Saturday, September 19, 2026 01:01 PM
Saturday, September 19, 2026 01:01 PM

తమిళనాట రాజకీయ సంచలనానికి తెరలేపిన టీవీకే విజయ్..!

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కౌంటింగ్‌కు ముందే రాజకీయాల్లో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు తమిళనాడులో ఈసారి ఏ పార్టీకి సొంతంగా మెజారిటీ వచ్చే అవకాశం లేదని, హంగ్ ఏర్పడే ఛాన్స్ ఉందని సూచించడంతో ప్రధాన పార్టీల్లో వణుకు మొదలైంది. ఈ నేపథ్యంలోనే తన పార్టీ అభ్యర్థులు ప్రత్యర్థి పార్టీల ప్రలోభాలకు గురికాకుండా ఉండేందుకు టీవీకే అధినేత, సినీ నటుడు విజయ్ పక్కా ప్లాన్‌తో ముందుకెళ్తున్నారు.

Also Rea : కల్తీ నెయ్యిలో వైవీ సుబ్బారెడ్డిని రక్షించడమే సిట్ లక్ష్యమా..?

గెలిచిన అభ్యర్థులను కాపాడుకోవడానికి విజయ్ ‘రిసార్ట్ పాలిటిక్స్’కు తెరలేపారు. మహాబలిపురంలోని ఒక ప్రముఖ లగ్జరీ రిసార్ట్‌ను టీవీకే పార్టీ ముందుగానే బుక్ చేసినట్లు సమాచారం. ఫలితాలు వెలువడగానే గెలిచిన అభ్యర్థులందరూ నేరుగా మహాబలిపురంలోని రిసార్ట్‌కు చేరుకోవాలని విజయ్ ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. తమిళనాడులో డీఎంకే, ఏఐఏడీఎంకే వంటి దిగ్గజ పార్టీల మధ్య విజయ్ పార్టీ కీలకమైన ‘కింగ్ మేకర్’గా మారే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Also Rea : రంగస్థలం రేంజ్ లో.. చిట్టిబాబుకు మించిన క్యారెక్టర్..!

హంగ్ ఏర్పడితే చిన్న పార్టీల అభ్యర్థులను తమ వైపు తిప్పుకోవడానికి పెద్ద పార్టీలు ‘ఆపరేషన్ ఆకర్ష్’కు తెరలేపే అవకాశం ఉంది. అందుకే కౌంటింగ్‌కు ఒకరోజు ముందే విజయ్ ఈ అప్రమత్తత పాటించినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. తన పార్టీ అభ్యర్థులు చేజారకుండా ఉండేందుకు విజయ్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. మహాబలిపురం రిసార్ట్‌లో అభ్యర్థులకు కావాల్సిన అన్ని సౌకర్యాలను సిద్ధం చేయడమే కాకుండా, పార్టీ ముఖ్య నేతలను అభ్యర్థులకు పహారాగా నియమించినట్లు తెలుస్తోంది. మొత్తానికి, మే 4న వెలువడనున్న ఫలితాల్లో ఎవరికి మెజారిటీ వస్తుంది..? విజయ్ పార్టీ ఎవరికి మద్దతు ఇస్తుంది..? అనే ఉత్కంఠ మధ్య ఈ రిసార్ట్ పాలిటిక్స్ ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

25 రోజుల తర్వాత...

ఏపీ డిప్యూటి సీఎం, జనసేన అధినేత...

ఏపీలో మద్యం షాపుల...

ఆంధ్రప్రదేశ్‌లో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను...

బాంబు పేల్చిన టీడీపీ...

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ...

ఏపీ లిక్కర్ కుంభకోణం.....

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత వైఎస్సార్ కాంగ్రెస్...

రేవంత్ దెబ్బ.. బీఆర్ఎస్‌కు...

ఏదో అనుకుంటే.. మరేదో జరిగినట్లు ఉంది...

దానం నాగేందర్ కు...

ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు తెలంగాణ...

పోల్స్