Wednesday, August 5, 2026 10:27 AM
Wednesday, August 5, 2026 10:27 AM

పెట్రోల్ బంకుల్లో కొత్త మోసాలు.. హైదరాబాద్ లో ఆ బంకులో జాగ్రత్త..!

పెట్రోల్ బంకుల్లో మోసాలు రోజురోజుకూ కొత్త పుంతలు తొక్కుతున్నాయి. రీడింగ్‌లో సున్నా చూపించడం, చిల్లర దగ్గర నొక్కేయడం వంటి పాత పద్ధతులు కాకుండా, ఇప్పుడు ఏకంగా కారు ట్యాంక్ సామర్థ్యాన్ని మించి పెట్రోల్ పోసినట్లు బిల్లులు వేస్తూ సామాన్యుడిని దోచుకుంటున్నారు. తాజాగా హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక హెచ్‌పీ పెట్రోల్ బంకులో ఇలాంటి విస్తుపోయే మోసం వెలుగు చూసింది. హయత్ నగర్ ఫీలింగ్ స్టేషన్‌ లో ఒక కస్టమర్ తన మారుతి ఎస్-ప్రెస్సో కారుకు ఫుల్ ట్యాంక్ పెట్రోల్ కొట్టించాడు.

Also Read : తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారం.. దోషి ఆయనే..!

సాధారణంగా ఆ కారు ట్యాంక్ కెపాసిటీ 27 లీటర్లు. కానీ, బంకు సిబ్బంది ఏకంగా 32 లీటర్లు పోసినట్లు బిల్లు ఇచ్చారు. ఇది చూసి అవాక్కైన కస్టమర్.. ట్యాంక్ సామర్థ్యమే 27 లీటర్లు అయితే, 32 లీటర్లు ఎలా పడుతుంది..? అని యజమానిని ప్రశ్నించాడు. దానికి యజమాని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పెట్రోల్ బంకులకు వెళ్ళినప్పుడు కేవలం జీరో చూస్తే సరిపోదు, ఈ క్రింది మోసాల పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలి అని నిపుణులు సూచిస్తున్నారు.

మీరు పెట్రోల్ కొట్టించేటప్పుడు మీ దృష్టి మళ్లించి, అంతకుముందు ఎవరో కొట్టించిన రీడింగ్‌ ను అక్కడి నుంచే కంటిన్యూ చేస్తారు. ఉదాహరణకు ఎవరో రూ. 200 కొట్టించి వెళ్తే, అది రీసెట్ చేయకుండానే మీ రీడింగ్ అక్కడి నుంచే మొదలుపెట్టే అవకాశం ఉంటుంది. మెషీన్ లోపల చిన్న చిప్‌ లను అమర్చి, రీడింగ్ పక్కాగా చూపిస్తున్నట్లు భ్రమింపజేస్తారు. కానీ కారులోకి వెళ్లే ఇంధనం మాత్రం మీరు అనుకున్న దానికంటే 5-10 శాతం తక్కువగా ఉంటుంది.

Also Read : హోటల్ తిండి సామాన్యుడికి ఇక గగనమే..?

పెట్రోల్ కొట్టడం అయిపోయాక వెంటనే నాజిల్‌ను బయటకు తీసేస్తారు. దీనివల్ల పైపులో మిగిలిపోయిన దాదాపు 50-100 ఎంఎల్ ఇంధనం మళ్ళీ బంకు ట్యాంకులోకి వెళ్ళిపోతుంది. కానీ ఆ డబ్బులు మీ దగ్గర వసూలు చేస్తారు. ట్యాంక్ ఫుల్ చేయించేటప్పుడు కారు మ్యాన్యువల్ బుక్‌ లో ఉన్న కెపాసిటీని గుర్తుంచుకోండి. సిబ్బంది మీతో మాటలు కలిపి మీ దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తే అప్రమత్తంగా ఉండండి. అనుమానం వస్తే బంకులో ఉండే 5 లీటర్ల ప్రమాణిక జార్‌తో కొలత వేయమని అడగండి. ఇది ప్రతి బంకులో ఉండటం చట్టరీత్యా తప్పనిసరి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

వైసీపీ లో బోరుగడ్డ...

అధికారంలో ఉన్నప్పుడు కళ్లు నెత్తికి ఎక్కాయి....

రాజకీయాల్లోకి త్రిష..? సీఎం...

తమిళనాడు రాజకీయాల్లో గత రెండు రోజులుగా...

జగన్ పర్యటన దెబ్బ.....

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...

బ్రేకింగ్: విజయ్ పై...

తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా తీవ్ర ఉత్కంఠగా...

దమ్ముంటే పట్టుకోండి చూద్దాం.....

ఏపీలో కూటమి సర్కార్ అధికారంలో ఉందో.....

మళ్లీ మొదలైన కావేరీ...

దక్షిణ భారతదేశంలో దశాబ్దాలుగా నలుగుతున్న కావేరీ...

పోల్స్