Sunday, April 26, 2026 12:25 PM
Sunday, April 26, 2026 12:25 PM

కవిత టీఆర్ఎస్‌.. ఏపీలో జోరుగా చర్చ..!

నా శత్రువుకు శత్రువు నా మిత్రుడు అంటే ఇదే కాబోలు. కవిత పార్టీ పెడితే ఎక్కువ చర్చ తెలంగాణలో రావాలి. కానీ, కవిత పార్టీపై ఆంధ్ర రాజకీయ పార్టీల్లో ఎక్కువ చర్చ జరుగుతోంది. కవిత పార్టీకి మద్దతుగా టీడీపీ శ్రేణులు మాట్లాడుతుంటే.. కవిత పార్టీపై వ్యతిరేకంగా వైసీపీ శ్రేణులు కామెంట్స్ చేయడం విశేషం. నిజమే.. తెలంగాణ రాజకీయాల్లో మరో కొత్త పార్టీ వచ్చింది. తెలంగాణ రాష్ట్ర సేన పేరుతో మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కుమార్తె కల్వకుంట్ల కవిత కొత్త రాజకీయ పార్టీ ప్రారంభించారు. తనకు సింగరేణి అంటే ఇష్టమని.. తెలంగాణ జాగృతి పేరుతో ఆడబిడ్డలను ఏకం చేశానన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం తాను ఎంతో పోరాటం చేసినట్లు కవిత ప్రకటించారు.

Also Read : జగన్ మెప్పు కోసం సాయిరెడ్డి కొత్త డ్రామా..?

నిజానికి కవిత టార్గెట్ భారత్ రాష్ట్ర సమితి.. బీఆర్ఎస్ అన్నట్లుగానే విమర్శలు చేశారు. పార్టీ ప్రకటన అనంతరం తన సుదీర్ఘ ప్రసంగంలో ఒక్క మాట కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి ప్రస్తావించలేదు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపైన, పదేళ్లు అధికారంలో ఉండి ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పైనే విమర్శలు చేశారు. తన ప్రసంగం మొత్తం టార్గెట్ కేసీఆర్, కేటీఆర్ అన్నట్లుగానే సాగింది. అయితే తెలంగాణలో కొత్త పార్టీ మొదలైతే.. దాని ప్రభావం ఏపీలో బాగా చూపిస్తోంది. ఇంకా చెప్పాలంటే.. కవిత పార్టీ పట్ల ఏపీలో అధికార, ప్రతిపక్షాలు కూడా రెండు వర్గాలుగా విడిపోయి.. విమర్శలు చేసుకోవటం విడ్డూరంగా ఉంది.

కవిత పార్టీ పేరు ప్రకటించిన వెంటనే.. ఆమెకు మద్దతుగా టీడీపీ అభిమానులు మాట్లాడుతుంటే.. నీకెందుకు రాజకీయాలు అని వైసీపీ శ్రేణులు కామెంట్లు చేస్తున్నారు. నిత్యం టీడీపీని, కూటమి ప్రభుత్వాని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో కామెంట్లు చేసే వైసీపీ జనరల్ సెక్రటరీ డాక్టర్ చింతా ప్రదీప్ రెడ్డి అయితే.. కవిత పార్టీ ప్రకటన తర్వాత ఆమెను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో వరుస పోస్టులు పెట్టారు. షర్మిలతో కవితను పోలుస్తూ వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేశారు. ఇది ప్రదీప్ ఒక్కడే కాదు.. వైసీపీ అభిమానులంతే కూడా కవిత చీర కట్టులో కూడా షర్మిలను కాపీ కొట్టారంటూ పోస్టులు చేశారు. తండ్రి, అన్నను టార్గెట్ చేయడం ఏమిటంటూ పరోక్షంగా బీఆర్ఎస్‌కు అనుకూలంగా వైసీపీ అభిమానులంతా సోషల్ మీడియాలో కవితను ట్రోల్ చేస్తూనే ఉన్నారు.

Also Read : బ్రేకింగ్: జగన్ అండ్ గ్యాంగ్ కు ఏబీవి షాక్..!

అయితే టీడీపీ అభిమానులు మాత్రం గులాబీ పార్టీకి ముల్లు గట్టిగా గుచ్చుకుంది అంటూ సెటైర్లు వేస్తున్నారు. అలాగే తెలంగాణలో ఇకపై బీఆర్ఎస్ లేదు.. కేవలం టీఆర్ఎస్ మాత్రమే ఉందంటున్నారు. బీఆర్ఎస్ అంటే జాతీయ పార్టీ అని.. కానీ కవిత ఆధ్వర్యంలోని తెలంగాణ రాష్ట్ర సేన మాత్రమే తెలంగాణ రాష్ట్రానికి పరిమితమైందని వ్యాఖ్యానిస్తున్నారు. టీడీపీ అభిమానుల కామెంట్ల వెనుక బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పట్ల తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. 2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమికి కేసీఆర్ పరోక్షంగా కారణం. ఆ తర్వాత చంద్రబాబుపై చాలా నీచమైన వ్యాఖ్యలు చేశారు. ఇక చంద్రబాబు అరెస్టు సమయంలో హైదరాబాద్‌లో నిరసన ప్రదర్శనలు ఎందుకంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు కూడా 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి ఒక కారణం. అందుకే ఇప్పుడు తెలంగాణలో కవిత ప్రారంభించిన పార్టీ గురించి ఏపీలో జోరుగా చర్చ నడుస్తోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

అయ్యా వడ్డే గారు.....

మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు తీరును...

బ్రేకింగ్: జగన్ అండ్...

గత ప్రభుత్వ హయాంలో తనపై అక్రమంగా...

సరిహద్దు వంతెన పంచాయతీ..!

ఉన్నది లేనట్లు.. లేనిది ఉన్నట్లు చెప్పడంలో...

జగన్ మెప్పు కోసం...

రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని, తన దారి...

కల్తీ నెయ్యి కేసు.....

కల్తీ నెయ్యి కుంభకోణంపై సిట్ అధికారులు...

బ్రేకింగ్; తెలంగాణ రాష్ట్ర...

గత కొద్దిరోజులుగా జరుగుతున్న ప్రచారానికి తెరదించుతూ...

పోల్స్