Thursday, May 14, 2026 04:02 PM
Thursday, May 14, 2026 04:02 PM

విరాట్ కోహ్లీ విశ్వరూపం.. కోహ్లీ ఖాతాలో కొత్త రికార్డులు..!

రాయ్‌పూర్‌ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్‌ తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రన్‌ మెషీన్ విరాట్ కోహ్లీ దుమ్ము రేపాడు. గత రెండు మ్యాచ్‌ లలో వరుసగా డకౌట్ అయి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న కింగ్ కోహ్లీ, ఈ మ్యాచ్‌ లో క్లాసిక్ కంబ్యాక్‌ తో విమర్శకుల నోళ్లు మూయించాడు. కోల్కతా నిర్దేశించిన 193 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించే క్రమంలో కోహ్లీ కేవలం 60 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 105 పరుగులు చేసి నాటౌట్‌ గా నిలిచాడు. కోహ్లీకి తోడుగా దేవదత్ పడిక్కల్ 37 పరుగులతో రాణించడంతో ఆర్సీబీ 19.1 ఓవర్లలోనే 6 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది.

Also Read : నా కోసం ట్రాఫిక్ ఆపొద్దు.. లోకేష్ కీలక నిర్ణయం..!

ఈ అద్భుత ఇన్నింగ్స్ ద్వారా విరాట్ కోహ్లీ అంతర్జాతీయ టీ20 క్రికెట్ చరిత్రలోనే అత్యంత అరుదైన ప్రపంచ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. టీ20 ఫార్మాట్‌లో అత్యంత వేగంగా 14,000 పరుగులు పూర్తి చేసిన బ్యాటర్‌ గా కోహ్లీ సరికొత్త చరిత్ర సృష్టించాడు. గతంలో ఈ రికార్డు వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్.. పేరిట ఉండేది. అతను 423 ఇన్నింగ్స్‌ లలో చేయగా.. కోహ్లీ కేవలం 409 ఇన్నింగ్స్‌ ల్లోనే ఈ మైలురాయిని అధిగమించి అగ్రస్థానానికి చేరుకున్నాడు.

Also Read : నీట్ పేపర్ లీక్ కేసు.. దొంగ దొరికాడు..!

తేకాకుండా, టీ20 క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో కోహ్లీ.. 10 సెంచరీలతో డేవిడ్ వార్నర్‌ తో కలిసి సంయుక్తంగా మూడో స్థానంలో నిలిచాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్‌ గా తనకున్న రికార్డును కోహ్లీ ఈ మ్యాచ్‌ తో మరింత సుస్థిరం చేసుకున్నాడు. కోహ్లీ ఖాతాలో ఇప్పుడు మొత్తం 9 ఐపీఎల్ శతకాలు చేరాయి. ఈ జాబితాలో జోస్ బట్లర్ 7 సెంచరీలతో రెండో స్థానంలో ఉన్నాడు. కాగా.. ఈ విజయంతో ఆర్సీబీ జట్టు పాయింట్ల పట్టికలో గుజరాత్ టైటాన్స్‌ ను వెనక్కి నెట్టి అగ్రస్థానానికి దూసుకెళ్లింది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

బండి భగీరథ్‌ కు...

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి...

పొదుపు బాటలో ఏపీ...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పొదుపు...

నా కోసం ట్రాఫిక్...

సాధారణంగా రాజకీయ నాయకులు వెళ్తున్న సమయంలో...

దస్తగిరి హ*త్య కేసులో...

కడపలో సంచలనంగా మారిన రియల్ ఎస్టేట్...

సీమకు రాయల్ కళ.....

పారిశ్రామిక అభివృద్ధిలో ఏపీ దూసుకెళ్తోంది. కొంతకాలంగా...

లోకేష్ ట్వీట్స్ కు...

ఏపీ ఐటీ, పారిశ్రామిక శాఖ మంత్రి...

పోల్స్