Wednesday, August 5, 2026 08:04 AM
Wednesday, August 5, 2026 08:04 AM

బ్రేకింగ్: ప్రభుత్వం ఏర్పాటు చేస్తా: విజయ్ 

తమిళనాడు రాజకీయ యవనికపై దళపతి విజయ్ వేసిన అడుగు సరికొత్త చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. నిన్నటి ఎన్నికల ఫలితాల్లో తన మార్కును చాటుకున్న విజయ్, ఇప్పుడు నేరుగా అధికార పీఠాన్ని అధిరోహించే దిశగా వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు తమ పార్టీని ఆహ్వానించాలని కోరుతూ తమిళనాడు గవర్నర్‌ కు విజయ్ లేఖ రాయడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో, లోక్ భవన్‌ కు విజయ్ ఈ-మెయిల్ ద్వారా తన ప్రతిపాదనను పంపినట్లు సమాచారం.

Also Read: కాషాయ భారతం.. కమల వికాసం..!

అతిపెద్ద పార్టీగా అవతరించిన తమకు ప్రభుత్వం ఏర్పాటు చేసే నైతిక హక్కు ఉందని ఆయన అందులో పేర్కొన్నారు. ప్రజా తీర్పు మేరకు స్థిరమైన పరిపాలన అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, అందుకే తమకు అవకాశం కల్పించాలని గవర్నర్‌ ను కోరారు. గవర్నర్ గనుక అవకాశం ఇస్తే.. కేవలం రెండు వారాల వ్యవధిలోనే అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకుంటానని విజయ్ ఆ లేఖలో స్పష్టమైన భరోసా ఇచ్చారు. సాధారణంగా కొత్త పార్టీలకు మెజారిటీ నిరూపించుకోవడం సవాల్‌ తో కూడుకున్న పని.

Also Read: నటన కోసం డిగ్రీ వదిలేసి.. సీఎం అయ్యాడు..!

అయినప్పటికీ, విజయ్ ఇంత ఆత్మవిశ్వాసంతో లేఖ రాయడం వెనుక బలమైన రాజకీయ సమీకరణాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రచారంలో చూపించిన హుందాతనాన్ని కొనసాగిస్తూనే, అధికార పగ్గాలు చేపట్టే విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదని ఈ లేఖతో నిరూపించారు. విజయ్ పంపిన లేఖ ఇప్పుడు గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉంది. అతిపెద్ద పార్టీని ఆహ్వానించే సంప్రదాయాన్ని గవర్నర్ పాటిస్తారా..? లేక మెజారిటీ నిరూపణకు మరిన్ని నిబంధనలు విధిస్తారా..? అన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. ఒకవేళ గవర్నర్ గనుక విజయ్‌ ను ఆహ్వానిస్తే అది సంచలనమే.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

వైసీపీ లో బోరుగడ్డ...

అధికారంలో ఉన్నప్పుడు కళ్లు నెత్తికి ఎక్కాయి....

రాజకీయాల్లోకి త్రిష..? సీఎం...

తమిళనాడు రాజకీయాల్లో గత రెండు రోజులుగా...

జగన్ పర్యటన దెబ్బ.....

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...

బ్రేకింగ్: విజయ్ పై...

తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా తీవ్ర ఉత్కంఠగా...

దమ్ముంటే పట్టుకోండి చూద్దాం.....

ఏపీలో కూటమి సర్కార్ అధికారంలో ఉందో.....

మళ్లీ మొదలైన కావేరీ...

దక్షిణ భారతదేశంలో దశాబ్దాలుగా నలుగుతున్న కావేరీ...

పోల్స్