లెక్కల మాస్టారు సుకుమార్.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్‌లో వచ్చిన రంగస్థలం బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి విధ్వంసం సృష్టించిందో మనందరికీ తెలిసిందే. చిట్టిబాబుగా చరణ్ చూపించిన విశ్వరూపం ఫ్యాన్స్ కు ఇప్పటికీ పూనకాలు తెప్పిస్తుంది. ఇప్పుడు వీళ్ళ కాంబినేషన్ లో రాబోయే ఈ కొత్త సినిమా అంతకు మించి ఉండబోతోందని ఇండస్ట్రీ వర్గాలు కోడై కూస్తున్నాయి. సుకుమార్ ప్రస్తుతం తన టీమ్ తో కలిసి దుబాయ్ లో ఈ సినిమా స్క్రిప్ట్ పనులను క్లోజ్ చేస్తున్నారట.
Also Read : విహార ప్రపంచానికి సిద్ధమైన సాగర నగరం..!
ప్రస్తుతం చరణ్ పెద్ది షూటింగ్ లో చాలా బిజేగా ఉన్నాడు. ఈ ప్రాజెక్టు పూర్తయిన వెంటనే, అంటే సుమారు 2026 జూలై లేదా ఆగస్టు నాటికి సుకుమార్ సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది. ఈ లోపు సుకుమార్ పెద్దికి కూడా వర్క్ చేస్తూ.. దుబాయ్ లో చరణ్ కోసం ఒక మైండ్ బ్లోయింగ్ కథను రెడీ చేస్తున్నాడు. ఇది కూడా రంగస్థలం లాగే పక్కా రస్టిక్ అండ్ మాస్ ఎంటర్టైనర్ అని కొందరు అంటుంటే.. కాదు, సుకుమార్ ఈసారి చరణ్ ను ఒక సరికొత్త గ్లోబల్ యాక్షన్ డ్రామాలో చూపించబోతున్నారని మరికొందరు అంటున్నారు.
Also Read : డీలిమిటేషన్ తెలుగు రాష్ట్రాలకు నష్టమేనా..?
ఏది ఏమైనా సుకుమార్ మార్క్ టేకింగ్ మరియు చరణ్ పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్ తోడైతే బాక్సాఫీస్ దగ్గర రికార్డులు గాలిలో ఎగరాల్సిందే. సుకుమార్, రామ్ చరణ్, మైత్రీ మూవీ మేకర్స్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో బిజినెస్ వర్గాల్లో కూడా భారీ పోటీ నెలకొంది. చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన ఏదైనా క్రేజీ అప్డేట్ లేదా టైటిల్ పోస్టర్ వచ్చే ఛాన్స్ ఉందని ఫ్యాన్స్ వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

