Friday, June 19, 2026 09:11 PM
Friday, June 19, 2026 09:11 PM

అమెరికా ఫ్లైట్ ఎక్కనున్న కేసీఆర్.. రీజన్ ఇదేనా..?

బీఆర్ఎస్ పార్టీపై కేసీఆర్ ప్రభావం ఎక్కువ. తాను దర్శకత్వం వహించి.. తాను కథ రాసి.. స్క్రీన్ ప్లే ఇచ్చి.. దశాబ్దాలుగా నిలబెట్టిన పార్టీ అది. ఇప్పుడు పుట్టెడు కష్టాల్లో ఉంది. ఈ కష్టాల నుంచి బయటకు రావడం అంత ఈజీ కాదు. కానీ కేసీఆర్ తన సత్తా చూపిస్తే.. పెద్ద మేటర్ కూడా కాదు. ఈ నేపధ్యంలో.. కేసీఆర్ ఓ కీలక అడుగు వేసేందుకు రెడీ అవుతున్నారు. ఒకవైపు పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు చేరికలపై దృష్టి పెడుతూనే, మరోవైపు కేసీఆర్ తన ఆరోగ్యంపై శ్రద్ధ వహించేందుకు సిద్ధమవుతున్నారు.

Also Read : ఢిల్లీలో ఆయనకు బ్రేకులు వేయడానికే.. అశాంతి అస్త్రం..?

తాజా సమాచారం ప్రకారం, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కేసీఆర్ సమక్షంలోనే పార్టీలో చేరనున్నారు. ఈ చేరిక ద్వారా పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపే అవకాశం ఉంది. ఆ వెంటనే కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కేసీఆర్ గత కొంతకాలంగా కొన్ని ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. అయితే.. హైదరాబాద్‌లోని ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకుంటే రాజకీయంగా అనవసరమైన ప్రచారం జరుగుతుందని, ప్రత్యర్థులు దీనిని ఆసరాగా చేసుకునే అవకాశం ఉందని ఆయన భావిస్తున్నట్లు సమాచారం.

Also Read : డీలిమిటేషన్ తెలుగు రాష్ట్రాలకు నష్టమేనా..?

అందుకే, ఎవరికీ ఎలాంటి అనుమానాలు రాకుండా, ప్రశాంతంగా చికిత్స చేయించుకోవడానికి ఆయన అమెరికా వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అక్కడ అత్యాధునిక వైద్య సదుపాయాల ఉండటంతో.. తన ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టి, మళ్ళీ పూర్తి శక్తితో తిరిగి రావాలని ఆయన యోచిస్తున్నారట. ఈ అమెరికా పర్యటన కేవలం చికిత్స కోసం మాత్రమే కాకుండా, కొంతకాలం పాటు రాజకీయ ఒత్తిడికి దూరంగా ఉండి విశ్రాంతి తీసుకోవడానికి కూడా ఉపయోగపడుతుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఏది ఏమైనా కేసీఆర్ మౌనం మరియు ఇప్పుడు ఈ విదేశీ పర్యటన వెనుక ఏదైనా బలమైన రాజకీయ వ్యూహం ఉందా అనే కోణంలోనూ ఆసక్తికర చర్చ జరుగుతోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

సాయికృష్ణ కేసులో వైసీపీ...

విజయవాడ రౌడీ షీటర్‌ గాదె సాయికృష్ణ...

బ్రేకింగ్: అల్లు అర్జున్‌...

హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య...

తెలంగాణాలో జనసేన తొలి...

గత కొన్నాళ్ళుగా తెలంగాణాలో పార్టీ బలోపేతం...

బ్రేకింగ్: కొడాలి అరెస్ట్...

ఏపీలో వైసీపీ కీలక నేతలకు చట్టపరమైన...

‘పెద్ది’కి బిగ్ సర్‌ప్రైజ్.....

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

రఘురామ కేసుపై హైకోర్ట్...

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఐపీఎస్ అధికారి సునీల్‌...

పోల్స్