Friday, June 19, 2026 10:21 PM
Friday, June 19, 2026 10:21 PM

ఢిల్లీలో ఆయనకు బ్రేకులు వేయడానికే.. అశాంతి అస్త్రం..?

రాజకీయాల్లో ప్రస్తుతం ఓ మహిళా అధికారి అరెస్ట్ వ్యవహారం సంచలనంగా మారింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆమెను అధికారులు కొన్నాళ్ళ క్రితం అరెస్ట్ చేసారు. ఆమె విచారణకు కోర్ట్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. ఈ కేసు వెనుక ఉన్న అసలు రాజకీయ సూత్రధారులు ఎవరనే చర్చ మొదలైంది. అయితే, ఈ అరెస్ట్ వెనుక కేవలం అవినీతి కోణం మాత్రమే కాకుండా, ఢిల్లీ స్థాయిలో జరిగిన ఒక రాజకీయ వ్యూహం ఉందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. రాష్ట్రానికి చెందిన ఒక కీలక మాజీ నేత గత కొంతకాలంగా ఢిల్లీ పెద్దలతో సన్నిహితంగా ఉంటూ, అక్కడ ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా పావులు కదిపినట్లు సమాచారం.

Also Read : ఢిల్లీ హైకోర్టులో హైడ్రామా.. జడ్జిపై కేజ్రీవాల్ సంచలన కామెంట్స్..!

ఆయనకు ఉన్న పలుకుబడిని ఉపయోగించి ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పడంతోనే, ఆయనకు అత్యంత సన్నిహితురాలిగా పేరున్న ఈ మహిళా అధికారిపైకి ఈ అరెస్ట్ అస్త్రం దూసుకొచ్చిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఆ మాజీ నేతను రాజకీయంగా కట్టడి చేసే క్రమంలోనే, ఆయనకు ఆర్థిక మూలాలుగా భావిస్తున్న విభాగాలపై దర్యాప్తు సంస్థలు దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఓ నగరం కేంద్రంగా జరిగిన భారీ భూ కుంభకోణాల్లో ఈ అధికారిణి పాత్ర కీలకమని, ఆ మాజీ నేత కనుసన్నల్లోనే విలువైన ప్రభుత్వ భూములు చేతులు మారాయని ఆరోపణలు ఉన్నాయి.

Also Read : విహార ప్రపంచానికి సిద్ధమైన సాగర నగరం..! 

అయితే, సదరు మాజీ నేత ఢిల్లీలో, రహస్య స్నేహితుల కోసం.. తన ప్రభావాన్ని చూపాలని ప్రయత్నించినప్పటికీ, రాష్ట్రంలో ఆయనకు బ్రేకులు వేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఆయన పట్ల కేంద్ర పెద్దలు కూడా కఠినంగా వ్యవహరిస్తున్నారని టాక్. ఇక ఆయన ఎంత ప్రయత్నించినా ఈ అధికారిని అరెస్ట్ నుంచి తప్పించలేకపోయారని సమాచారం. త్వరలో ఆ మేడం గారిని విచారిస్తారు. ఇదే ఇప్పుడు ఆ మాజీ నేతకు గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. ఆమె నోరు విప్పితే, సదరు నేతతో పాటు మరికొందరు పేర్లు బయటపడే అవకాశం ఉందని వారి భయం అని టాక్. దర్యాప్తు సంస్థలు ఢిల్లీ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతోనే ఈ స్థాయిలో దూకుడు పెంచాయని, దీనివల్ల ఆ మాజీ నేత రాజకీయ భవిష్యత్తు కూడా ఇబ్బందుల్లో పడే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

సాయికృష్ణ కేసులో వైసీపీ...

విజయవాడ రౌడీ షీటర్‌ గాదె సాయికృష్ణ...

బ్రేకింగ్: అల్లు అర్జున్‌...

హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య...

తెలంగాణాలో జనసేన తొలి...

గత కొన్నాళ్ళుగా తెలంగాణాలో పార్టీ బలోపేతం...

బ్రేకింగ్: కొడాలి అరెస్ట్...

ఏపీలో వైసీపీ కీలక నేతలకు చట్టపరమైన...

‘పెద్ది’కి బిగ్ సర్‌ప్రైజ్.....

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

రఘురామ కేసుపై హైకోర్ట్...

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఐపీఎస్ అధికారి సునీల్‌...

పోల్స్