Saturday, September 19, 2026 03:09 PM
Saturday, September 19, 2026 03:09 PM

తమిళనాట ఎన్నికల ఫలితాలు.. తిరుమలలో త్రిష..!

తమిళ రాజకీయాల్లో గత కొన్నాళ్ళుగా ఆసక్తి రేపుతోన్న స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్ ఈరోజు ఉదయం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. సోమవారం ఉదయం విరామ సమయంలో స్వామివారిని దర్శించుకున్న ఆమెకు రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం పలికి, తీర్థప్రసాదాలు అందజేశారు. తిరుమల కొండపైకి చేరుకున్న త్రిషను చూసేందుకు భక్తులు మరియు అభిమానులు ఎగబడ్డారు.

Also Read : జర్నలిజం ముసుగులో భజన.. మీరు మారరా..!

నేడు తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న తరుణంలో త్రిష తిరుమలకు రావడం విశేషం. దళపతి విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీపై మరియు ఇతర రాజకీయ సమీకరణాలపై భారీ అంచనాలు నెలకొన్న నేపథ్యంలో, త్రిష స్వామివారి ఆశీస్సులు తీసుకోవడం గమనార్హం. అందరి కళ్లు నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం పైనే ఉన్నాయి. యాక్సిస్ మై ఇండియా వంటి కొన్ని సర్వేలు విజయ్ పార్టీ 98 నుండి 120 స్థానాల వరకు గెలుచుకుని కింగ్ మేకర్ గా మారే అవకాశం ఉందని అంచనా వేశాయి.

Also Read : రంగస్థలం రేంజ్ లో.. చిట్టిబాబుకు మించిన క్యారెక్టర్..!

హంగ్ ఏర్పడే అవకాశం ఉందన్న వార్తలతో, అభ్యర్థులు చేజారకుండా విజయ్ ఇప్పటికే తన పార్టీ అభ్యర్థులను మహాబలిపురంలోని రిసార్ట్‌ కు తరలించేందుకు ఏర్పాట్లు కూడా చేసాడు విజయ్. గతంలో విజయ్‌ తో కలిసి నటించిన త్రిష, ఆయన రాజకీయ అరంగేట్రం సక్సెస్ అవ్వాలని కోరుకున్నారా..? అనే చర్చ కూడా సోషల్ మీడియాలో సాగుతోంది. ప్రస్తుతం త్రిష చేతిలో భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవి సరసన విశ్వంభర, అజిత్ సరసన విడా ముయర్చి, వంటి సినిమాలతో ఆమె ఫుల్ బిజీగా ఉన్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

25 రోజుల తర్వాత...

ఏపీ డిప్యూటి సీఎం, జనసేన అధినేత...

ఏపీలో మద్యం షాపుల...

ఆంధ్రప్రదేశ్‌లో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను...

బాంబు పేల్చిన టీడీపీ...

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ...

ఏపీ లిక్కర్ కుంభకోణం.....

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత వైఎస్సార్ కాంగ్రెస్...

రేవంత్ దెబ్బ.. బీఆర్ఎస్‌కు...

ఏదో అనుకుంటే.. మరేదో జరిగినట్లు ఉంది...

దానం నాగేందర్ కు...

ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు తెలంగాణ...

పోల్స్