Sunday, June 21, 2026 05:03 AM
Sunday, June 21, 2026 05:03 AM

రంగస్థలం రేంజ్ లో.. చిట్టిబాబుకు మించిన క్యారెక్టర్..!

టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రంగస్థలం సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. చిట్టిబాబుగా రామ్ చరణ్ నటన, సుకుమార్ అద్భుతమైన స్క్రీన్ ప్లే ప్రేక్షకులకు ఒక సరికొత్త అనుభూతిని అందించాయి. కమర్షియల్ సినిమాల ఫార్మాట్‌ ను మారుస్తూ వచ్చిన ఆ చిత్రం ఎన్నో రికార్డులను తిరగరాసింది. ఇప్పుడు సుమారు ఏడేళ్ల తర్వాత అదే మేజిక్‌ ను రిపీట్ చేసేందుకు ఈ బ్లాక్ బస్టర్ కాంబో.. రంగంలోకి దిగింది. ఆర్సీ 17 గా పిలవబడుతున్న ఈ సినిమాపై అప్పుడే భారీ అంచనాలు నెలకొన్నాయి.

Also Read : సీఎం చంద్రబాబు.. పవన్ క్లారిటీ.. లోకేష్ మౌనం..!

ఈ భారీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పనులు వేగంగా జరుగుతున్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, వచ్చే నెలలోనే ఈ సినిమా పూజా కార్యక్రమాలను నిర్వహించి అధికారికంగా ప్రారంభించనున్నారు. ప్రస్తుతం సుకుమార్ స్క్రిప్ట్ వర్క్‌ ను పూర్తి చేసే పనిలో ఉండగా, చరణ్ తన ప్రస్తుత ప్రాజెక్ట్ పెద్ది పనుల్లో బిజీగా ఉన్నాడు. అన్నీ అనుకున్నట్లు జరిగితే, ఈ సినిమా గ్రాండ్ లాంచ్ కోసం చిత్ర యూనిట్ ఇప్పటికే ఏర్పాట్లు చేస్తోంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించనుంది.

Also Read : హోటల్ తిండి సామాన్యుడికి ఇక గగనమే..?

రంగస్థలంకు పని చేసిన దేవి శ్రీ ప్రసాద్ మళ్ళీ ఈ చిత్రానికి సంగీతం అందించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానాతో చరణ్ చేస్తున్న పెద్ది సినిమా షూటింగ్ ముగిసిన వెంటనే, ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. మళ్ళీ రామ్ చరణ్‌ ను సుకుమార్ ఏ రకమైన ఊరమాస్ లుక్‌ లో చూపిస్తాడో అని మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా కోసం కన్నడ హీరోయిన్ ను సెలెక్ట్ చేసే ఛాన్స్ కనపడుతోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తిరుపతిలో కేఎఫ్‌సీ, డొమినోస్‌...

ప్రముఖ అంతర్జాతీయ ఫుడ్ బ్రాండ్ల ఆహార...

తిరుపతిలో వడ్డీ మాఫియా.....

తిరుపతి నగరంలో వడ్డీ వ్యాపారం పేరుతో...

సాయికృష్ణ కేసులో వైసీపీ...

విజయవాడ రౌడీ షీటర్‌ గాదె సాయికృష్ణ...

బ్రేకింగ్: అల్లు అర్జున్‌...

హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య...

తెలంగాణాలో జనసేన తొలి...

గత కొన్నాళ్ళుగా తెలంగాణాలో పార్టీ బలోపేతం...

బ్రేకింగ్: కొడాలి అరెస్ట్...

ఏపీలో వైసీపీ కీలక నేతలకు చట్టపరమైన...

పోల్స్