Sunday, April 19, 2026 11:23 AM
Sunday, April 19, 2026 11:23 AM

ఈసారి గ్యారంటీ.. మూడేళ్ల ముందే జగన్ హామీ..!

వరుసగా మూడు ఎన్నికల్లో మొండి చెయ్యి. ఆ టికెట్ మీకే అంటారు.. కానీ చివరి నిమిషంలో జాబితాలో పేరు మార్పు. పార్టీ కోసం 14 ఏళ్లుగా కష్టపడుతున్నారు. కానీ ప్రత్యక్ష ఎన్నికల్లో మాత్రం అవకాశం రావటం లేదు. అంతర్గత రాజకీయాల కారణంగా చివరి నిమిషంలో ఆశలు గల్లంతు అవుతున్నాయి. అయినా సరే.. పార్టీ గెలుపు కోసం పడిన కష్టానికి గుర్తింపుగా మండలిలో అవకాశం ఇచ్చారు. చట్టసభలో తన వాణి గట్టిగా వినిపించటంతో ఈసారి మాత్రం ఎన్నికలకు ఏకంగా మూడేళ్ల ముందే టికెట్ నీకే అని అధినేత స్వయంగా ప్రకటించారు. ఉత్తరాంధ్ర బీసీ నేతగా గుర్తింపు తెచ్చుకున్న వరుదు కళ్యాణికి వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్వయంగా హామీ ఇచ్చారు.

Also read : చిన్నారి పునర్వికకు పునర్జన్మ.. అన్నగా మాట నిలబెట్టుకున్న లోకేష్

2009 ఎన్నికల్లో తొలిసారి ప్రజారాజ్యం పార్టీ తరఫున రాజకీయాల్లోకి వచ్చారు వరుదు కల్యాణి. శ్రీకాకుళం లోక్‌సభ నియోజకవర్గం అభ్యర్థిగా పోటీ చేసిన వరుదు కల్యాణి.. ఏకంగా లక్షా 60 వేల ఓట్లు సాధించారు. ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి కింజరాపు ఎర్రన్నాయుడు ఓటమికి పరోక్షంగా కారణమయ్యారు కూడా. పీఆర్‌పీ కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో.. కొద్ది రోజుల పాటు రాజకీయాలకు దూరంగా ఉన్న కల్యాణి.. ఆ తర్వాత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్థాపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇంకా చెప్పాలంటే.. ఉత్తరాంధ్రలో ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో వైఎస్ జగన్‌కు మద్దతు తెలిపిన మొదటి నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. నాటి నుంచి జగన్ వెంటే నడుస్తున్నారు.

2014 ఎన్నికలకు ముందు వరుదు కల్యాణి వైసీపీ శ్రీకాకుళం అసెంబ్లీ సమన్వయకర్తగా వ్యవహరించారు. అయితే సరిగ్గా ఎన్నికలకు నెల రోజుల ముందు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరిన ధర్మాన ప్రసాదరావుకు టికెట్ ఇచ్చారు జగన్. అదే సమయంలో వరుదు కల్యాణిని అరకు పార్లమెంట్ పరిశీలకులుగా బాధ్యతలు అప్పగించారు. ఆ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి కొత్తపల్లి గీత గెలుపు కోసం కల్యాణి పని చేశారు. ఆ ఎన్నికల్లో పార్టీ ఓడిన తర్వాత జూపూడి ప్రభాకర్ వంటి పలువురు ముఖ్య నేతలు సైలెంట్‌గా టీడీపీలో చేరినప్పటికీ.. కల్యాణి మాత్రం అలాగే ఉన్నారు. ఇక 2019 ఎన్నికలకు రెండేళ్ల ముందే అనకాపల్లి పార్లమెంట్ సమన్వయకర్తగా వైసీపీ అధిష్ఠానం ప్రకటించింది. దీంతో టికెట్ తనకు ఖాయమనుకున్న కల్యాణి.. రెండేళ్లు ఎంతో కష్టపడ్డారు. కానీ చివరి నిమిషంలో సత్యవతికి టికెట్ ఇచ్చారు. అయితే ఈ మార్పు వెనుక నాటి ఎంపీ విజయసాయిరెడ్డి కీ రోల్ పోషించారనే మాట బాగా వినిపించింది.

