Saturday, June 20, 2026 09:42 PM
Saturday, June 20, 2026 09:42 PM

సంక్షోభంలో ముంబై ఇండియన్స్.. కెప్టెన్సీపై యాజమాన్యం కీలక నిర్ణయం..!

ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్టుగా పేరుగాంచిన ముంబై ఇండియన్స్, ప్రస్తుత 2026 సీజన్‌లో తీవ్ర పరాజయాలతో సతమతమవుతోంది. 10 మ్యాచ్‌ లు ఆడిన ముంబై, కేవలం మూడింటిలో మాత్రమే విజయం సాధించి పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. దీంతో ఈ ఏడాది ప్లేఆఫ్స్ రేసు నుండి ముంబై దాదాపు నిష్క్రమించినట్లే కనిపిస్తోంది. గుజరాత్ టైటాన్స్ నుండి ముంబైకి తిరిగి వచ్చిన హార్దిక్ పాండ్యాకు ఆరంభం నుండే ఎదురుదెబ్బలు తగిలాయి.

Also Read : బీజేపీ ప్లాన్ వర్కవుట్ అవుతుందా..?

మొదటి ఏడాది(2024) లో ముంబై 10 జట్లలో చివరి స్థానంలో నిలవడమే కాకుండా, సొంత మైదానం వాంఖడేలో హార్దిక్ అభిమానుల నుండి తీవ్ర అవమానాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. 2025లో జట్టు 4వ స్థానానికి చేరుకుని పుంజుకున్నట్లు అనిపించినా, 2026 సీజన్ మళ్లీ పాత కష్టాలను తెచ్చిపెట్టింది. జట్టు వరుస వైఫల్యాలు ఎదుర్కొంటున్నప్పటికీ, కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై ఫ్రాంచైజ్ యాజమాన్యం పూర్తి విశ్వాసాన్ని వ్యక్తం చేస్తోంది. జాతీయ మీడియా కథనం ప్రకారం, ప్రకారం.. ఈ ఓటములకు హార్దిక్ నాయకత్వ లోపం కారణమని యాజమాన్యం భావించడం లేదట.

Also Read : ఇన్ అండ్ అవుట్.. ముహుర్తం ఫిక్స్..!

దానికి బదులుగా, ఆధునిక ఐపీఎల్ లో మారుతున్న ఆట శైలికి అనుగుణంగా జట్టు వేగంగా మారలేకపోవడమే ప్రధాన సమస్య అని వారు విశ్లేషిస్తున్నారని పేర్కొంది. ముంబై యాజమాన్యం దృష్టిలో ఆట శైలిని మార్చుకోవడం అంటే.. ప్రధానంగా రెండు అంశాలు ఉన్నాయి. పవర్‌ప్లే లోనే ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడే ఓపెనర్లు ఉండాలి. పవర్‌ ప్లేతో పాటు డెత్ ఓవర్లలో కూడా వికెట్లు తీస్తూ పరుగులను నియంత్రించగల బౌలర్లు అవసరం. ప్రస్తుతానికి పాండ్యా నాయకత్వానికి డోకా లేకపోయినా, రాబోయే సీజన్లలో జట్టు ప్రదర్శనను మార్చడానికి భారీ మార్పులు జరిగే అవకాశం ఉంది. ఈ గడ్డు కాలాన్ని ముంబై ఎలా అధిగమిస్తుందో వేచి చూడాలి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తిరుపతిలో కేఎఫ్‌సీ, డొమినోస్‌...

ప్రముఖ అంతర్జాతీయ ఫుడ్ బ్రాండ్ల ఆహార...

తిరుపతిలో వడ్డీ మాఫియా.....

తిరుపతి నగరంలో వడ్డీ వ్యాపారం పేరుతో...

సాయికృష్ణ కేసులో వైసీపీ...

విజయవాడ రౌడీ షీటర్‌ గాదె సాయికృష్ణ...

బ్రేకింగ్: అల్లు అర్జున్‌...

హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య...

తెలంగాణాలో జనసేన తొలి...

గత కొన్నాళ్ళుగా తెలంగాణాలో పార్టీ బలోపేతం...

బ్రేకింగ్: కొడాలి అరెస్ట్...

ఏపీలో వైసీపీ కీలక నేతలకు చట్టపరమైన...

పోల్స్