Saturday, June 20, 2026 09:02 PM
Saturday, June 20, 2026 09:02 PM

విశాఖలో ఇన్ఫోసిస్ మెగా క్యాంపస్.. సర్కార్ కీలక నిర్ణయం..!

వైజాగ్ ఐటీ రంగానికి మరింత జోష్ ఇస్తూ.. ఏపీ సర్కార్.. కీలక నిర్ణయం తీసుకుంది. ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ విస్తరణ కోసం విశాఖలోని ఎండాడ ప్రాంతంలో సుమారు 20 ఎకరాల భూమిని కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. పారిశ్రామిక ప్రోత్సాహకాల్లో భాగంగా ఈ భూమిని ఎకరం కేవలం 99 పైసల చొప్పున నామమాత్రపు లీజు ధరకే ఇన్ఫోసిస్‌ కు అప్పగించడం గమనార్హం. ఈ కేటాయింపుతో విశాఖలో ఇన్ఫోసిస్ ఒక భారీ మెగా ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టబోతోంది.

Also Read : కవిత టీఆర్ఎస్‌.. ఏపీలో జోరుగా చర్చ..!

సుమారు 750 కోట్ల రూపాయల భారీ పెట్టుబడితో ఈ నూతన క్యాంపస్‌ ను నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా 7,000 మంది ఐటీ నిపుణులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ఇన్ఫోసిస్ తన ప్రతిపాదనలో వెల్లడించింది. ఇది ఉత్తరాంధ్ర ప్రాంతంలోని నిరుద్యోగ యువతకు మరియు ఐటీ రంగానికి ఒక గొప్ప శుభవార్తగా నిలవనుంది. ఈ క్యాంపస్ కేవలం ఉపాధి కల్పనకే పరిమితం కాకుండా, పర్యావరణ పరిరక్షణలోనూ సరికొత్త ప్రమాణాలను నెలకొల్పనుంది.

Also Read : ఏపీలో నరకం చూస్తున్న రైతన్నలు..!

ఇన్ఫోసిస్ దీనిని 100 శాతం గ్రీన్ క్యాంపస్‌ గా తీర్చిదిద్దబోతోంది. అంటే, ఈ కార్యాలయం తన అవసరాలకు కావాల్సిన విద్యుత్తును పూర్తిగా పునరుత్పాదక గ్రీన్ పవర్ ద్వారానే పొందుతుంది. అత్యాధునిక సాంకేతికత, ప్రకృతికి హాని కలగని పద్ధతులతో ఈ గ్రీన్ క్యాంపస్ నిర్మాణం జరగనుంది. ప్రస్తుతం విశాఖలో తాత్కాలిక కార్యాలయం నిర్వహిస్తున్న ఇన్ఫోసిస్, ఇప్పుడు సొంత క్యాంపస్‌ను ఏర్పాటు చేస్తుండటంతో విశాఖ గ్లోబల్ ఐటీ మ్యాప్‌ లో మరింత కీలకం కానుంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణంగా మరిన్ని కంపెనీలు ఏపీ వైపు దృష్టి సారించనున్నాయి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తిరుపతిలో కేఎఫ్‌సీ, డొమినోస్‌...

ప్రముఖ అంతర్జాతీయ ఫుడ్ బ్రాండ్ల ఆహార...

తిరుపతిలో వడ్డీ మాఫియా.....

తిరుపతి నగరంలో వడ్డీ వ్యాపారం పేరుతో...

సాయికృష్ణ కేసులో వైసీపీ...

విజయవాడ రౌడీ షీటర్‌ గాదె సాయికృష్ణ...

బ్రేకింగ్: అల్లు అర్జున్‌...

హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య...

తెలంగాణాలో జనసేన తొలి...

గత కొన్నాళ్ళుగా తెలంగాణాలో పార్టీ బలోపేతం...

బ్రేకింగ్: కొడాలి అరెస్ట్...

ఏపీలో వైసీపీ కీలక నేతలకు చట్టపరమైన...

పోల్స్