Also read : ఢిల్లీలో రేవంత్ సెన్సేషన్.. ఎన్డియే ఎంపీలతో బ్రేక్ ఫాస్ట్..!

ఆ ఎన్నికల్లో పార్టీ గెలుపుతో వరుదు కల్యాణికి నామినేటెడ్ పదవి గ్యారంటీ అనుకున్నారు అంతా. కానీ.. అనూహ్యంగా 2021లో విశాఖ స్థానిక సంస్థల కోటాలో కల్యాణి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2024 ఎన్నికల్లో వైసీపీ ఓడిన తర్వాత మండలిలో వైసీపీ వాణిని బలంగా వినిపిస్తున్నారు. ఏకంగా టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి నారా లోకేష్‌ను టార్గెట్ చేస్తూ పదే పదే విమర్శలు చేశారు. కల్యాణి దూకుడుకు కళ్లెం వేసేందుకే ప్రత్యేకంగా ఉత్తరాంధ్రకు చెందిన ఎస్సీ మహిళ కావలి గ్రీష్మకు మండలి అవకాశం ఇచ్చారు. కానీ కల్యాణి దూకుడుకు గ్రీష్మ బ్రేకులు వేయలేకపోతున్నారు. ఇక వరుదు కల్యాణిని రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్ష బాధ్యతలు కూడా అప్పగించారు జగన్. దీంతో కూటమి సర్కార్‌కు వ్యతిరేకంగా కల్యాణి గట్టిగానే ఆరోపణలు చేస్తున్నారు.

తాజాగా జరిగిన పార్టీ అంతర్గత సమావేశంలో ముఖ్య నేతలు, అనుబంధ విభాగాల నాయకులతో సమావేశమైన వైసీపీ అధినేత వైఎస్ జగన్.. రాబోయే ఎన్నికల నాటికి పార్టీని మరింత బలోపేతం చేయాలని సూచించారు. ఇదే సమావేశంలో అనకాపల్లి అసెంబ్లీ అభ్యర్థిగా వరుదు కల్యాణి అని ప్రకటించినట్లు తెలుస్తోంది. ఎన్నికలకు మూడేళ్లు ముందుగానే జగన్ ఈ హామీ ఇవ్వటం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అనకాపల్లి నుంచి 2019లో గెలిచిన గుడివాడ అమర్నాథ్‌.. చివరి నిమిషంలో గత ఎన్నికల్లో గాజువాక నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం ఆయన చోడవరం సమన్వయకర్తగా కొనసాగుతున్నారు. అయితే అమర్నాథ్‌కు మాత్రం అనకాపల్లి దాటి వెళ్లటం ఇష్టం లేదు. అదే సమయంలో అధినేత మాటకు ఎదురు చెప్పే ధైర్యం కూడా లేదు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ అధిష్ఠానం సైతం అనకాపల్లిలో వరుదుకు పోటీగా బీసీ మహిళను ఎన్నికల బరిలో దింపాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికలకు ఇంకా మూడేళ్ల సమయం ఉంది. కానీ ఇప్పటి నుంచి ఉత్తరాంధ్ర రాజకీయ సమీకరణాలు హాట్ హాట్‌గా మారాయి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

టార్గెట్ ధర్మాన, బొత్స.....

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో మరోసారి ఉద్రిక్తతలు రాజుకున్నాయి....

ఏపీకి మోదీ సర్కార్...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం మరోసారి...

ఏపీలో స్లీపర్ బస్సుల...

దేశంలో.. దూరప్రాంత ప్రయాణాలకు అత్యంత ఆదరణ...

చిన్నారి పునర్వికకు పునర్జన్మ.....

ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్న చిన్నారి పునర్విక...

మెటాలో 8,000 మంది...

ఏఐ అడుగుపెట్టిన తర్వాత టెక్ రంగంలో...

ఢిల్లీలో రేవంత్ సెన్సేషన్.....

దేశ రాజధాని ఢిల్లీలో డీలిమిటేషన్, మహిళా...

పోల్స్