Saturday, June 20, 2026 10:02 PM
Saturday, June 20, 2026 10:02 PM

తల్లి చనిపోయిన బాధను మింగుతూ.. ఫస్ట్ ఓవర్ లో వికెట్..!

ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌ లో భాగంగా ముంబై ఇండియన్స్‌ తో జరిగిన మ్యాచ్‌ లో చెన్నై సూపర్ కింగ్స్ పేసర్ ముకేష్ చౌదరి ఆటపై చూపిన అంకితభావం ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టిస్తోంది. వ్యక్తిగతంగా తనకు జరిగిన తీరని లోటును పక్కన పెట్టి, జట్టు కోసం అతను ఆడిన విధానంపై ప్రసంశలు కురిపిస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్. ముకేష్ చౌదరి తల్లి ప్రేమ్ దేవి ఏప్రిల్ 21న అనారోగ్యంతో కన్నుమూయగా.. అతను మూడు రెండు రోజుల్లో మ్యాచ్ ఆడేందుకు మైదానంలో దిగాడు. గత ఏడాది కాలంగా ఆమె క్యాన్సర్‌ తో పోరాడుతూ ముంబైలోని టాటా మెమోరియల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

Also Read : లిక్కర్ టెండర్ల సెగ.. కారుమూరి అరెస్ట్ తప్పదా..?

తల్లి మరణవార్త వినగానే రాజస్థాన్‌ లోని తన స్వగ్రామానికి వెళ్లి అంత్యక్రియలు పూర్తి చేసిన ముకేష్, కనీసం విశ్రాంతి కూడా తీసుకోకుండా కేవలం రెండు రోజుల్లోనే తిరిగి జట్టుతో చేరాడు. ముంబైతో జరిగిన హై-వోల్టేజ్ మ్యాచ్‌ లో ముకేష్ చౌదరి తొలి ఓవర్‌ లోనే క్వింటన్ డి కాక్ వికెట్ పడగొట్టాడు. సాధారణంగా వికెట్ పడితే ఆటగాళ్లు ఎగిరి గంతేస్తారు, కానీ ముకేష్ మాత్రం నిశ్శబ్దంగా ఆకాశం వైపు చూస్తూ తన తల్లికి నివాళులర్పించారు. ఆ దృశ్యం చూసిన అభిమానులు సోషల్ మీడియాలో నువ్వు నిజమైన హీరోవయ్యా అంటూ ప్రసంశలు కురిపిస్తున్నారు.

Also Read : అదరగొడుతున్న రాజస్థాన్ కెప్టెన్..!

ముకేష్ చౌదరి పడుతున్న బాధను పంచుకోవడానికి చెన్నై యాజమాన్యం, ఆటగాళ్లందరూ నిన్నటి మ్యాచ్‌ లో నల్లటి రిబ్బన్లు ధరించి బరిలోకి దిగారు. అటు జట్టు సీనియర్ ఆటగాడు.. ధోనీ కూడా ముకేష్‌ కు అండగా నిలవడమే కాకుండా, అంతకుముందు ఆసుపత్రికి వెళ్లి ఆయన తల్లిని పరామర్శించడం విశేషం. ఈ మ్యాచ్‌ లో చెన్నై సూపర్ కింగ్స్ 103 పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది. మ్యాచ్ అనంతరం కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మాట్లాడుతూ.. ఈ విజయం పూర్తిగా ముకేష్ చౌదరికే అంకితం. ఇలాంటి కష్టసమయంలో ఆయన చూపిన ధైర్యం మా అందరికీ స్ఫూర్తిదాయకం అని కొనియాడాడు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తిరుపతిలో కేఎఫ్‌సీ, డొమినోస్‌...

ప్రముఖ అంతర్జాతీయ ఫుడ్ బ్రాండ్ల ఆహార...

తిరుపతిలో వడ్డీ మాఫియా.....

తిరుపతి నగరంలో వడ్డీ వ్యాపారం పేరుతో...

సాయికృష్ణ కేసులో వైసీపీ...

విజయవాడ రౌడీ షీటర్‌ గాదె సాయికృష్ణ...

బ్రేకింగ్: అల్లు అర్జున్‌...

హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య...

తెలంగాణాలో జనసేన తొలి...

గత కొన్నాళ్ళుగా తెలంగాణాలో పార్టీ బలోపేతం...

బ్రేకింగ్: కొడాలి అరెస్ట్...

ఏపీలో వైసీపీ కీలక నేతలకు చట్టపరమైన...

పోల్స్