Saturday, June 20, 2026 01:04 PM
Saturday, June 20, 2026 01:04 PM

అదరగొడుతున్న రాజస్థాన్ కెప్టెన్..!

ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌ లో రాజస్థాన్ రాయల్స్ అప్రతిహత విజయాలతో దూసుకుపోతోంది. ఈ విజయాల వెనుక యువ కెప్టెన్ రియాన్ పరాగ్ సరికొత్త వ్యూహాలు, అతని అద్భుతమైన ఫీల్డింగ్ విన్యాసాలు ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో హాట్ టాపిక్‌ గా మారాయి. నిన్న లక్నో సూపర్ జెయింట్స్‌ తో జరిగిన మ్యాచ్‌ లో కేవలం 159 పరుగుల స్వల్ప స్కోరును కాపాడుకున్న తీరు పరాగ్ కెప్టెన్సీ పరిణతికి నిదర్శనంగా నిలిచింది. బ్యాటింగ్‌ లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయినా, ఆ లోటును తన ఫీల్డింగ్‌ తో భర్తీ చేస్తూ జట్టును ముందుండి నడిపిస్తున్నాడు.

Also Read : అనంతబాబు ఎస్కేప్.. పోలీస్ శాఖ సీరియస్ యాక్షన్..!

నిన్నటి మ్యాచ్ విశ్లేషణను గమనిస్తే, ఎకానా స్టేడియంలో రాజస్థాన్ మొదట బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 159/6 పరుగులు మాత్రమే చేయగలిగింది. లక్నో వంటి బలమైన జట్టుకు ఇది చాలా చిన్న లక్ష్యం అని అందరూ భావించారు. కానీ పరాగ్ తన బౌలర్లను వాడుకున్న తీరు అమోఘం. ఒత్తిడి సమయంలో కూడా ఎక్కడా ఆవేశపడకుండా, ఫీల్డ్ సెటప్‌ లో కీలక మార్పులు చేస్తూ లక్నోను కేవలం 119 పరుగులకే కట్టడి చేశాడు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో పరాగ్ చేసిన బౌలింగ్ మార్పులు లక్నో బ్యాటర్లను ఉక్కిరిబిక్కిరి చేశాయి.

Also Read : అనంతలో లేడీ డాన్ రచ్చ.. షేక్ అవుతోన్న పోలీసు శాఖ..!

గతంలో సోషల్ మీడియాలో తన పోస్ట్‌లతో తరచుగా వివాదాల్లో నిలిచే పరాగ్, ఈ సీజన్‌ లో మాత్రం పూర్తి భిన్నంగా కనిపిస్తున్నాడు. అనవసరమైన హడావుడికి దూరంగా ఉంటూ, మౌనంగా తన పని తాను చేసుకుపోతున్నాడు. విమర్శలను అవకాశాలుగా మార్చుకుంటూ, ఇప్పటికే ఐదు విజయాలతో రాజస్థాన్‌ ను పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిపాడు. అతనిలోని ఈ కొత్త కూల్ అండ్ మాస్ వెర్షన్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఏది ఏమైనా.. ఈ సీజన్‌లో మిగతా జట్ల కెప్టెన్లు తడబడుతున్న వేళ, రియాన్ పరాగ్, పంజాబ్, ఆర్సీబీ కెప్టెన్లు మాత్రమే మైదానంలో చాలా బలంగా, స్పష్టమైన వ్యూహాలతో కనిపిస్తున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తిరుపతిలో వడ్డీ మాఫియా.....

తిరుపతి నగరంలో వడ్డీ వ్యాపారం పేరుతో...

సాయికృష్ణ కేసులో వైసీపీ...

విజయవాడ రౌడీ షీటర్‌ గాదె సాయికృష్ణ...

బ్రేకింగ్: అల్లు అర్జున్‌...

హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య...

తెలంగాణాలో జనసేన తొలి...

గత కొన్నాళ్ళుగా తెలంగాణాలో పార్టీ బలోపేతం...

బ్రేకింగ్: కొడాలి అరెస్ట్...

ఏపీలో వైసీపీ కీలక నేతలకు చట్టపరమైన...

‘పెద్ది’కి బిగ్ సర్‌ప్రైజ్.....

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

పోల్స్