నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రస్తుతం తన కెరీర్ లో ఎప్పుడూ లేనంత స్పీడ్ గా సినిమాలు చేస్తున్నారు. టాలీవుడ్ లో యంగ్ హీరోలు తమ సినిమాలను లేట్ గా రిలీజ్ చేస్తున్న టైంలో బాలయ్య మాత్రం వాళ్లకు అందని రేంజ్ లో సినిమాలు చేస్తున్నాడు. వరుస విజయాలతో జోరు మీదున్న బాలయ్య, తన తదుపరి చిత్రాన్ని కేవలం తెలుగుకే పరిమితం చేయకుండా జాతీయ స్థాయిలో నిలబెట్టాలని పక్కా ప్లానింగ్ తో ఉన్నట్లు తెలుస్తోంది. దీని కోసం మేకర్స్ భారీ ఎత్తున ఇతర భాషల నటీనటులను రంగంలోకి దింపుతున్నారు.
Also Read : ఆ ఇద్దరికి ప్రతిపక్ష హోదా వస్తుందా..?
ఈ చిత్రంలో కథానాయికగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ విద్యాబాలన్ ను ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో ఎన్టీఆర్ బయోపిక్ లో బసవతారకం పాత్రలో ఆమె బాలయ్య సరసన నటించి మెప్పించారు. ఆ సినిమాలో వారిద్దరి మధ్య ఉన్న స్క్రీన్ ప్రెజెన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు మరోసారి ఈ క్రేజీ కాంబినేషన్ ను రిపీట్ చేయడం ద్వారా హిందీ మార్కెట్ ను కూడా ఆకర్షించాలని చిత్ర బృందం భావిస్తోంది. ఈ ప్రాజెక్టులో మరో హైలైట్ ఏమిటంటే, బాలీవుడ్ దిగ్గజ నటుడు సంజయ్ దత్ కీలక పాత్రలో నటించనుండటం.
Also Read : సీఎం రాజీనామా చేయకపోతే..? రాజ్యాంగం ఏం చెప్తుంది..?
కేజిఎఫ్ 2, లియో వంటి సినిమాలతో సౌత్ ఇండియాలో విలన్ పాత్రలకు సరికొత్త నిర్వచనం చెప్పిన సంజయ్ దత్, బాలయ్యకు ధీటైన విలన్ గా కనిపించబోతున్నారని ప్రచారం జరుగుతోంది. బాలయ్య మాస్ యాక్షన్ కు, సంజూ బాబా పవర్ ఫుల్ విలనీ తోడైతే థియేటర్లు దద్దరిల్లడం ఖాయమని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు. కేవలం తెలుగు ప్రేక్షకుల్నే కాకుండా, ఉత్తరాది ప్రేక్షకులను కూడా దృష్టిలో ఉంచుకుని ఈ పాన్ ఇండియా ప్లానింగ్ చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఇతర భాషల ప్రముఖ నటులను తీసుకోవడం వల్ల సినిమా మార్కెట్ విలువ పెరగడమే కాకుండా, దేశవ్యాప్తంగా అంచనాలు కూడా భారీగా పెరుగుతాయి. బాలయ్య మార్క్ డైలాగులు, యాక్షన్ కు బాలీవుడ్ స్టార్లు తోడైతే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులను సృష్టించే అవకాశం ఉంది.

