Tuesday, May 5, 2026 01:20 PM
Tuesday, May 5, 2026 01:20 PM

వారసులు.. వన్ టైమ్ సీఎం..!

అవును వాళ్లంతా వారసులు.. ప్రజల్లో తమకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. రాజకీయాల్లోకి వచ్చారు. అధికారం అనుభవించారు. కానీ.. అది నిలబెట్టుకోవటంలో బోర్లా పడ్డారు. రాజకీయాల్లో ముఖ్యమంత్రుల వారసులుగా గుర్తింపు తెచ్చుకున్నారు. సుదీర్ఘ పోరాటం తర్వాత ముఖ్యమంత్రులయ్యారు. కానీ వచ్చిన పదవిని ఎక్కువ కాలం నిలుపుకోలేక పోయారు. తండ్రులు వరుసగా రెండోసారి ఎన్నికైనప్పటికీ.. కుమారులు మాత్రం ప్రజాగ్రహానికి గురై.. వన్ టైమ్ సీఎం అనే ట్యాగ్ లైన్ తగిలించుకున్నారు.

Also Read : భారత్ ఫై నేపాల్ ను రెచ్చగొడుతున్న చైనా..!

ముఖ్యమంత్రుల వారసులుగా రాజకీయాల్లోకి వచ్చిన నేతలు.. చివరికి పార్టీ అధినేతల స్థాయికి ఎదిగారు. ఆ తర్వాత తమ పార్టీని ప్రజా క్షేత్రంలోకి తీసుకెళ్లారు. ముఖ్యమంత్రి కుర్చీ ఎక్కారు. కానీ.. ఆ పదవి మూడ్నాళ్ల ముచ్చటగానే మారిపోయింది. ప్రస్తుతం దేశ రాజకీయాల్లో ఇదే హాట్ టాపిక్. తండ్రుల వారసత్వాన్ని కుమారులు కొనసాగించలేక పోతున్నారనే అపవాదును మూట గట్టుకుంటున్నారు. ఇలాంటి వారిలో ముందు వరుసలో ఉన్నారు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయ వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చారు. తొలిసారే ఎంపీగా గెలిచారు. తండ్రి మరణానంతరం ముఖ్యమంత్రి కావాలని కలలుకన్నారు. అయితే కాంగ్రెస్ పెద్దల నుంచి తిరస్కారం ఎదురవ్వటంతో.. సొంత పార్టీ పెట్టారు. దాదాపు ఏడేళ్ల పోరాటం తర్వాత ముఖ్యమంత్రి అయ్యారు. అయితే ఆ తర్వాత జరిగిన 2024 ఎన్నికల్లో కనీసం ప్రతిపక్ష నేత హోదా కూడా రాలేదు.

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి కుమారుడు స్టాలిన్ కూడా ఇప్పుడు వన్ టైమ్ సీఎం అనే ట్యాగ్ లైన్ ఇప్పుడు తగిలించుకున్నారు. కరుణానిధి ఉన్నంత వరకు డీఎంకేలో చక్రం తిప్పారు. కానీ సీఎం కాలేదు. ఇక కరుణానిధి మరణానంతరం 2021 ఎన్నికల్లో డీఎంకే గెలుపులో కీలక పాత్ర పోషించారు. సీఎం అయ్యారు. అయితే ఆ పదవి ఒక్కసారికే పరిమితం అయ్యింది. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో అయితే స్టాలిన్ కూడా ఓడిపాయారు. 1989 నుంచి వరుసగా అసెంబ్లీకి ఎన్నికవుతున్న స్టాలిన్.. ప్రస్తుత ఎన్నికల్లో ఓటమితో వన్ టైమ్ సీఎంగా మిగిలిపోయారు.

ఇక మరో ముఖ్యమంత్రి కుమారుడు అఖిలేష్ యాదవ్. ఉత్తరప్రదేశ్ 20వ ముఖ్యమంత్రిగా అఖిలేష్ పని చేశారు. రాష్ట్రమంతా సైకిల్ యాత్ర చేసి.. సమాజ్ వాదీ పార్టీ గెలిచేందుకు తీవ్రంగా కృషి చేశారు. 2012-17 మధ్య కాలంలో ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ తర్వాత ఎన్నికల్లో ఓటమి తర్వాత మళ్లీ సీఎం కుర్చీలో కూర్చోలేదు. దీంతో ఆయన ఈసారి జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టారు. ప్రస్తుతం సమాజ్‌వాదీ పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా కొనసాగుతున్నారు.

Also Read: బెంగాల్‌.. కమల వికాసం.. దీదీ విలాపం

మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే కూడా వన్ టైమ్ సీఎంగా మిగిలిపోయారు. రాజకీయాల్లో చక్రం తిప్పిన బాల్ ఠాక్రే వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన ఉద్ధవ్ బాల్ ఠాక్రే.. శివసేన వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులయ్యారు. తండ్రి మరణానంతరం పార్టీ బాధ్యతలు చేపట్టారు. శాసనమండలికి ఎన్నికైన ఉద్ధవ్ ఠాక్రే.. 2019 నుండి మహా వికాస్ అఘాడి అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన 2019 నుండి 2022 వరకు మహారాష్ట్ర 19వ ముఖ్యమంత్రిగా పని చేశారు. అయితే శివసేనలో చీలిక రావడంతో ఉద్ధవ్ ఠాక్రే పదవి పోయింది. దీంతో ఆయన కూడా ఒక్కసారికే పరిమితం అయ్యారు.

అయితే వారసుల్లో ఒక్కరు మాత్రమే వన్ టైమ్ అనే చెడ్డ పేరు నుంచి తప్పించుకున్నారు. ఆయనే ప్రస్తుత సీఎం ఒమర్ అబ్దుల్లా. 2009 నుండి 2014 వరకు జమ్మూ – కాశ్మీర్ రాష్ట్రానికి 8వ ముఖ్యమంత్రిగా పనిచేశారు. తండ్రి ఫరూఖ్ అబ్దుల్లా రాజకీయ వారసుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఎన్నికల్లో గెలిచారు. కానీ.. ఆ గెలుపు ఒక్కసారిగా పరిమితం అయ్యింది. ఆ తర్వాత వరుసగా రెండుసార్లు ఓడిపోయారు. ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత జరిగిన ఎన్నికల్లో మళ్లీ గెలిచిన ఒమర్.. మరోసారి సీఎం కుర్చీలో కూర్చొన్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

టెన్త్ టాపర్లకు విమాన...

ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలో ప్రభుత్వ...

గుంటూరు గడ్డపై మరో...

గుంటూరు జిల్లా రైతాంగానికి కూటమి ప్రభుత్వం...

బ్రేకింగ్: ప్రభుత్వం ఏర్పాటు...

తమిళనాడు రాజకీయ యవనికపై దళపతి విజయ్...

కాషాయ భారతం.. కమల...

దేశం బీజేపీ వశం అవుతోంది. కమలం...

బెంగాల్‌.. కమల వికాసం.....

మినీ సార్వత్రిక ఎన్నికలుగా పరిగణించిన ఐదు...

ఓటమి దిశగా ముగ్గురు...

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌...

పోల్స్