Friday, June 19, 2026 05:21 PM
Friday, June 19, 2026 05:21 PM

అయ్యర్ ఎవరి దగ్గర ప్రూవ్ చేసుకోవాలి..?: అశ్విన్ కీలక వ్యాఖ్యలు..!

భారత జట్టులో శ్రేయాస్ అయ్యర్ కు ప్రాధాన్యత ఇవ్వకపోవడంపై.. టీమ్ ఇండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ముఖ్యంగా శ్రేయస్ అయ్యర్‌ ను టీ20 ఫార్మాట్‌ లో విస్మరించడంపై చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ టీమ్‌ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు. శ్రేయస్ అయ్యర్‌ను దూరం చేసుకోవడం మనకే నష్టం, అతనికి కాదు అంటూ అశ్విన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

Also Read : సార్.. నా పేరు పాడుచేస్తున్నారు.. ఆపండి..!

చాలా కాలంగా శ్రేయస్ అయ్యర్ షార్ట్ బాల్స్‌ను ఎదుర్కోలేడనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీనిపై అశ్విన్ స్పందిస్తూ.. అతను ఎవరికీ జవాబు చెప్పాల్సిన అవసరం లేదు. తనలోని కసిని ఆటపై చూపిస్తున్నాడు. జస్ప్రీత్ బుమ్రా లాంటి వరల్డ్ క్లాస్ బౌలర్ వేసిన షార్ట్ డెలివరీని ఫ్రంట్ ప్రెస్ ఉపయోగించి మిడ్-వికెట్ మీదుగా సిక్సర్‌ గా మలిచిన తీరు అద్భుతం. నేను ఆ సమయంలో లైవ్‌లోనే ఉన్నాను, అది నిజంగా నమ్మశక్యం కాని షాట్ అంటూ అభినందించాడు.

Also Read : లక్నో సూపర్ జెయింట్స్‌కు బ్యాటింగ్ కష్టాలు..!

శ్రేయస్ అయ్యర్ మైండ్ సెట్ గురించి అశ్విన్ చెబుతూ.. నేను షార్ట్ బాల్ ఆడగలనని మీకు నిరూపించాలా? లేదు, నేను మీ దగ్గర ఏమీ నిరూపించుకోను అని చెప్పడమే అతని ఉద్దేశంలా కనిపిస్తోందన్నాడు. అతను తన సామర్థ్యాన్ని తనకు తాను నిరూపించుకోవడానికే శ్రమిస్తున్నాడని.. అతనిలాంటి క్రికెటర్లను చూడటం నాకు స్ఫూర్తినిస్తుందని చెప్పుకొచ్చాడు. తాను జీవితాంతం నమ్మే సూత్రం కూడా ఇదే అన్నాడు. ఎవరికీ జవాబుదారీ కాదు, మన పని మనం చేసుకుంటూ ముందుకు సాగడమే అని అశ్విన్ చెప్పుకొచ్చాడు. సెలెక్టర్లు అతనిని పక్కనపెట్టినప్పటికీ, అయ్యర్ తనలోని ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ఆడుతున్న తీరును అశ్విన్ ప్రశంసించారు. సెలెక్టర్ల నిర్ణయం ఎలా ఉన్నా, ఒక క్వాలిటీ ప్లేయర్‌ ను కోల్పోవడం టీమ్ ఇండియాకే లోటని అశ్విన్ పరోక్షంగా హెచ్చరించాడు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

బ్రేకింగ్: అల్లు అర్జున్‌...

హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య...

తెలంగాణాలో జనసేన తొలి...

గత కొన్నాళ్ళుగా తెలంగాణాలో పార్టీ బలోపేతం...

బ్రేకింగ్: కొడాలి అరెస్ట్...

ఏపీలో వైసీపీ కీలక నేతలకు చట్టపరమైన...

‘పెద్ది’కి బిగ్ సర్‌ప్రైజ్.....

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

రఘురామ కేసుపై హైకోర్ట్...

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఐపీఎస్ అధికారి సునీల్‌...

ఏపీ లిక్కర్ స్కామ్‌లో...

ఏపీలో సంచలనం సృష్టించిన మద్యం రవాణా...

పోల్స్