Monday, May 4, 2026 02:04 PM
Monday, May 4, 2026 02:04 PM

ఓటమి దిశగా ముగ్గురు సీఎంలు..!

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌ లో భారత రాజకీయ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా సంచలనం నమోదవుతోంది. అధికార పీఠంపై ఉన్న ముగ్గురు సిట్టింగ్ ముఖ్యమంత్రులు తమ సొంత నియోజకవర్గాల్లో వెనుకంజలో ఉండటం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ తన కంచుకోట అయిన కొళత్తూర్ నియోజకవర్గంలో వెనుకంజలో ఉన్నారు. అక్కడ విజయ్ నేతృత్వంలోని టీవీకే అభ్యర్థి గట్టి పోటీ ఇస్తూ ఆధిక్యంలోకి వెళ్లడం డీఎంకే శ్రేణులను దిగ్భ్రాంతికి గురిచేస్తోంది.

Also Read : తమిళనాట రాజకీయ సంచలనానికి తెరలేపిన టీవీకే విజయ్..!

పశ్చిమ బెంగాల్‌లో 17 ఏళ్ల సుదీర్ఘ పాలన సాగించిన మమతా బెనర్జీకి ఈసారి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. భవానీపూర్‌లో ఆమెపై బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి స్పష్టమైన ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఫలితాల ట్రెండ్స్ చూస్తుంటే బెంగాల్ గడ్డపై దీదీ పాలనకు ఎండ్ కార్డ్ పడబోతున్నట్లు కనిపిస్తోంది. వరుసగా రెండుసార్లు విజయం సాధించి హ్యాట్రిక్ కొడతారనుకున్న కేరళ సీఎం పినరయి విజయన్ కూడా ప్రస్తుతం వెనుకంజలో ఉన్నారు. ధర్మదంలో యూడీఎఫ్ అభ్యర్థి ఆయనకు గట్టి సవాల్ విసురుతున్నారు.

Also Read : తమిళనాట ఎన్నికల ఫలితాలు.. తిరుమలలో త్రిష..!

హేమాహేమీలుగా భావించే ఈ ముగ్గురు నేతలు వెనుకబడటంతో ఆయా రాష్ట్రాల్లో అధికార మార్పిడి ఖాయమని సంకేతాలు అందుతున్నాయి. జనం తీర్పు ముగ్గురు సీఎంలను ఒకేసారి ఇంటికి పంపబోతుందా అన్న ఉత్కంఠ ఇప్పుడు నెలకుంది. ఇక తమిళనాడులో టీవీకే అధికారంలోకి వచ్చే అవకాశాలు కనపడటం ఆశ్చర్యం కలిగిస్తోంది. పార్టీ ఏర్పాటు చేసిన రెండేళ్ళలోనే విజయ్ ఈ స్థాయిలో ప్రభావం చూపడం దేశ వ్యాప్తంగా సంచలనం అయింది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

విజయ్‌‍కు ఏఐఏడీఎంకే మద్దతు...

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు...

తమిళనాట రాజకీయ సంచలనానికి...

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కౌంటింగ్‌కు...

తమిళనాట ఎన్నికల ఫలితాలు.....

తమిళ రాజకీయాల్లో గత కొన్నాళ్ళుగా ఆసక్తి...

కల్తీ నెయ్యిలో వైవీ...

తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కుంభకోణంపై...

సీఐని సస్పెండ్ అయ్యే...

పల్నాడు జిల్లా వినుకొండలో ఒక పోలీస్...

రష్మీని టార్గెట్ చేసిన...

యాంకర్ రష్మీ గౌతమ్‌ను వైసీపీ నేతలు...

పోల్స్