Monday, April 27, 2026 02:42 PM
Monday, April 27, 2026 02:42 PM

ఏపీలో నరకం చూస్తున్న రైతన్నలు..!

ఆంధ్రప్రదేశ్‌ లో కొనసాగుతున్న పెట్రోల్, డీజిల్ సంక్షోభం సామాన్యులనే కాకుండా అన్నదాతను కోలుకోలేని దెబ్బ తీస్తోంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా రబీ సాగు చివరి దశకు చేరుకుని, కోతలు ముమ్మరంగా సాగుతున్న సమయంలో డీజిల్ దొరకకపోవడం రైతులకు నరకం చూపిస్తోంది. వైజాగ్ నుంచి తిరుపతి వరకు ఎక్కడ చూసినా బంకుల వద్ద డీజిల్ కోసం రైతులు పడుతున్న పాట్లు వర్ణనాతీతంగా ఉన్నాయి. వరి కోత యంత్రాలు నడవాలన్నా, ట్రాక్టర్లతో ధాన్యం తరలించాలన్నా డీజిల్ అత్యవసరం.

Also Read: డీజిల్ దందా.. సర్కార్‌కు చెడ్డపేరు..!

కానీ, బంకుల్లో స్టాక్ లేకపోవడంతో యంత్రాలు పొలాల్లోనే మొరాయిస్తున్నాయి. ఒకవైపు ఆకాశం మేఘావృతమై వర్ష సూచన కనిపిస్తుంటే, మరోవైపు డీజిల్ దొరకక కోతలు ఆగిపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఏడాది పొడవునా కష్టపడి పండించిన పంట చేతికి వచ్చే వేళ.. ఇలా డీజిల్ కోసం బంకుల చుట్టూ తిరగాల్సి రావడం మా దౌర్భాగ్యం అని రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారు. రైతులు తమ పొలాల నుంచి కిలోమీటర్ల దూరం ప్రయాణించి బంకులకు చేరుకుంటున్నా నిరాశే ఎదురవుతోంది.

 

డబ్బాలు, బాటిళ్లతో వెళ్తే పోలీసులు, అధికారులు నిరాకరిస్తుండటంతో.. చివరకు తమ సొంత వాహనాల్లో డీజిల్ కొట్టించుకుని, ఆ వాహనం నుంచి మళ్ళీ డబ్బాలోకి మార్చుకోవాల్సిన దారుణమైన పరిస్థితి నెలకొంది. కొన్ని చోట్ల డీజిల్ కోసం రైతులు బంకుల వద్దే రాత్రంతా పడిగాపులు కాస్తున్నారు. కేవలం వ్యవసాయమే కాదు, రాష్ట్రంలోని ఆక్వా రంగానికి కూడా ఈ సంక్షేమం సెగ తగిలింది. రొయ్యల చెరువుల్లో ఎరేటర్లు నడవడానికి డీజిల్ జనరేటర్లే ఆధారం.

Also Read: జగన్ మెప్పు కోసం సాయిరెడ్డి కొత్త డ్రామా..?

డీజిల్ సరఫరా నిలిచిపోవడంతో ఆక్సిజన్ అందక రొయ్యలు చనిపోయే ప్రమాదం ఉందని, లక్షలాది రూపాయల పెట్టుబడి బూడిదలో పోసిన పన్నీరు అవుతోందని ఆక్వా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితి ఊహించిన దానికంటే చాలా దారుణంగా ఉందని, కేవలం పట్టణ ప్రాంతాల్లోనే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లోని బంకులకు ప్రాధాన్యత ఇచ్చి డీజిల్ సరఫరా చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన స్పందించి ఇంధన నిల్వలను పెంచకపోతే, ఈ ఏడాది రైతన్నకు తీరని నష్టం వాటిల్లేలా కనిపిస్తోంది.

 

రాష్ట్రంలో నెలకొన్న ఈ సంక్షోభంపై ప్రభుత్వం వేగంగా స్పందించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంధన శాఖ మరియు పౌరసరఫరాల అధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించారు. దీనిపై టాస్క్ ఫోర్స్ ను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పెట్రోల్, డీజిల్ సరఫరాలో అంతరాయం కలగకుండా చమురు కంపెనీలతో నిరంతరం సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. ముఖ్యంగా వ్యవసాయ అవసరాల దృష్ట్యా, గ్రామీణ ప్రాంతాల్లోని బంకులకు ప్రాధాన్యత ఇచ్చి డీజిల్ స్టాక్ పంపేలా చర్యలు తీసుకుంటున్నారు. కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్ మార్కెటింగ్‌కు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. రాబోయే రెండు మూడు రోజుల్లో సరఫరా పూర్తిగా సాధారణ స్థితికి వస్తుందని ప్రభుత్వం ధీమా వ్యక్తం చేస్తోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

విశాఖ.. పోర్ట్ టూ...

అంతర్జాతీయ టెక్ దిగ్గజం గూగుల్ ఏఐ...

డీజిల్ దందా.. సర్కార్‌కు...

ఆయిల్ కంపెనీలు తాము చేస్తున్న తప్పులను...

కవిత టీఆర్ఎస్‌.. ఏపీలో...

నా శత్రువుకు శత్రువు నా మిత్రుడు...

అయ్యా వడ్డే గారు.....

మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు తీరును...

బ్రేకింగ్: జగన్ అండ్...

గత ప్రభుత్వ హయాంలో తనపై అక్రమంగా...

సరిహద్దు వంతెన పంచాయతీ..!

ఉన్నది లేనట్లు.. లేనిది ఉన్నట్లు చెప్పడంలో...

పోల్స్