Wednesday, April 22, 2026 08:14 PM
Wednesday, April 22, 2026 08:14 PM

నయా రథసారధి.. ముహూర్తం ఫిక్స్..!

ఏపీలో కూటమి ప్రభుత్వాన్ని నడుపుతున్న టీడీపీలో కీలక మార్పునకు రంగం సిద్ధం అవుతోంది. ముఖ్య మంత్రి చంద్రబాబు వయస్సు రీత్యా పార్టీని నడిపేందుకు మునుపటిలా దూకుడుగా ఉండలేక పోతున్నారు. ఈ నేపథ్యంలోనే సమర్థుడిగా భావిస్తున్న ఆయన తనయుడు నారా లోకేష్‌కు పార్టీ పగ్గాలు అప్పగించేందుకు రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే పార్టీ కమిటీల ఏర్పాటులో భాగంగా లోకేష్‌ను టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఎంపిక చేశారు. ఇప్పుడు ఆయన పగ్గాల స్వీకరణకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 29న కొత్త కార్యవర్గం బాధ్యతలు చేపట్టాలని నిర్ణయించారు.

Also Read : పెద్ద దస్తగిరి హత్య కేసులో.. జగన్‌ దగ్గరి బంధువు..??

టీడీపీలో నాయకత్వ మార్పు దిశగా కీలక అడుగులు పడుతుండగా.. అదే సమయంలో ప్రభుత్వం పనితీరును ప్రజల్లో బలంగా ప్రతిష్టించేందుకు పార్టీ యంత్రాంగాన్ని మరింత చురుకుగా మార్చే ప్రయత్నం జరుగుతోంది. ప్రజలకు సంక్షేమం, ప్రభుత్వ సేవలు, రాష్ట్రాభివృద్ధి విషయంలో పారదర్శకంగా వ్యవహరిస్తున్నామని.. కానీ కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని సీఎం చంద్రబాబు పార్టీ నేతలతో ఇటీవల జరిపిన టెలీ కాన్ఫరెన్స్‌లో వ్యాఖ్యానించారు. వాస్తవాలను ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులున్నా, వాటిని ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూనే ప్రజలకు సంక్షేమం-అభివృద్ధి అందించే విషయంలో రాజీ పడకుండా వరిపాలన సాగిస్తున్నామన్నారు. ఈ విషయాలను ప్రజలకు వివరించాలని వారికి సూచించారు.

మహానాడు నిర్వహణకు సంబంధించిన కమిటీల ఏర్పాటుపైనా కసరత్తు చేస్తున్నట్టు సీఎంకు పార్టీ నేతలు వివరించారు. కొందరు ప్రభుత్వం మీద.. కూటమి పార్టీల మీద అబద్దాలాడుతూ రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఇలాంటి తప్పుడు సమాచారాన్ని వివిధ మార్గాల ద్వారా.. వివిధ వ్యక్తుల ద్వారా చేరవేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. తప్పుడు ప్రచారాలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టాల్సిందేనని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రజలకు వాస్తవాలు తెలిస్తే.. వాళ్లే విశ్లేషించుకుంటారన్నారు. పరిపాలన విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పడుతున్న కష్టాన్ని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పగలిగితే… ప్రత్యర్థుల కుట్రలను తిప్పికొట్టేలా ప్రజలే ప్రభుత్వానికి బ్రాండ్ అంబాసిడర్లుగా మారతారని చెప్పారు.

Also Read : మళ్ళీ అమెజాన్ అడవుల్లోకి మహేష్.. రిస్క్ చేస్తున్న జక్కన్న..!

టీడీపీ నిర్వహిస్తున్న ట్రైనింగ్ క్లాసులతో పాటు, కాఫీ కబుర్లు వంటి కార్యక్రమాల ద్వారా లీడర్ కేడర్ మధ్య ఎమోషనల్ బాండింగ్ ఏర్పడుతోందని తెలిపారు. మొత్తంగా వయస్సు. అనుభవం దృష్ట్యా పార్టీ భవిష్యత్తును యువ నాయకత్వానికి అప్పగించాలనే ఆలోచనలో ఉన్న చంద్రబాబు.. లోకేష్‌ను పూర్తి స్థాయి నాయకుడిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. పార్టీ కమిటీల పునర్వ్యవస్థీకరణ కూడా అదే దిశగా సాగుతోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

అజ్ఞాతంలోకి అనంతబాబు బిగుస్తున్న...

డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడిగా...

మాజీ సీఎం నాదెండ్ల...

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం నాదెండ్ల...

ఈరోజు రాశి ఫలితాలు...

శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం,...

మహానాడు వేదిక ఖరారు.....

తెలుగుదేశం పార్టీకి ఎంతో ప్రతిష్టాత్మకమైంది మహానాడు....

పెద్ద దస్తగిరి హత్య...

కడపలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి పెద్ద...

జనసేన వర్సెస్ టీడీపీ.....

డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం...

పోల్స్