Wednesday, August 5, 2026 08:04 AM
Wednesday, August 5, 2026 08:04 AM

టెన్త్ టాపర్లకు విమాన ప్రయాణం చేయించిన టీడీపీ ఎమ్మెల్యే సౌమ్య…!

ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల కలలకు రెక్కలొచ్చాయి. పదవ తరగతి ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ప్రోత్సహించేందుకు నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కలలకు రెక్కలు.. పేరుతో టాప్ 6 విద్యార్థులను ఆమె స్వయంగా విమానంలో హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ, పదవ తరగతిలో 550 కంటే ఎక్కువ మార్కులు సాధించిన ఆరుగురు విద్యార్థులను ఎమ్మెల్యే సౌమ్య విమాన ప్రయాణం చేయించారు.

Also Read : గుంటూరు గడ్డపై మరో పెమ్మసాని మార్క్ సక్సెస్..!

బడుగు, బలహీన వర్గాలకు చెందిన ఈ పిల్లలకు విమానం ఎక్కడం అనేది ఒక తీరని కల. అటువంటి కలను నెరవేర్చి, వారిలో మరింత స్ఫూర్తి నింపాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేపట్టామని ఎమ్మెల్యే తెలిపారు. గత ఏడాది కూడా టాప్ 5 విద్యార్థులను ఆమె విమానంలో తీసుకెళ్లడం గమనార్హం. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సౌమ్య మాట్లాడుతూ.. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యా వ్యవస్థలో తీసుకొస్తున్న విప్లవాత్మక మార్పుల వల్లే విద్యార్థులు మెరుగైన ప్రతిభ కనబరుస్తున్నారని కొనియాడారు.

Also Read : భారత్ ఫై నేపాల్ ను రెచ్చగొడుతున్న చైనా..!

నందిగామ నియోజకవర్గంలో గత ఏడాదితో పోలిస్తే ఈసారి పాస్ పర్సంటేజ్ 4 శాతం పెరిగిందని ఆమె హర్షం వ్యక్తం చేశారు. రాబోయే మూడేళ్లు కూడా ఈ కలలకు రెక్కలు.. స్కీం ద్వారా టాపర్లను విమాన ప్రయాణం చేయిస్తానని ఆమె హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే సౌమ్య చూపిన ఈ చొరవ పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇలాంటి ప్రోత్సాహకాలు ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల్లో పోటీ తత్వాన్ని పెంచుతాయని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

వైసీపీ లో బోరుగడ్డ...

అధికారంలో ఉన్నప్పుడు కళ్లు నెత్తికి ఎక్కాయి....

రాజకీయాల్లోకి త్రిష..? సీఎం...

తమిళనాడు రాజకీయాల్లో గత రెండు రోజులుగా...

జగన్ పర్యటన దెబ్బ.....

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...

బ్రేకింగ్: విజయ్ పై...

తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా తీవ్ర ఉత్కంఠగా...

దమ్ముంటే పట్టుకోండి చూద్దాం.....

ఏపీలో కూటమి సర్కార్ అధికారంలో ఉందో.....

మళ్లీ మొదలైన కావేరీ...

దక్షిణ భారతదేశంలో దశాబ్దాలుగా నలుగుతున్న కావేరీ...

పోల్స్