Saturday, September 19, 2026 02:25 PM
Saturday, September 19, 2026 02:25 PM

ఆ సీటు త్రిషకా.. తండ్రికా..?

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ‘తమిళిగ వెట్రి కజగం’ అధినేత విజయ్ సరికొత్త చరిత్ర సృష్టించారు. తాను పోటీ చేసిన తిరుచ్చి ఈస్ట్ మరియు పెరంబూర్.. రెండు నియోజకవర్గాల్లోనూ విజయ్ భారీ మెజారిటీతో విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు. అయితే, నిబంధనల ప్రకారం ఒక అభ్యర్థి రెండు చోట్ల గెలిస్తే, ఒక స్థానానికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆ ఖాళీ అయ్యే స్థానంలో ఎవరు పోటీ చేస్తారు..? దళపతి వారసురాలిగా ఎవరు బరిలోకి దిగుతారు..? అన్న చర్చ తమిళ రాజకీయాల్లో సెన్సేషన్‌గా మారింది.

Also Read : నటన కోసం డిగ్రీ వదిలేసి.. సీఎం అయ్యాడు..!

విజయ్ రాజీనామా చేసే స్థానంలో నటి త్రిష పోటీ చేస్తారనే వార్తలు ఇప్పుడు కోలీవుడ్ నుంచి కోట వరకు మార్మోగిపోతున్నాయి. దీనికి బలం చేకూర్చేలా గతంలో టిక్కెట్ల కేటాయింపు సమయంలో టీవీకే కీలక నేతలు త్రిష నివాసం వద్ద క్యూ కట్టినట్లు వార్తలు వచ్చాయి. పార్టీ అంతర్గత వ్యవహారాల్లో, అభ్యర్థుల ఎంపికలో ఆమె కీలక పాత్ర పోషించారని, విజయ్‌కు అత్యంత నమ్మకస్తురాలిగా పేరు తెచ్చుకున్నారని పార్టీ వర్గాల్లో టాక్. దీంతో విజయ్ ఖాళీ చేసే స్థానానికి ఆమెనే సరైన అభ్యర్థి అని మెజారిటీ నేతలు అభిప్రాయపడుతున్నారు.

Also Read : గుంటూరు గడ్డపై మరో పెమ్మసాని మార్క్ సక్సెస్..!

మరోవైపు, విజయ్ తండ్రి, ప్రముఖ దర్శకుడు ఎస్.ఏ. చంద్రశేఖరన్ కూడా బరిలో ఉంటారని మరికొందరు విశ్లేషిస్తున్నారు. రాజకీయాల్లో తలపండిన ఆయనకు అవకాశం ఇస్తే అసెంబ్లీలో విజయ్‌కు అండగా ఉంటారని భావిస్తున్నారు. అయితే, యువత మరియు మహిళా ఓటర్లను ఆకర్షించాలంటే త్రిషనే బెటర్ అని యువ కేడర్ పట్టుబడుతోంది. మరోవైపు, అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు గవర్నర్‌కు లేఖ రాయడంతో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఒకవేళ విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడితే, తన మంత్రివర్గంలో త్రిషకు చోటు కల్పించే అవకాశం ఉందనే ప్రచారం కూడా జరుగుతోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

25 రోజుల తర్వాత...

ఏపీ డిప్యూటి సీఎం, జనసేన అధినేత...

ఏపీలో మద్యం షాపుల...

ఆంధ్రప్రదేశ్‌లో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను...

బాంబు పేల్చిన టీడీపీ...

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ...

ఏపీ లిక్కర్ కుంభకోణం.....

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత వైఎస్సార్ కాంగ్రెస్...

రేవంత్ దెబ్బ.. బీఆర్ఎస్‌కు...

ఏదో అనుకుంటే.. మరేదో జరిగినట్లు ఉంది...

దానం నాగేందర్ కు...

ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు తెలంగాణ...

పోల్స్