‘స్టాండప్ కామెడీ’ కుట్ర.. తెర వెనుక ఉన్నది ఎవరూ.. ఫండింగ్ ఎవరిది..? ఇప్పుడు ఇవే ప్రశ్నలు.. అటు టాలీవుడ్‌లో ఇటు పొలిటికల్ సర్కిల్‌లో బాగా వినిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంపై అత్యంత జుగుప్సాకరమైన విమర్శల్ని, వైసీపీ అధినేత, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు పదే పదే చేయడం అందరికీ తెలిసిన విషయమే. ఇప్పటికీ పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంపై వైసీపీ నేతలు కొందరు అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు.
Also Read : సింహాద్రి అప్పన్న నిజరూపం.. ముందుగా వారికే..!
పవన్ కళ్యాణ్ మీదనే కాదు, చిరంజీవిపైనా అలానే నాగబాబు మీదా, చివరికి నాగబాబు కుమార్తె నిహారిక పైనా పనిగట్టుకుని కొందరు సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్ చేస్తూనే ఉన్నారు. దీనిపై అనుదీప్ అనే ఓ స్టాండప్ కమెడియన్ పవన్ కళ్యాణ్ అలానే నిహారికపై జుగుప్సాకరమైన రీతిలో కామెడీ స్కిట్ చేయడం పెద్ద దుమారం రేపింది. జనసేన నేతల ఫిర్యాదుతో ఎక్కడో ఉత్తరప్రదేశ్‌లో ఉన్న అనుదీప్‌ను ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా రఫిక్ అనే మరో కమేడియన్ చేసిన వీడియోలు కూడా వెలుగులోకి వచ్చాయి.
ప్రస్తుతానికి దొరికింది అనుదీప్ ఒక్కడే.. దొరకాల్సింది చాలామందే ఉన్నారని జనసేన నేతలు, పవన్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే, స్టాండప్ కామెడీ ముసుగులో మెగా కాంపౌండ్ మీద ఇటీవలి కాలంలో చాలామంది జుగుప్సాకమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఒక్కో వీడియో వెలుగులోకి వస్తోంది. దీని వెనుక ఓ కుట్ర కోణం ఉందన్న సందేహాలు ఉన్నాయి. ఇదంతా ఓ పద్ధతి ప్రకారం జరుగుతున్న దుష్ప్రచారంలా కనిపిస్తోందని ఆరోపిస్తున్నారు. ఆయా కమెడియన్లకు ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఓ రాజకీయ పార్టీతో సన్నిహిత సంబంధాలున్నట్లు గుర్తించారు జనసేన నేతలు.
పవన్ కళ్యాణ్, సనాతన ధర్మ పరిరక్షణకు నడుం బిగించిన తర్వాత.. ఆ కోణంలోనూ పవన్ కళ్యాణ్‌ని స్టాండప్ కామెడీ ముసుగులో ట్రోల్ చేస్తున్నారు సోకాల్డ్ కమెడియన్లు. మత ప్రస్తావన ఇలాంటి కేసుల్లో ఎంత వరకు సబబు..? అన్న విషయాన్ని పక్కన పెడితే, పవన్ కళ్యాణ్ విశ్వసిస్తున్న హిందూ ధర్మానికి వ్యతిరేకంగా పని చేస్తున్న వాళ్లే, ఈ స్టాండప్ కామెడీ పేరుతో అభ్యంతకర వ్యాఖ్యలు చేస్తున్నట్లు తెలుస్తోంది. వీళ్లని తెర వెనుక ఉండి ఎవరైనా నడిపిస్తున్నారా..? అన్నది చర్చనీయాంశంగా మారింది. రాజకీయ ప్రత్యర్థులే, సదరు స్టాండప్ కమెడియన్లకు డబ్బులిచ్చి, వేదికలు సైతం సెట్ చేసి, పవన్ కళ్యాణ్ మీద దుష్ప్రచారం చేయిస్తున్నారన్న వాదన ఒకటి వుంది.
Also Read : మహిళా రిజర్వేషన్ చట్టం అమలుపై కేంద్రం కీలక ప్రకటన..!
అరెస్టు అయిన స్టాండప్ కమెడియన్ అనుదీప్ పోలీసు విచారణలో ఏం చెప్పబోతున్నాడన్నది ఆసక్తికరంగా మారింది. స్టాండప్ కామెడీ పేరుతో, బూతు ఇటీవల ఎక్కువగా కనిపిస్తోంది. దానికి తోడు, వ్యక్తిత్వ హననానికి కూడా పాల్పడుతున్న స్టాండప్ కమెడియన్లపై జీవిత కాల నిషేధం విధించడం వంటి చర్యలు తీసుకోవాల్సి వస్తుందేమో.. చూడాలి మరి.

