మూడోసారి అధికారంలోకి రావాలంటే.. మళ్లీ ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టాలా..? హైదరాబాద్‌లో సెటిలర్లను కేసీఆర్, కేటీఆర్ స్వయంగా బూతులు తిట్టిస్తున్నారా..? ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన వారినే ఇప్పుడు టార్గెట్ చేశారు. బూతులు తిడుతూ.. హైదరాబాద్ నుంచి వెళ్లిపోండి అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇక బీఆర్ఎస్‌కు చెందిన శంకర్ అనే ఓ కార్యకర్త అయితే.. కమ్మ కులం వారంతా గెట్ అవుట్ అంటూ పెట్టిన పోస్టు ఇప్పుడు పెద్ద దుమారం రేపుతోంది. నిజానికి ఈ శంకర్ జగన్ వీరాభిమాని. ఇతని సోషల్ మీడియా అంతే అటు కేటీఆర్, ఇటు జగన్‌కు అనుకూలంగా, టీడీపీని టార్గెట్ చేస్తూ.. ఇంకా చెప్పాలంటే తిడుతున్నట్లుగానే ఉంటాయి.
Also Read : మత మార్పిడికి బ్రేక్ పడుతుందా..? పాస్టర్ కు సర్కార్ షాక్..!
నిజానికి హైదరాబాద్ అనేది ఏ ఒక్కరి సొంతం కాదు. హైదరాబాద్ నగరానికి 400 సంవత్సాలకు పైగా చరిత్ర ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధాని. అక్కడ అన్ని ప్రాంతాల వారు నివసిస్తున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి కూడా హైదరాబాద్ వచ్చి జీవిస్తున్న వారు కూడా ఉన్నారు. పేరుకే ఇతర ప్రాంతాలకు చెందిన వారు అయినప్పటికీ.. హైదరాబాద్‌లోనే స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. ఆస్తులు కొనుగోలు చేశారు. 3 నుంచి 4 తరాలుగా హైదరాబాద్‌లోనే ఉంటున్నారు. హైదరాబాద్‌లోనే వీరి శాశ్వత చిరునామా కూడా. ఉద్యోగ, ఉపాధి కోసం మాత్రమే హైదరాబాద్ వచ్చారు.. వస్తున్నారు. అంతే తప్ప.. ఏదో రాజకీయ లాభం ఆశించి అయితే కాదు. అలా అంటే.. హైదరాబాద్ నగరంలోనే తెలంగాణలోని ఇతర ప్రాంతాలకు చెందిన వారు లక్షల్లో ఉన్నారు. వాళ్లు కూడా ఉపాధి కోసమే నగరానికి వచ్చారు. మరి వారి వల్ల జరగని నష్టం.. కేవలం ఆంధ్ర ప్రాంతం వాళ్ల వల్ల మాత్రమే ఏం జరుగుతుందో బీఆర్ఎస్ నేతలే జవాబు చెప్పాలి.
ఆంధ్ర ప్రాంతం వారంతా దొంగలంటూ నోరు పారేసుకుంటున్న వారికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పూర్తి మద్దతు ఇస్తున్నారా అనే అనుమానాలు వినిపిస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే.. ఇలా తిడుతున్న వారిని కేటీఆర్ ప్రోత్సహిస్తున్నారా.. అనే అనుమానం కూడా వస్తుంది. తెలంగాణలో కేవలం 5 శాతం మాత్రం కమ్మ కులం వారు ఉన్నారు. ఆంధ్ర సెటిలర్స్ మాత్రం లక్షల్లో ఉన్నారు. ఇప్పుడు వీరంతా హైదరాబాద్ వదిలిపోవాలంట. లేకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని బీఆర్ఎస్ అభిమానులు బెదిరిస్తున్నారు. అయితే ఈ పరిస్థితికి ప్రధాన కారణం.. మెజారిటీ ఆంధ్ర ఓటర్లు, కమ్మ ఓటర్లు కూడా రేవంత్ రెడ్డికి మద్దతు ఇస్తున్నారు. ఇదే కేటీఆర్‌కు ఏ మాత్రం మింగుడు పడటం లేదు.అందుకే ఇలా రెచ్చగొట్టే పోస్టులు పెడుతున్న వారికి కేటీఆర్ పరోక్షంగా మద్దతు ఇస్తున్నారనేది బహిరంగ రహస్యం.
Also Read : బ్రేకింగ్ : కల్తీ నెయ్యి పాపంలో బుక్ అయిన మరో ఐఏఎస్..!
బీఆర్ఎస్, వైసీపీ నేతలు విసిరే ఎంగిరి మెతుకులు తినే ఈ జర్నలిస్టు ముసుగు వీరులు.. కమ్మ సామాజిక వర్గంపైన కక్ష కట్టారు. రాయలేని భాషలో బూతులు తిడుతూ.. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. మరి వీరికి ఇంత కోపం ఎందుకు అంటే.. నో ఆన్సర్. నిజానికి ఎల్లో మీడియా అంటూ తెలిసీ తెలియని మాటలు అనేస్తు.. కేవలం ఒక పార్టీపై మాత్రం విషం చిమ్ముతున్నారు. నిజానికి ఎల్లో జర్నలిజం అంటే.. ఒక పార్టీ లేదా ఒక వ్యక్తికి భజన చేయటమే. మరి నమస్తే తెలంగాణ, సాక్షి పేపర్ రాస్తున్న వార్తలు ఏమిటీ.. టీ న్యూస్, సాక్షి టీవీలో వస్తున్న వార్తలు ఏమిటీ.. అంటే.. సైలెంట్. అసలు సిసలు ఎల్లో జర్నలిజం అంటే అదే. టీ న్యూస్‌లో కేటీఆర్ భజన, సాక్షిలో వైఎస్ జగన్ కీర్తనలు తప్ప.. ఒక్కటంటే ఒక్కటి కూడా ఆ బీఆర్ఎస్, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పులను ఎత్తి చూపించారా.. ఇదే కదా అసలు సిసలు ఎల్లో జర్నలిజం అంటే.. ఈ ప్రశ్నకు ఏ ఒక్క భజన జర్నలిస్టు కూడా జవాబు చెప్పటం లేదు.
జర్నలిజం ముసుగులో ఒళ్లంతా విషం పూసుకుని.. ఎన్నిసార్లు మహిళలు చెప్పులతో కొట్టినా.. పోలీసులు ఎన్నిసార్లు జైలులో పడేసి కుమ్మేసినా సరే.. ఇలాంటి వారి బుద్ది మాత్రం మారటం లేదు. నిజానికి జర్నలిజం అనే స్పెల్లింగ్ కూడా సరిగ్గా రాయలేరు. ఇలాంటి వారి పట్ల ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు తప్పవు. రాజకీయ పరమైన విమర్శలు చేయటంలో ఎలాంటి తప్పు లేదు. కానీ జర్నలిజం ముసుగులో ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే వారి పట్ల మాత్రం ఏ మాత్రం కనికరం చూపించవద్దని అసలు సిసలు తెలంగాణ వాదులే కోరుతున్నారు.

