ఏపీ ఐటీ, పారిశ్రామిక శాఖ మంత్రి నారా లోకేష్ సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకుంటున్న ఇండస్ట్రీ అప్డేట్స్ ఇప్పుడు నెట్టింట విపరీతమైన హైప్ క్రియేట్ చేస్తున్నాయి. సాంప్రదాయ పద్ధతులకు భిన్నంగా, కార్పొరేట్ శైలి ప్రమోషన్స్ తో ఆయన ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నారు. తాజాగా శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ప్రతిష్టాత్మక డిఫెన్స్ ప్రాజెక్ట్‌పై ఆయన చేసిన ట్వీట్, దానికి జత చేసిన ఏఐ ఓ రేంజ్ లో వైరల్ అవుతోంది. రాష్ట్ర పారిశ్రామిక రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లే క్రమంలో నారా లోకేష్ సోషల్ మీడియా వేదికగా అనుసరిస్తున్న సరికొత్త మార్కెటింగ్ వ్యూహాలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
Also Read : ప్రసంగించడానికి వెళ్లి పెట్టుబడులతో వచ్చిన బాబు
పెట్టుబడుల ప్రకటనలను కేవలం అధికారిక ప్రెస్ మీట్ లకే పరిమితం చేయకుండా, డిజిటల్ ప్లాట్ ఫారమ్స్ ద్వారా జనాల్లోకి స్మార్ట్ గా తీసుకువెళ్లడంలో ఆయన సక్సెస్ అవుతున్నారు. ఇటీవల విశాఖ వేదికగా గూగుల్ ఏఐ డేటా సెంటర్ వంటి మెగా ప్రాజెక్టుల శంకుస్థాపన ప్రకటనలతో జోష్ నింపిన లోకేష్, ఇప్పుడు రాయలసీమ రక్షణ రంగ ముఖచిత్రాన్ని మార్చే సరికొత్త అప్‌డేట్‌తో ముందుకొచ్చారు. “ఈనెల 15న పుట్టపర్తి నుంచి ఏం టేకాఫ్ అవుతుందో ఊహించగలరా..?” అంటూ ఆయన ఒక సస్పెన్స్ టీజర్‌ను వదిలారు.
ఈ ట్వీట్ చూసిన దేశీయ మరియు అంతర్జాతీయ డిఫెన్స్ కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్‌లు సైతం ఏపీ వైపు ఆసక్తిగా చూస్తున్నారు. భారత రక్షణ రంగానికి చెందిన అత్యంత ప్రతిష్టాత్మక ఐదో తరం స్టెల్త్ యుద్ధ విమానాల తయారీ, రక్షణ పరిశోధనల కోసం డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఈ భారీ ఏరోస్పేస్ ప్రాజెక్ట్ ను పుట్టపర్తిలో ఏర్పాటు చేస్తున్నారు. ఈ మెగా ప్రాజెక్ట్ ద్వారా భవిష్యత్తులో దాదాపు రూ. 1 లక్ష కోట్ల పెట్టుబడులు ఏపీకి తరలిరావడానికి మార్గం సుగమం కానుంది.
ఈ చారిత్రాత్మక ప్రాజెక్టుకు ఈ నెల మే 15న కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలిసి పుట్టపర్తిలో భూమిపూజ చేయనున్నారు. ఇందుకోసం పుట్టపర్తి విమానాశ్రయం రన్‌వే సమీపంలో దాదాపు 600 ఎకరాల వ్యూహాత్మక స్థలాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే కేటాయించింది. ఈ భారీ ప్రాజెక్టు కార్యరూపం దాల్చితే రాయలసీమ ప్రాంతంలో దాదాపు 20,000 మందికిపైగా ఐటీ, డిఫెన్స్ మరియు అనుబంధ రంగాలలో సరికొత్త ఉపాధి అవకాశాలు లభించనున్నాయని అధికారిక వర్గాల అంచనా.
Also Read : ‘శంబాల’ మ్యాజిక్ రిపీట్ కానుందా..?
ఇటీవలే విశాఖలో గూగుల్ ఏఐ హబ్, చిత్తూరు పరిసరాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ ప్లాంట్ వంటి అంతర్జాతీయ బ్రాండ్లను రాష్ట్రానికి తెచ్చిన ప్రభుత్వం, ఇప్పుడు డిఫెన్స్ రంగాన్ని కూడా చేజిక్కించుకుంది. ఈ భారీ విజయాలను లోకేష్ ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ పద్ధతిలో, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ స్ఫూర్తితో సరికొత్త వీడియోలు మరియు గ్రాఫిక్స్ తో ప్రమోట్ చేస్తుండటంతో, దేశ విదేశీ పారిశ్రామిక వేత్తల్లో ఏపీ బ్రాండ్ ఇమేజ్ శరవేగంగా దూసుకుపోతోంది. కేవలం ఐటీ మాత్రమే కాదు, దేశ రక్షణను శాసించే యుద్ధ విమానాల తయారీకి కూడా ఆంధ్రప్రదేశ్ కేరాఫ్ అడ్రస్‌గా మారుతోందనడానికి లోకేష్ లేటెస్ట్ ట్వీట్లే నిదర్శనంగా నిలుస్తున్నాయి.

