Wednesday, May 6, 2026 05:04 PM
Wednesday, May 6, 2026 05:04 PM

బీజేపీ ప్లాన్ వర్కవుట్ అవుతుందా..?

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి వేడి రాజుకుంది. ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన ఖరారు కావడంతో రాష్ట్ర బీజేపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మోదీ తొలిసారి తెలంగాణ గడ్డపై అడుగుపెడుతుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. మే 10న హైదరాబాద్ వేదికగా జరగనున్న ఈ పర్యటన కేవలం ప్రభుత్వ కార్యక్రమాలకే పరిమితం కాకుండా, రాబోయే ఎన్నికలకు శంఖారావంగా మారుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.మే 10న హైదరాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్‌లో భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు బీజేపీ సర్వసన్నద్ధమవుతోంది. ఈ సభకు ‘జనాగ్రహ సభ’ అని పేరు పెట్టంది.

Also Read : ఆ ఇద్దరికి ప్రతిపక్ష హోదా వస్తుందా..?

గత ఎన్నికల్లో సాధించిన విజయాలు, ప్రభుత్వ వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకోవాలనే లక్ష్యంతో ఈ సభకు జనాగ్రహ సభ అనే పేరును ఖరారు చేసినట్లు కమలం పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ సభ ద్వారా రాష్ట్రంలోని అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ పార్టీలపై నేరుగా విమర్శనాస్త్రాలు సంధించే అవకాశం ఉంది. రాష్ట్రవ్యాప్తంగా భారీ ఎత్తున జన సమీకరణ చేసి, కేడర్‌లో నూతన ఉతేజాన్ని నింపాలని హైకమాండ్ భావిస్తోంది. రాజకీయ సభతో పాటు, హైదరాబాద్ పరిధిలో దాదాపు రూ.7,700 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.

మౌలిక సదుపాయాలు, రవాణా, ఇతర ప్రజాహిత కార్యక్రమాలకు సంబంధించిన భారీ కేటాయింపుల ద్వారా తెలంగాణ అభివృద్ధిపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించిందనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీజేపీ భావిస్తోంది. ఈ ఏడాది జరగనున్న జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ తన అడుగులు వేస్తోంది. గత ఎన్నికల్లో అనూహ్య రీతిలో పుంజుకున్న బీజేపీ, కాంగ్రెస్‌ను మూడో స్థానానికి పరిమితం చేసి ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది. ఈసారి ఎలాగైనా మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది. మే 4న విడుదలైన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో 3 చోట్ల బీజేపీ ఘనవిజయం సాధించడంతో కాషాయ పార్టీ నేతలు రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తున్నారు. ఆ గెలుపు ఉత్సాహంతో తెలంగాణలో ‘ఆపరేషన్ తెలంగాణ’ ప్రారంభించి, దక్షిణాదిలో తన పట్టును మరింత బిగించాలని చూస్తోంది.

Also Read : నిజంగా కేసీఆర్ కు పుడితే.. బండి సంజయ్ సంచలనం..!

కర్ణాటక తర్వాత దక్షిణాదిలో తెలంగాణానే తమకు అనుకూలమైన రాష్ట్రమని బీజేపీ మొదటి నుంచీ చెబుతోంది. అయితే, రాష్ట్ర పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలు కొంతకాలంగా ఇబ్బందికరంగా మారాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర నాయకత్వం నేరుగా రంగంలోకి దిగింది. వర్గపోరుకు చెక్ పెట్టి, పార్టీని బలోపేతం చేసేందుకు హైకమాండ్ ప్రత్యేక కార్యాచరణను రూపొందించింది. ప్రధాని మోదీ పర్యటన ద్వారా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసి, కాంగ్రెస్, బీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగట్టాలని పిలుపునివ్వనున్నారు. మొత్తానికి మే 10న జరిగే ప్రధాని మోదీ పర్యటన తెలంగాణ రాజకీయాల్లో పెను మార్పులకు నాంది పలుకుతుందా? ‘జనాగ్రహ సభ ద్వారా బీజేపీ తన సత్తా చాటుతుందా? అనేది ఇప్పుడు అత్యంత ఆసక్తికరంగా మారింది. ఒకవైపు అభివృద్ధి పనులు, మరోవైపు రాజకీయ ఎతుగడలతో తెలంగాణను కైవసం చేసుకునేందుకు కమలనాథులు వేస్తున్న స్కెచ్ ఏ మేరకు పారుతుందో వేచి చూడాలి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఏపీకి మరో దిగ్గజ...

ఏపీకి అంతర్జాతీయ పరిశ్రమలు క్యూ కడుతున్నాయి....

ఇన్ అండ్ అవుట్.....

తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి రెండున్నరేళ్లు...

ఏపీ ఐపీఎస్ ను...

ఆంధ్రప్రదేశ్‌ లో సంచలనం సృష్టించిన సినీ...

విజయ్ చుట్టూ ఏపీ..వైసీపీ...

తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ...

నిజంగా కేసీఆర్ కు...

తెలంగాణ రాజకీయాల్లో అధికార కాంగ్రెస్, విపక్ష...

ఆ సీటు త్రిషకా.....

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ‘తమిళిగ...

పోల్స్