జనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై లాయర్ కన్నా రజని విమర్శలు ఎందుకు చేస్తున్నారు..? నిన్నటి వరకు కమ్మ కులం నేతలు, వైసీపీ ట్రాప్‌లో పడగా, తాజాగా కాపు కులం నేతలు వైసీపీ ట్రాప్‌లో పడ్డారా అనే అనుమానం వ్యక్తం అవుతోంది. వైసీపీలో ప్రత్యక్షంగా చేరకుండా.. పరోక్షంగా పవన్ కళ్యాణ్ పైన విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారు కన్నా రజని. వాస్తవానికి కన్నా రజని కాపు అని చెప్పుకుంటారు. కానీ ఆమె భర్త మాత్రం రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన పార్టీతోనే కన్నా రజని గుర్తింపు తెచ్చుకున్నారు. తాను లాయర్ అని రుజువు చేసుకునేందుకు పగలు, రాత్రి, ఇంటా బయటా అనే తేడా లేకుండా నిరంతరం లాయర్ దుస్తుల్లోనే కనిపిస్తారు.
Also Read : విశాఖలో ఇన్ఫోసిస్ మెగా క్యాంపస్.. సర్కార్ కీలక నిర్ణయం..!
జనసేనతో గుర్తింపు తెచ్చుకున్న రజని.. తాజాగా వైసీపీ ట్రాప్‌లో పడి పవన్ కళ్యాణ్ పైన దుమ్మెత్తి పోయడమే పెద్ద పనిగా పెట్టుకున్నారు. కన్నా రజనిని పార్టీ అధికార ప్రతినిధిగా గుర్తింపు ఇవ్వటమే పవన్ కళ్యాణ్ చేసిన పెద్ద తప్పు.. అనే మాట ఇప్పుడు జనసేన పార్టీలో బాగా వినిపిస్తోంది. కన్నా రజనీ ఇప్పటి వరకు వైసీపీలో ప్రత్యక్షం గా చేరలేదు. కానీ పవన్ కళ్యాణ్ పైన విమర్శలు, ఆరోపణలు చేస్తూ పరోక్షంగా వైసీపీకి మద్దతు ఇస్తున్నారు. ప్రధాన న్యూస్ ఛానల్స్, సోషల్ మీడియా, యూ ట్యూబ్ ఛానల్స్‌లో రజని నిత్యం కనిపిస్తూనే ఉన్నారు. వైసీపీ అనుకూల, అభిమాన, పెయిడ్ న్యూస్ ఛానల్స్ అయితే ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం రజనితో జూమ్ మీటింగ్ ఏర్పాటు చేసి మరీ పవన్ కల్యాణ్‌ను తిట్టిస్తున్నాయి. దీంతో ఎవరెవరికి ఏమైమి అందాలో అవి అందుతున్నాయనే ప్రచారం జరుగుతోంది.
మొదట్లో వైసీపీ కమ్మ కులం నేతలతో చంద్రబాబు, లోకేష్‌ను వైసీపీ పెద్దలు తిట్టించారు. కానీ ఇది పెద్దగా ప్రభావం చూపించలేదు. దీని వల్ల ఎలాంటి ఫలితం కలగకపోవటంతో తాజాగా కాపు నేతలతోనే పవన్ కళ్యాణ్‌ను తిట్టించటం పనిగా పెట్టుకున్నారు. ఇక అసలు విషయం ఏమిటంటే.. ఒక పార్టీ లో ఉన్నంత కాలం ఆ నాయకుడిని భుజాన మోయడం.. పార్టీ వీడగానే అదే నాయకుడి పై విమర్శలు, ఆరోపణలు చేయటం ప్యాషన్‌గా మారింది. దాదాపు పదేళ్ల పాటు పవన్ కల్యాణ్ వెంటే ఉన్న విజయవాడకు చెందిన పోతిన మహేష్ కూడా టికెట్ రాలేదనే అక్కసుతో రాత్రికి రాత్రి వైసీపీలో చేరిపోయాడు. ఆ తర్వాత నుంచి టార్గెట్ పవన్ అన్నట్లుగా వ్యవహరిస్తున్నాడు. కాపు కులం వారే.. పవన్‌పై చేస్తున్న ఆరోపణలు, విమర్శల వెనుక ఏం జరిగిందనే చర్చ జరుగుతోంది.
ఇటీవల పవన్ కళ్యాణ్ అనారోగ్యానికి గురయ్యారు. అప్పుడు పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకులందరూ స్పందించి ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. చివరికి వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా పవన్ త్వరగా కోలుకోవాలంటూ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అయితే కన్నా రజని మాత్రం పవన్ పై వ్యంగ్యంగా, కించపరిచేలా మాట్లాడటం ఆమె దిగజారుడు రాజకీయ వైఖరికి పరాకాష్టగా నిలుస్తోంది. ఆమె రాజకీయ అవకాశవాదానికి అద్దం పడుతోంధి. సొమ్ముల కోసం ఈ రోజు దిగజారితే.. రేపు అనే రోజున ఎన్నెన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. వైసీపీ పెయిడ్ ఛానళ్లు, ప్యాకేజి చానళ్ళు కూడా పోటీపడుతూ రజని గారిని చర్చలకు పిలుస్తున్నారంటే, ఎవరెవ్వరి కి ఏమేమి అందాలో, అదే అందుతున్నాయని స్పష్టమవుతోంది.. వైసీపీ కమ్మ కులం నేతలతో, చంద్రబాబు, లోకేష్‌ను తిట్టంచినా ఎలాంటి ఫలితం కనిపించక పోవటంతో… తాజా గా కాపులతోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను తిట్టించటం, విమర్శలు, ఆరోపణలు చేయించటం జరుగుతుంది.
Also Read: శేషాచలం కార్చిచ్చు.. రంగంలోకి పవన్ కళ్యాణ్..!
నిన్నటి వరకు కమ్మ కులం వారిలో చాలా మంది వైసీపీ ట్రాప్‌లో పడ్డారు.. ఇప్పుడేమో కాపు కులానికి చెందిన వారే వైసీపీ ట్రాప్‌లో పడి ప్యాకేజీలకు అలవాటు పడ్డారన్న ప్రచారం జరుగుతోంది. సొమ్ముల కోసం కక్కుర్తి పడుతున్న కొందరు కాపు నాయకులు.. పవన్ కళ్యాణ్ పై చేస్తున్న విమర్శలు, ఆరోపణల వల్ల వారి బంధుమిత్రుల్లోనే చులకన అవుతున్నారు. కొన్ని శుభకార్యాలకు కూడా వారిని పిలవటం లేదంట. జనసేన మాజీ నాయకురాలు కన్నా రజనీ వైఖరే అందుకు నిదర్శనం. గతంలో జనసేనలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాన్ని, ఆకాశానికెత్తిన ఆమె, పార్టీకి దూరమైన నాటి నుంచి ఆయన పై వ్యతిరేక కామెంట్లు ప్రారంభించారు. ఆమె పరిస్థితి ఎలా ఉందంటే.. ఆమె కనిపిస్తేనా.. అని వార్నింగ్ కూడా ఇస్తున్నారు. పవన్ కళ్యాణ్ అభిమానులను పధకం ప్రకారం కన్నా రజనీ రెచ్చగొడుతున్నారనే అన్న అనుమానం కలుగుతోంది.

