Wednesday, August 5, 2026 08:02 AM
Wednesday, August 5, 2026 08:02 AM

నటన కోసం డిగ్రీ వదిలేసి.. సీఎం అయ్యాడు..!

తమిళనాడు రాజకీయ యవనికపై ఒక కొత్త అధ్యాయం మొదలైంది. దశాబ్దాల పాటు ద్రవిడ కోటలను శాసించిన దిగ్గజాలకు దీటుగా, ఒకే ఒక్కడు.. దళపతి విజయ్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. వెండితెరపై తన మేనరిజమ్స్‌ తో ఈల వేయించిన విజయ్, నేడు రాజకీయ క్షేత్రంలో ప్రత్యర్థుల వెన్నులో వణుకు పుట్టిస్తున్నాడు. కేవలం నటుడిగానే కాకుండా, ఒక పవర్‌ ఫుల్ పొలిటికల్ ఫోర్స్‌ గా విజయ్ ప్రస్థానం ఇప్పుడు భారత రాజకీయాల్లోనే అతిపెద్ద చర్చనీయాంశం.

Also Read  : తమిళనాట ఎన్నికల ఫలితాలు.. తిరుమలలో త్రిష..!

1974 జూన్ 22న చెన్నైలో జన్మించిన విజయ్ పూర్తి పేరు జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్. తండ్రి ప్రముఖ దర్శకుడు ఎస్.ఎ.చంద్రశేఖర్, తల్లి నేపథ్య గాయని శోభ చంద్రశేఖర్. నటన కోసం విజయ్, డిగ్రీ చదువును మధ్యలోనే ఆపేసి రావడం గమనార్హం. ఇక సినిమా నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చినా, తనకంటూ ఒక ప్రత్యేక శైలిని ఏర్పరచుకుని ఇళయదళపతిగా కోట్లాది మంది అభిమానాన్ని సంపాదించుకున్నారు. అయితే, ఆయన ప్రస్థానం కేవలం రంగుల ప్రపంచానికే పరిమితం కాలేదు. ప్రజా సేవ చేయాలనే బలమైన సంకల్పం ఆయనను రాజకీయాల వైపు నడిపించింది.

సినిమా గ్లామర్‌తో రాజకీయాల్లోకి రావడం తమిళనాడులో కొత్త కాదు. కానీ, విజయ్ రాక మాత్రం అత్యంత ప్రణాళికాబద్ధంగా సాగింది. తన అభిమాన సంఘాలను విజయ్ మక్కల్ ఇయక్కంగా మార్చి, క్షేత్రస్థాయిలో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల నాడిని పట్టుకున్నారు. 2024లో తమిళగ వెట్రి కళగం పార్టీని స్థాపించిన విజయ్, 2026 ఎన్నికలే లక్ష్యంగా పావులు కదిపారు. రజనీకాంత్ వంటి దిగ్గజాలు వెనకడుగు వేసిన చోట, కమల్ హాసన్ వంటి మేధావులు తడబడిన చోట.. విజయ్ మాత్రం వెనక్కి తగ్గలేదు.

Also Read  : విజయ్‌‍కు ఏఐఏడీఎంకే మద్దతు ఇస్తుందా..?

వ్యక్తిగత జీవితంలో ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా, ప్రత్యర్థులు వ్యక్తిత్వ హననానికి పాల్పడినా.. మొక్కవోని ధైర్యంతో నిలబడ్డారు. నేడు వెలువడుతున్న ఫలితాల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే ఏకంగా 100కు పైగా స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతూ, ద్రవిడ రాజకీయాల లెక్కలను తలకిందులు చేసింది. విజయ్ రాజకీయ ప్రస్థానంలో భార్య సంగీతతో విభేదాలు, తండ్రితో న్యాయపరమైన పోరాటాలు వంటి అనేక అడ్డంకులు ఎదురయ్యాయి. కానీ, ఏపీలో పవన్ కళ్యాణ్ లాగే, విజయ్ కూడా తన వ్యక్తిగత శూన్యాన్ని ప్రజల పట్ల ఉన్న బాధ్యతతో భర్తీ చేశారు. ఇంటిని వదిలిన వాడు దేశానికి అంకితమవుతాడు అన్న మాటకు నిదర్శనంగా నిలిచారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

వైసీపీ లో బోరుగడ్డ...

అధికారంలో ఉన్నప్పుడు కళ్లు నెత్తికి ఎక్కాయి....

రాజకీయాల్లోకి త్రిష..? సీఎం...

తమిళనాడు రాజకీయాల్లో గత రెండు రోజులుగా...

జగన్ పర్యటన దెబ్బ.....

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...

బ్రేకింగ్: విజయ్ పై...

తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా తీవ్ర ఉత్కంఠగా...

దమ్ముంటే పట్టుకోండి చూద్దాం.....

ఏపీలో కూటమి సర్కార్ అధికారంలో ఉందో.....

మళ్లీ మొదలైన కావేరీ...

దక్షిణ భారతదేశంలో దశాబ్దాలుగా నలుగుతున్న కావేరీ...

పోల్స్