Sunday, June 21, 2026 02:31 AM
Sunday, June 21, 2026 02:31 AM

గుంటూరు గడ్డపై మరో పెమ్మసాని మార్క్ సక్సెస్..!

గుంటూరు జిల్లా రైతాంగానికి కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించింది. జిల్లాలోని సాగు, తాగునీటి అవసరాలను తీర్చే అత్యంత కీలకమైన గుంటూరు ఛానెల్ ఆధునీకరణ పనులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ ప్రాజెక్టు కోసం ఏకంగా రూ. 369.20 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో రైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకున్న ఈ నిర్ణయం పట్ల కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Also Read : బ్రేకింగ్: ప్రభుత్వం ఏర్పాటు చేస్తా: విజయ్ 

ఈ ప్రాజెక్టులో భాగంగా మొత్తం 74 కిలోమీటర్ల మేర గుంటూరు ఛానెల్‌ ను విస్తరించనున్నారు. ఈ విస్తరణ ద్వారా ప్రస్తుతం ఉన్న 27 వేల ఎకరాల ఆయకట్టు ఏకంగా 75 వేల ఎకరాలకు పెరగనుంది. అంటే దాదాపు 48 వేల ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరు అందుబాటులోకి వస్తుంది. కేవలం వ్యవసాయానికే కాకుండా, ఈ ప్రాంతంలోని మరో 50 గ్రామాలకు తాగునీటి కష్టాలు శాశ్వతంగా తీరనున్నాయి. అలాగే, ఈ ప్రాజెక్టు కోసం భూములు ఇచ్చిన బాధితులకు త్వరలోనే రూ. 60 కోట్ల పరిహారం విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Also Read : కాషాయ భారతం.. కమల వికాసం..!

గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ఈ ప్రాజెక్టు తీవ్ర నిర్లక్ష్యానికి గురైందని కేంద్ర మంత్రి పెమ్మసాని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వ వైఫల్యం వల్లే పనులు నిలిచిపోయాయని, లేదంటే ఈ పాటికి జిల్లా రైతులు ఎంతో ప్రయోజనం పొందేవారని ఆయన గుర్తుచేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం చొరవతో 4 టీఎంసీల నీటిని పూర్తిస్థాయిలో వినియోగించుకునే అవకాశం కలుగుతుందని, దీనివల్ల రైతులకు ఎకరాకు సుమారు రూ. 10 వేల వరకు అదనపు ఆదాయం లభిస్తుందని ఆయన వివరించారు. రానున్న రెండేళ్ల కాలంలోనే ఈ ప్రాజెక్టు పనులన్నీ పూర్తి చేసి, రైతులకు అంకితం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని అధికారులు వెల్లడించారు. ఈ చారిత్రక నిర్ణయం ద్వారా గుంటూరు జిల్లా సాగునీటి రంగంలో సరికొత్త అధ్యాయం మొదలుకాబోతోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తిరుపతిలో కేఎఫ్‌సీ, డొమినోస్‌...

ప్రముఖ అంతర్జాతీయ ఫుడ్ బ్రాండ్ల ఆహార...

తిరుపతిలో వడ్డీ మాఫియా.....

తిరుపతి నగరంలో వడ్డీ వ్యాపారం పేరుతో...

సాయికృష్ణ కేసులో వైసీపీ...

విజయవాడ రౌడీ షీటర్‌ గాదె సాయికృష్ణ...

బ్రేకింగ్: అల్లు అర్జున్‌...

హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య...

తెలంగాణాలో జనసేన తొలి...

గత కొన్నాళ్ళుగా తెలంగాణాలో పార్టీ బలోపేతం...

బ్రేకింగ్: కొడాలి అరెస్ట్...

ఏపీలో వైసీపీ కీలక నేతలకు చట్టపరమైన...

పోల్స్