Saturday, September 19, 2026 09:09 AM
Saturday, September 19, 2026 09:09 AM

డీలిమిటేషన్ తెలుగు రాష్ట్రాలకు నష్టమేనా..?

నియోజకవర్గాల పునర్విభజన.. అనేది తెలుగు రాష్ట్రాలకు పెద్ద సమస్యగా మారుతుందా..? అంటే అవుననే సమాధానం వినపడుతోంది. 2026లో జరగబోయే ఈ ప్రక్రియ కేవలం జనాభా ప్రాతిపదికన మాత్రమే జరిగితే, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు జాతీయ స్థాయిలో తమ రాజకీయ ప్రాబల్యాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. దశాబ్దాలుగా కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు జనాభా నియంత్రణను కఠినంగా అమలు చేసినందుకు, ప్రతిఫలంగా ఇప్పుడు పార్లమెంటులో ప్రాతినిధ్యం తగ్గడం అనేది ఒక రకమైన ‘శిక్ష’ గా దక్షిణాది నేతలు భావిస్తున్నారు.

Also Read : వైసీపీ రాజకీయ పార్టీనా.. ఉగ్రవాద సంస్థనా?

ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, బిహార్ వంటి చోట్ల జనాభా పెరుగుదల ఎక్కువగా ఉండటంతో, డీలిమిటేషన్ తర్వాత అక్కడ లోక్‌సభ సీట్ల సంఖ్య భారీగా పెరుగుతుంది. దీనివల్ల కేంద్రంలో ఏ ప్రభుత్వం ఏర్పడాలన్నా కేవలం ఉత్తరాది రాష్ట్రాల మద్దతు ఉంటే సరిపోయే పరిస్థితి వస్తుంది. ఫలితంగా జాతీయ రాజకీయాలను శాసించే శక్తి తెలుగు రాష్ట్రాలకు తగ్గిపోయి, కేవలం రెండవ శ్రేణి రాష్ట్రాలుగా మిగిలిపోయే ప్రమాదం ఉంది. విభజన తర్వాత ఇప్పటికే అనేక సమస్యలతో ఉన్న ఏపీకి ఇది పెద్ద సమస్య.

అటు తెలంగాణాకు కూడా ఇది తలనొప్పే. ఆర్థిక కోణంలో చూసినా తెలుగు రాష్ట్రాలకు ఇది గట్టి దెబ్బే. కేంద్రం నుంచి వచ్చే నిధుల కేటాయింపులో జనాభా ఒక ప్రధాన కొలమానంగా ఉంటుంది. సీట్ల సంఖ్య, జనాభా నిష్పత్తి మారితే, తదనుగుణంగా కేంద్రం ఇచ్చే పన్నుల వాటా మరియు గ్రాంట్లు తగ్గే అవకాశం ఉంది. అభివృద్ధిని, ఆర్థిక క్రమశిక్షణను పాటించే రాష్ట్రాలకు ప్రోత్సాహం అందించాల్సింది పోయి, జనాభా లెక్కల ఆధారంగా నిధులు తగ్గిస్తే అది రాష్ట్రాల ప్రగతిపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. అందుకే దక్షిణాది రాష్ట్రాలన్నీ ఇప్పుడు ఏకతాటిపైకి వచ్చి జనాభాతో పాటు అభివృద్ధిని కూడా ప్రామాణికంగా తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.

Also Read : విహార ప్రపంచానికి సిద్ధమైన సాగర నగరం..!

ప్రస్తుత పరిస్థితిని గమనిస్తే, ఏపీలో అసెంబ్లీ సీట్లు 225 కి, తెలంగాణలో 153 కి పైగా పెరిగే అవకాశం ఉందని అంచనాలు ఉన్నప్పటికీ, జాతీయ స్థాయిలో మాత్రం మన లోక్‌సభ సీట్ల శాతం తగ్గిపోతుంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే హైబ్రిడ్ మోడల్ డీలిమిటేషన్ కావాలని ప్రధాని మోదీని కోరారు. అంటే సీట్ల కేటాయింపులో కేవలం మనుషుల గణన కాకుండా, ఆ రాష్ట్రం దేశ ఆర్థిక వ్యవస్థకు ఇస్తున్న సహకారాన్ని కూడా లెక్కలోకి తీసుకోవాలని కోరుతున్నారు. ఈ పోరాటంలో తెలుగు రాష్ట్రాల ప్రయోజనాలను కాపాడుకోవడం అనేది ఇప్పుడు మన రాజకీయ నేతల ముందున్న అతిపెద్ద సవాల్ గా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

రేవంత్ దెబ్బ.. బీఆర్ఎస్‌కు...

ఏదో అనుకుంటే.. మరేదో జరిగినట్లు ఉంది...

దానం నాగేందర్ కు...

ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు తెలంగాణ...

ఎల్‌నినో పై బాబు...

ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడిన కరవు పరిస్థితులను...

సనాతన ధర్మం.. చేప...

'దుర్గాపూజ సమయంలో బెంగాలీ హిందువులు మాంసాహారానికి...

వైసీపీలో విచిత్ర పరిస్థితి.....

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల వేడి...

నిర్ణయం చంద్రబాబు.. పవన్...

ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై...

పోల్స్