Saturday, May 2, 2026 03:12 PM
Saturday, May 2, 2026 03:12 PM

మత మార్పిడికి బ్రేక్ పడుతుందా..? పాస్టర్ కు సర్కార్ షాక్..!

గత కొన్ని రోజులుగా సంచలనంగా మారిన.. బాపట్ల జిల్లాలో పాస్టర్ ఆనంద్ ఎస్సీ హోదా వివాదం తుది దశకు చేరుకుంది. పిట్టలవానిపాలెం మండలం కొత్తపాలెంలో ఒక చర్చి నిర్మాణం సందర్భంగా మొదలైంది. పాస్టర్ ఆనంద్ తనపై కులం పేరుతో దాడి జరిగిందని ఫిర్యాదు చేయగా, ఆయన క్రైస్తవ మత బోధకుడిగా ఉన్నందున ఎస్సీ హోదాకు అనర్హుడని మరో వర్గం కోర్టును ఆశ్రయించింది. దీంతో ఈ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ కేసును విచారించిన ఉన్నత న్యాయస్థానాలు కీలక తీర్పులు వెలువరించాయి.

Also Read : పెట్రోల్ బంకుల్లో కొత్త మోసాలు.. హైదరాబాద్ లో ఆ బంకులో జాగ్రత్త..!

హిందూ మతం నుండి ఇతర మతాల్లోకి మారిన వారికి ఎస్సీ హోదా వర్తించదని, మతం మారిన క్షణం నుండే ఆ రిజర్వేషన్ ప్రయోజనాలు రద్దవుతాయని స్పష్టం చేశాయి. ఈ తీర్పుల నేపథ్యంలో, పాస్టర్ ఆనంద్ గతంలో పొందిన కుల ధృవీకరణ పత్రం చెల్లుబాటుపై బాపట్ల జిల్లా యంత్రాంగం లోతైన దర్యాప్తు చేపట్టింది. తాజా పరిణామాలలో భాగంగా బాపట్ల జిల్లా జాయింట్ కలెక్టర్ ఇరు వర్గాల వాదనలను విని నివేదిక సిద్దం చేసినట్లు సమాచారం. పాస్టర్ ఆనంద్ తన మత మార్పిడిని దాచిపెట్టి ఎస్సీ హోదాను పొందినట్లు ఆరోపణలు రావడంతో, ఆయన ద్వారా ప్రభుత్వం నుండి పొందిన పరిహారం సొమ్మును కూడా వెనక్కి తీసుకోవాలని విచారణ కమిటీ భావిస్తోంది.

Also Read : టీటీడీకి పవన్ లేఖ.. నానా పాట్లు పడుతున్న వైసీపీ..!

అలాగే తప్పుడు ధృవీకరణ పత్రం జారీ చేసిన అధికారులపై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం జాయింట్ కలెక్టర్ నివేదిక జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరుకుంది. కలెక్టర్ తుది నిర్ణయం తీసుకున్న వెంటనే పాస్టర్ ఆనంద్ ఎస్సీ హోదా రద్దుపై అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి. ఈ నిర్ణయం భవిష్యత్తులో ఇటువంటి ఇతర కేసులకు కూడా ఒక ప్రామాణికంగా మారే అవకాశం ఉంది. దీనితో ఇక మతం మారాలి అనుకునే వారికి బ్రేక్ పడే అవకాశాలు కనపడుతున్నాయి. వెనుకబడిన వర్గాల్లోనే మత మార్పిడి ఎక్కువగా ఉన్న నేపధ్యంలో.. ఈ పరిణామం ఆసక్తికరంగా మారింది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

రష్మీని టార్గెట్ చేసిన...

యాంకర్ రష్మీ గౌతమ్‌ను వైసీపీ నేతలు...

పోలవరం ప్రాజెక్టుపై కేంద్రం...

ఆంధ్రప్రదేశ్ జీవనాడి, బహుళార్థసాధక ప్రాజెక్టు అయిన...

టీడీపీ ఎమ్మెల్యే సంచలన...

ఇటీవల విడుదలైన పదవ తరగతి ఫలితాల్లో...

బ్రేకింగ్ : కల్తీ...

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో...

బ్రేకింగ్: డిప్యూటి సీఎం...

ఏపీ సీఎం చంద్రబాబు ఈరోజు హైదరాబాద్‌లో...

టీటీడీకి పవన్ లేఖ.....

కూటమి ప్రభుత్వం ఏం చేసినా తప్పే.....

పోల్స్