.
బంగ్లాదేశ్: రాత్రి 7 గంటలకల్లా షాపింగ్ మాళ్లను మూసివేయాలని ఆదేశించింది. అలంకరణ విద్యుత్ దీపాలపై పూర్తిగా నిషేధం విధించింది.
Also Read : లోకేష్ ట్వీట్స్ కు ఇంటర్నేషనల్ క్రేజ్.. ఇండస్ట్రీ వర్గాల్లో ఎందుకీ చర్చ..?
థాయిలాండ్: ప్రభుత్వ, ప్రైవేట్ ఆఫీసులలో ఏసీల ఉష్ణోగ్రతను ఖచ్చితంగా 27°C వద్ద ఉంచాలని సూచించింది. ఏసీ వాడకం తగ్గించేందుకు కోట్లు, టైలు ధరించవద్దని ఉద్యోగులకు స్పష్టం చేసింది.
యూకే & జర్మనీ: బ్రిటన్ హైవేలపై వాహనాల వేగ పరిమితిని 80 కిలోమీటర్లకు తగ్గించగా, జర్మనీ ఇంధన పొదుపు కోసం ‘కార్-ఫ్రీ సండేస్’ అమలు చేస్తోంది.
ఫ్రాన్స్: రైలు ప్రయాణానికి 3 గంటల కంటే తక్కువ సమయం పట్టే నగరాల మధ్య షార్ట్-డిస్టెన్స్ విమాన సర్వీసులను పూర్తిగా బ్యాన్ చేసింది.
మిగిలిన దేశాలతో పోలిస్తే భారత ప్రభుత్వం ప్రజలపై ఎలాంటి తప్పనిసరి కఠిన ఆంక్షలు కానీ, లాక్ డౌన్ లు కానీ విధించలేదు. అయితే, భవిష్యత్తులో రాబోయే ముప్పును తట్టుకోవడానికి మరియు దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడటానికి మన దేశంలోనూ ముందస్తు పొదుపు చర్యలు ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ ఒత్తిడిని తట్టుకోవడానికి అనవసర విదేశీ ప్రయాణాలు, బంగారం కొనుగోళ్లు తాత్కాలికంగా తగ్గించాలని, వీలైనంత వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ను పునరుద్ధరించాలని ప్రధాని నరేంద్ర మోదీ దేశప్రజలకు విజ్ఞప్తి చేశారు.

