Friday, September 18, 2026 02:54 AM
Friday, September 18, 2026 02:54 AM

మెటాలో 8,000 మంది ఇంటికే.. భారత్‌ పై ప్రభావం ఎంత..?

ఏఐ అడుగుపెట్టిన తర్వాత టెక్ రంగంలో పెద్ద ఎత్తున ఉద్యోగాలు తొలగిస్తోన్న సంగతి తెలిసిందే. ప్రముఖ టెక్ దిగ్గజం ఒరాకిల్ ఇటీవల ఉద్యోగులపై వేటు వేస్తున్నట్లు ప్రకటించిన కొన్ని వారాల వ్యవధిలోనే, సోషల్ మీడియా దిగ్గజం మెటా సైతం భారీ లేఆఫ్స్‌ కు సిద్ధమైంది. మార్క్ జుకర్‌ బర్గ్ యాజమాన్యంలోని ఫేస్బుక్ మాతృ సంస్థ మెటా, తన మొత్తం సిబ్బందిలో సుమారు 10 శాతం మందిని, అంటే దాదాపు 8,000 మంది ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించిందని అంతర్జాతీయ మీడియా పేర్కొంది.

Also Read : మెగా కాంపౌండ్‌పై ఎందుకింత కుట్ర..?

ఈ తొలగింపుల ప్రక్రియ మే 20 నుండి ప్రారంభం కానుండటం గమనార్హం. మెటా తీసుకున్న ఈ నిర్ణయం ప్రభావం భారత్ లో పడే అవకాశం ఉంది. భారత్ లో.. మెటాకు భారీ యూజర్ బేస్, పెద్ద ఎత్తున ఇంజనీరింగ్, మార్కెటింగ్ టీమ్స్ ఉన్నాయి. ఈ 8,000 మందిలో భారతీయ ఉద్యోగులు కూడా గణనీయమైన సంఖ్యలో ఉండే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. భారత్ పై.. ప్రభావం ప్రధానంగా రెండు రకాలుగా ఉండవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. భారత్ లో మాత్రం 1000 మందికి పైగా ప్రభావం పడే అవకాశం ఉండవచ్చు.

Also Read : ఈ లెక్కలేంటో అర్థమే కావటం లేదు..!

రెండోది, గ్లోబల్ టీమ్స్ తగ్గడం వల్ల ఇక్కడి ప్రాజెక్టుల వేగం తగ్గే అవకాశం ఉండవచ్చు. అయితే, ఖర్చులను తగ్గించుకోవడంలో భాగంగా మెటా ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కేవలం మే నెలలోనే కాకుండా, ఈ ఏడాది చివర్లో మరిన్ని తొలగింపులు ఉండవచ్చనే వార్తలు ఉద్యోగుల నిద్ర లేకుండా చేస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక మందగమనం, ప్రకటనల ఆదాయం తగ్గడమే మెటా ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణమని సమాచారం. ఒరాకిల్ తర్వాత మెటా వంటి దిగ్గజ సంస్థ కూడా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం టెక్ రంగంలో పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో చెప్పవచ్చు అంటున్నారు నిపుణులు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

మరో వైసీపీ కీలక...

అనంతపురం జిల్లాలో జరుగుతోన్న అక్రమ మైనింగ్...

కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్‌హౌస్...

తెలంగాణ మాజీ సిఎం, బీఆర్ఎస్ అధినేత...

చంద్రబాబుపై కేంద్ర మంత్రి...

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత...

రచ్చకెక్కిన ఉత్తరాంధ్ర వైసీపీ...

శ్రీకాకుళం జిల్లాలో సుదీర్ఘ రాజకీయ అనుభవం...

గ్రామాల్లో అభివృద్ధి పండుగ,...

ఏపీ డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్...

నేను లండన్ వెళ్తా...

సోషల్ మీడియా సెలబ్రిటీ, ప్రముఖ యూట్యూబర్...

పోల్స్