Friday, June 19, 2026 03:14 PM
Friday, June 19, 2026 03:14 PM

ఈరోజు రాశి ఫలితాలు (22-04-2026)

శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, శుక్ల పక్షం.. 22-04-2026 నాడు మీ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి అనుకుంటున్నారా, అయితే ఆ వివరాలు మీకోసం. మీ గ్రహాల ప్రభావం ఎలా ఉందో చెక్ చేసుకోండి..

మేషం

అవసరానికి సన్నిహితుల సహాయ సహకారాలు అందుతాయి. వ్యాపారములు లాభసాటిగా సాగుతాయి. మధ్యలో నిలిచిన పనులు నిదానంగా పూర్తిచేస్తారు. కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో సమస్యలను దైర్యంగా పరిష్కరించుకుంటారు.

—————————————

వృషభం

కొన్ని వ్యవహారాలలో ఆప్తులతో వివాదాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రయాణాలలో వాహన ఇబ్బందులుంటాయి. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి.

—————————————

మిధునం

చేపట్టిన పనులు సకాలంలో పూర్తి అవుతాయి. నూతన ఋణ ప్రయత్నాలు ఫలిస్తాయి. సంఘంలో పెద్దల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

—————————————

కర్కాటకం

ఉద్యోగస్తుల జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగప్రాప్తి కలుగుతుంది. సమాజంలో పరిచయాలు విస్తృతమౌతాయి. స్థిరాస్తి వ్యవహారాలలో సమస్యలు అధిగమిస్తారు. వృత్తి వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఆర్ధిక అనుకూలత కలుగుతుంది.

—————————————

సింహం

కొన్ని వ్యవహారాలు మధ్యలో నిలిచిపోతాయి. వ్యాపారాలలో ద్విస్వభావ ఆలోచనలు చేసి ఇబ్బంది పడతారు. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో శ్రద్ద వహించాలి. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. మిత్రులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. వృత్తి ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి.

—————————————

కన్య

నూతన ఋణ యత్నాలు కొంత కష్టంతో పూర్తి అవుతాయి. బందు మిత్రులతో మాటపట్టింపులుంటాయి. దూరపు బంధువుల నుండి ఆసక్తికర విషయాలు తెలుస్తాయి. చేపట్టిన పనులలో జాప్యం తప్పదు. వ్యాపార వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. వృత్తి ఉద్యోగాలు కొంత సామాన్యంగా లాభిస్తాయి.

—————————————

తుల

బంధుమిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. భూ క్రయవిక్రయాలలో విశేషమైన లాభాలు అందుతాయి. చేపట్టిన పనిలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. కుటుంబ పెద్దలతో సఖ్యతగా వ్యవహరిస్తారు. వృత్తి,ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.

—————————————

వృశ్చికం

ఆప్తులతో దీర్ఘకాలిక వివాదాలు తీరి ఊరట చెందుతారు. అనుకున్న సమయానికి పనులు పూర్తిచేస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలకు లోటుండదు. వృత్తి వ్యాపారాలు సజావుగా సాగుతాయి. వృత్తి ఉద్యోగ విషయంలో ఉన్న సమస్యలు అధిగమిస్తారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.

—————————————

ధనస్సు

ఆర్థిక వ్యవహారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. సంతాన విద్యా విషయాలు నిరాశపరుస్తాయి. దైవ సేవా కార్యక్రమాలలో కుటుంబ సభ్యులతో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాలలో ఊహించని సమస్యలు కలుగుతాయి.

—————————————

మకరం

దూరప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. బంధువుల నుండి అందిన ఒక వార్త నిరుత్సాహం కలిగిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఋణ దాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపార ఉద్యోగాలలో అదనపు బాధ్యతల వలన తగిన విశ్రాంతి ఉండదు.

—————————————

కుంభం

ఆత్మీయులతో కీలక విషయాల గురించి చర్చిస్తారు. మిత్రుల సలహాతో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. సోదరులతో స్ధిరాస్తి ఒప్పందాలు కుదురుతాయి. నూతన ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు.

—————————————

మీనం

ఋణ దాతలు నుండి ఒత్తిడి పెరుగుతుంది. ఆకస్మిక దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. సంతాన ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. చేపట్టిన పనులలో అవరోధాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో అంచనాలు అందుకోవడంలో విఫలమౌతారు.

—————————————

గమనిక : ఈ ఆర్టికల్‌లో అందించిన జ్యోతిష్య సమాచారం, వార్షిక ఫలాలు, పరిహారాలన్నీ జ్యోతిష్యశాస్త్రం, హిందూ మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇది అందుబాటులో ఉన్న సమాచారం మేరకు అవగాహనా కొరకు ఇవ్వబడింది. ఏదైనా నిర్ణయాలు తీసుకునే ముందు జ్యోతిష్య పండితులను సంప్రదించండి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

బ్రేకింగ్: అల్లు అర్జున్‌...

హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య...

తెలంగాణాలో జనసేన తొలి...

గత కొన్నాళ్ళుగా తెలంగాణాలో పార్టీ బలోపేతం...

బ్రేకింగ్: కొడాలి అరెస్ట్...

ఏపీలో వైసీపీ కీలక నేతలకు చట్టపరమైన...

‘పెద్ది’కి బిగ్ సర్‌ప్రైజ్.....

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

రఘురామ కేసుపై హైకోర్ట్...

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఐపీఎస్ అధికారి సునీల్‌...

ఏపీ లిక్కర్ స్కామ్‌లో...

ఏపీలో సంచలనం సృష్టించిన మద్యం రవాణా...

పోల్స్