Saturday, September 19, 2026 09:17 AM
Saturday, September 19, 2026 09:17 AM

మద్యానికి బానిసైన జాన్వీ కపూర్..?

సాధారణంగా సినిమా వాళ్లకు మద్యం అలవాట్లు లేదా ఇతర అలవాట్లు ఉండటం సహజమే. మగాళ్ళ విషయంలో కంటే ఇవి ఆడాళ్ళ విషయంలోనే ఎక్కువగా సంచలనం అవుతున్నాయి. ఈ నేపధ్యంలో బాలీవుడ్ సెన్సేషన్ జాన్వీ కపూర్ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జాన్వీకి మద్యం అలవాటు ఉందంటూ వస్తున్న కథనాలపై ఆమె టీమ్, సంబంధిత సంస్థ అమహా స్పందించి అసలు నిజాన్ని బయటపెట్టాయి. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో జాన్వీ కపూర్ అప్పుడప్పుడు మద్యం సేవించడం గురించి మాట్లాడారు.

Also Read : ఓటమి దిశగా ముగ్గురు సీఎంలు..!

అయితే, ఆమె మాటలను కొందరు నెటిజన్లు, కొన్ని మీడియా సంస్థలు తప్పుగా అర్థం చేసుకున్నాయని సదరు సంస్థ చెప్తోంది. అయితే జాన్వీకి మద్యం తాగే వ్యసనం ఉందంటూ వార్తలు అల్లేశారు. ఇది కాస్తా ముదిరి సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. ఈ రూమర్లపై మనస్తత్వ ఆరోగ్య సంస్థ అమహా స్పష్టత ఇచ్చింది. జాన్వీ కపూర్ ఆల్కహాల్ అడిక్షన్ గురించి మాట్లాడలేదని, ఆమె ఒక కేర్‌ గివర్ హోదాలో మాత్రమే తన అభిప్రాయాలను పంచుకున్నారని స్పష్టం చేసింది.

Also Read : విజయ్‌‍కు ఏఐఏడీఎంకే మద్దతు ఇస్తుందా..?

అంటే, మద్యం అలవాటు ఉన్న వారికి లేదా ఇతర మానసిక సమస్యలు ఉన్న వారికి అండగా ఉండటం ఎలా అనే కోణంలో ఆమె మాట్లాడారే తప్ప, ఆమెకు ఆ అలవాటు ఉందని కాదని క్లారిటీ ఇచ్చారు. జాన్వీ ఒక సెలబ్రిటీ కావడంతో ఆమె చేసిన చిన్న వ్యాఖ్యలను కూడా కొందరు అడిక్షన్‌ గా చిత్రీకరించడంపై ఆమె అభిమానులు మండిపడుతున్నారు. ప్రస్తుతం ఆమె వరుస సినిమాలతో బిజీగా ఉన్నారని, ఇలాంటి తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని ఆమె సన్నిహిత వర్గాలు కోరుతున్నాయి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఏపీ లిక్కర్ కుంభకోణం.....

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత వైఎస్సార్ కాంగ్రెస్...

రేవంత్ దెబ్బ.. బీఆర్ఎస్‌కు...

ఏదో అనుకుంటే.. మరేదో జరిగినట్లు ఉంది...

దానం నాగేందర్ కు...

ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు తెలంగాణ...

ఎల్‌నినో పై బాబు...

ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడిన కరవు పరిస్థితులను...

సనాతన ధర్మం.. చేప...

'దుర్గాపూజ సమయంలో బెంగాలీ హిందువులు మాంసాహారానికి...

వైసీపీలో విచిత్ర పరిస్థితి.....

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల వేడి...

పోల్స్