Friday, September 18, 2026 02:19 AM
Friday, September 18, 2026 02:19 AM

ఇండియాతో అమెరికా కామెడీ.. 30 రోజుల పర్మిషన్..!

మిడిల్ ