రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని, తన దారి తాను చూసుకుంటానని రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసిన విజయసాయిరెడ్డిలో మళ్ళీ పాత రాజకీయ ఆత్మ మేల్కొంది. అప్పట్లో వైసీపీలో ఉండగా సిఎం చంద్రబాబును తిట్టడమే పనిగా పెట్టుకున్న సాయిరెడ్డి, ఇప్పుడు పార్టీలో లేకపోయినా అదే పంథాను ఎంచుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తాజాగా తన నివాసంలో ఈడీ సోదాలు జరగడంతో, ఆ నెపాన్ని బాబుపైకి నెట్టేస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే.. మళ్ళీ జగన్ మోహన్ రెడ్డికి దగ్గరయ్యేందుకే ఈ తాపత్రయమనే విమర్శలు వినిపిస్తున్నాయి.
Also Read : రేవంత్ కొత్త మాస్టర్ ప్లాన్.. కేసీఆర్ కు ఉచ్చు బిగుస్తుందా..?
వైసీపీకి రాజీనామా చేసిన తర్వాత కొంతకాలం సైలెంట్ గా ఉన్న సాయిరెడ్డికి, ఇప్పుడు లిక్కర్ స్కామ్ సెగ తగలడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ఈ కష్టకాలంలో తనకు వైసీపీ అండ అవసరమని భావించే, మళ్ళీ చంద్రబాబుపై విమర్శల అస్త్రాన్ని ప్రయోగించారని విశ్లేషకులు భావిస్తున్నారు. బాబు చావుకు దగ్గరయ్యారు, నెలకు రూ. 5 వేల కోట్లు సంపాదిస్తున్నారు అంటూ ఆయన చేసిన అడ్డగోలు ఆరోపణలు.. వైసీపీ శ్రేణులకు సరికొత్త స్టఫ్ ఇచ్చినట్లు కనిపిస్తోందనే మాట వినపడుతోంది.
తద్వారా జగన్ మెప్పు పొంది, పార్టీలోకి రీ-ఎంట్రీ ఇవ్వాలని లేదా బయట ఉండి జగన్ కోసం పని చేస్తున్నానని నిరూపించుకోవాలని ఆయన ఆరాటపడుతున్నట్లు స్పష్టమవుతోందని పరిశీలకులు అంటున్నారు. లిక్కర్ స్కామ్ లో ఈడీ సోదాలు చేసి కీలక పత్రాలు స్వాధీనం చేసుకుంటే, వాటికి సమాధానం చెప్పకుండా చంద్రబాబు సంపాదన గురించి మాట్లాడటం సాయిరెడ్డి ద్వంద్వ వైఖరిని స్పష్టం చేస్తోంది. రాజకీయ సన్యాసం తీసుకున్న వ్యక్తికి మళ్ళీ పార్టీలు పెట్టడం, మీడియా సంస్థలు స్థాపించడం ఎందుకు..? అనే ప్రశ్నలు కూడా వినపడుతున్నాయి.
Also Read : అనంతబాబు అజ్ఞాతం మిస్టరీ వెనుక టిడిపి ఎమ్మెల్యే..?
చంద్రబాబుకు వయసు పెరిగిందని, చావుకు దగ్గరవుతున్నారంటూ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆయన విజ్ఞతకే వదిలేయాలనే మాట వినపడుతోంది. అయితే ఇక్కడ ఒక లాజిక్ ఆయన ఎలా మర్చిపోయారో అర్థం కావడం లేదని పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు వయసు 76 ఏళ్లు అయితే, విజయసాయిరెడ్డి వయసు 68 ఏళ్లు. అంటే వీరిద్దరి మధ్య ఉన్న తేడా కేవలం 8 ఏళ్లు మాత్రమే. చంద్రబాబుకు వయసు పెరిగితే.. అదే లెక్కన సాయిరెడ్డికి కూడా వయసు పెరుగుతున్నట్లే కదా..? బాబు చావుకు దగ్గరవుతుంటే, మరి 8 ఏళ్ల తేడాలో ఉన్న సాయిరెడ్డి ఎక్కడికి వెళ్తున్నట్లు..? ఎదుటివారిని దూషించాలనే కసితో తన వయసును, కనీస తర్కాన్ని కూడా మర్చిపోయి మాట్లాడటం చూస్తుంటే.. ఆయనకు వయసు పెరిగింది కానీ బుద్ధి పెరగలేదని సోషల్ మీడియాలో నెటిజన్లు ఏకిపారేస్తున్నారు.

