Thursday, April 16, 2026 09:02 PM
Thursday, April 16, 2026 09:02 PM

సార్.. నా పేరు పాడుచేస్తున్నారు.. ఆపండి..!

తాము చేస్తే సంసారం.. ఎదుటి వాళ్లు చేస్తే వ్యభిచారం అన్నట్లుగా ఉంది వైసీపీ నేతల తీరు. అధికారంలో ఉన్న ఐదేళ్లు తమకు అనుకూలమైన మీడియాతో పాటు డిజిటల్, సోషల్ మీడియాలో వైసీపీ రెచ్చిపోయింది. ఇంకా చెప్పాలంటే రాయలేని బూతులతో అశుద్దం కక్కారు. చివరికి వైసీపీ అధికార సొంత పత్రిక సాక్షిలో కూడా నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబుపై వరుసగా తప్పుడు కథనాలు ప్రచురించింది. ఇక వైసీపీ నేతలైతే నోటికి వచ్చినట్లు వ్యక్తిత్వ హననం చేశారు. చివరికి అసెంబ్లీలోనే ప్రతిపక్ష నేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై నోటికి వచ్చినట్లు వ్యాఖ్యలు చేశారు. దీంతో ఇది కౌరవ సభ అని ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు.. మళ్లీ గెలిచిన తర్వాతే సభకు వస్తా అని సవాల్ చేశారు.

Also Read : ఇలా చేస్తే ఆ ప్రాంతం ముందుకు వెళ్తుందా..?

ఇక వైసీపీలో కొందరు నేతలు తీరు తొలి నుంచి విమర్శలకు దారి తీస్తోంది. ఇంకా చెప్పాలంటే.. 2024 ఎన్నికల్లో వైసీపీ ఓటమికి ఆ నేతల నోటి దూల మాత్రమే కారణమనే విషయం అందరికీ తెలుసు. రోజా, కొడాలి నాని, అనిల్ యాదవ్, పేర్ని నాని, అంబటి రాంబాబు, జోగి రమేష్ వంటి నేతలు పదే పదే నోరు పారేసుకోవడం ఆ పార్టీ నేతల గురించి ప్రజల్లో ఓ అవగాహన వచ్చింది. అందుకే అలాంటి నేతలతో పాటు వైసీపీకి వ్యతిరేకంగా ప్రజలు ఓట్లు వేశారు. ఇక సాక్షి పత్రికలో అయితే.. ఏకంగా చంద్రబాబు చేతిలోనే కత్తి పెట్టి.. నారాసుర రక్త చరిత్ర అంటూ తప్పుడు కధనాలు రాశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా విశాఖ ఎయిర్ పోర్టులో నారా లోకేష్ స్నాక్స్ కోసం ప్రభుత్వ ఖజానా నుంచి రూ.20 లక్షలు ఖర్చు చేశారంటూ ఫేక్ న్యూస్ రాశారు. దీనిపై లోకేష్ కూడా విశాఖ కోర్టులో సాక్షి పత్రికపై పరువు నష్టం దావా వేశారు.

Also Read : మరోసారి వివాదంలో శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి..!

అయితే కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నేతల బాగోతాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. దీంతో టీడీపీ అనుకూల సోషల్ మీడియాతో పాటు కొన్ని యూట్యూబ్‌ ఛానల్స్ వీటిపై వరుస కథనాలు ప్రసారం చేస్తున్నాయి. ఇవి బాగా వైరల్ కావడంతో.. వైసీపీ నేతలకు ఇప్పుడు ఆ బాధ అంటే ఏమిటో అర్థమైనట్లు ఉంది. అందుకే ఆ ఛానల్స్‌పై చర్యలు తీసుకోవాలంటూ పోలీస్ స్టేషన్‌కు పరుగులు పెట్టారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇటీవల ఓ మందు పార్టీలో పాల్గొన్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. వంశీకి ఒకరు అన్నం తినిపిస్తున్న ఫోటో కూడా బయటకు వచ్చింది.

Also Read : అది నీలి ప్రచారం.. రఘురామ సంచలన ప్రకటన..!

ఈ ఫోటోలు, వీడియోలపై వార్తలు ప్రసారం చేసిన యూట్యూబ్ ఛానల్స్‌తో పాటు సోషల్ మీడియా అకౌంట్స్ పై కూడా చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు వంశీ ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానల్స్, టీవీ మాధ్యమాల్లో తనపై జరుగుతున్న అసత్య ప్రచారాలు, దుష్ప్రచారాలను ఇక సహించబోమని స్పష్టం చేస్తూ, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ కృష్ణాజిల్లా అడిషనల్ ఎస్పీ నాయుడును కలిసి జిల్లా వైసీపీ అధ్యక్షులు పేర్ని నానితో కలిసి వల్లభనేని వంశీ మోహన్ అధికారికంగా ఫిర్యాదు చేశారు. ప్రజలను తప్పుదోవ పట్టించే ఈ విధమైన అబద్ధ ప్రచారాలకు చెక్ పెట్టాల్సిన అవసరం ఉందని, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటి తప్పుడు ప్రచారాలను అరికట్టవలసిందిగా కోరారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

రాజకీయాలకు బొత్స గుడ్...

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు...

వైసీపీకి నచ్చని ఐఏఎస్.....

ఏపీ రాజకీయాల్లో మరో కీలక పరిణామం...

మరోసారి వివాదంలో శ్రీశైలం...

గత కొన్నాళ్ళుగా వివాదాస్పదంగా మారిన.. శ్రీశైలం...

అది నీలి ప్రచారం.....

పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మండలం...

డీలిమిటేషన్‌ అంటే ఏమిటి?

జనాభా మార్పులను పరిగణనలోకి తీసుకుని పార్లమెంటరీ,...

ఇరాన్-అమెరికా మధ్య మళ్ళీ...

ప్రపంచాన్ని యుద్ధ భయం వణికిస్తున్న తరుణంలో...

పోల్స్