Saturday, September 19, 2026 07:16 PM
Saturday, September 19, 2026 07:16 PM

ముంబై ఇండియన్స్‌కు భారీ షాక్.. రోహిత్ కష్టమేనా..?

ఐపీఎల్ 2026 సీజన్ రసవత్తరంగా సాగుతున్న తరుణంలో ముంబై ఇండియన్స్ అభిమానులకు షాకింగ్ న్యూస్ ఇప్పుడు తలనొప్పిగా మారింది. ఆ జట్టు స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ గాయం కారణంగా మైదానాన్ని వీడాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన కీలక మ్యాచ్‌ లో బ్యాటింగ్ చేస్తూ రోహిత్ ఇబ్బంది పడటంతో ఫ్యాన్స్ షాక్ అయ్యారు. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌ లో ముంబై ఇన్నింగ్స్ ఆరో ఓవర్‌లో ఈ ఘటన జరిగింది. వేగంగా సింగిల్ తీసే క్రమంలో రోహిత్ శర్మ కుడి కాలు తొడ కండరానికి గాయమైంది.

Also Read : నా భార్యకు భద్రత ప్లీజ్.. బ్రదర్ అనీల్ లేఖ..!

తీవ్రమైన నొప్పితో ఇబ్బంది పడుతున్న రోహిత్, ఫిజియోల సాయంతో మైదానాన్ని వీడాడు. అప్పటి వరకు.. 13 బంతుల్లో 19 పరుగులు చేసి మంచి టచ్‌ లో కనిపించినా.. గాయం తీవ్రత దృష్ట్యా మళ్లీ బ్యాటింగ్‌ కు రాలేదు. తాజా సమాచారం ప్రకారం, సోమవారం ఉదయం రోహిత్‌కు ముంబైలో స్కాన్ నిర్వహించారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు సమాచారం. ఈ స్కాన్ రిపోర్ట్‌ ల ఆధారంగానే తదుపరి మ్యాచ్‌ లలో ఆడతాడా లేదా అనేది ఖరారు కానుంది. ఒకవేళ ఇది గ్రేడ్-1 హ్యామ్‌స్ట్రింగ్ గాయం అయితే, రోహిత్ కోలుకోవడానికి కనీసం 2 నుంచి 3 వారాల సమయం పట్టే అవకాశం ఉంది.

Also Read : ఢిల్లీ హైకోర్టులో హైడ్రామా.. జడ్జిపై కేజ్రీవాల్ సంచలన కామెంట్స్..!

ఏప్రిల్ 16న పంజాబ్ కింగ్స్‌తో జరగబోయే మ్యాచ్‌కు రోహిత్ అందుబాటులో ఉండటం అనుమానంగానే కనిపిస్తోంది. హిత్ గనుక ఫీల్డింగ్ చేయలేకపోతే, జట్టు యాజమాన్యం అతన్ని కేవలం ఇంపాక్ట్ ప్లేయర్ గా బ్యాటింగ్‌కు మాత్రమే పరిమితం చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ముంబై ఇండియన్స్ జట్టులో రోహిత్ శర్మ పాత్ర అత్యంత కీలకం. గత కొన్ని మ్యాచ్‌ లుగా ఫామ్‌లోకి వస్తున్న తరుణంలో ఇలా గాయపడటం జట్టు సమతూకాన్ని దెబ్బతీసే అవకాశం ఉంది. రోహిత్ త్వరగా కోలుకోవాలని అభిమానులు పెద్ద ఎత్తున పోస్ట్‌లు పెడుతున్నారు. అటు ముంబై యాజమాన్యం త్వరలోనే రోహిత్ శర్మ ఆరోగ్యంపై అధికారిక ప్రకటన విడుదల చేయనుంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఇప్పటికీ వారికే పదవులు.....

కూటమి ప్రభుత్వం ఏర్పడి, దాదాపు రెండున్నర...

సాయిరెడ్డి.. నెట్టుకు రాగలరా.....

కొత్త ఎపుడూ వింతే. అందుకే కొత్తగా...

25 రోజుల తర్వాత...

ఏపీ డిప్యూటి సీఎం, జనసేన అధినేత...

ఏపీలో మద్యం షాపుల...

ఆంధ్రప్రదేశ్‌లో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను...

బాంబు పేల్చిన టీడీపీ...

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ...

ఏపీ లిక్కర్ కుంభకోణం.....

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత వైఎస్సార్ కాంగ్రెస్...

పోల్స్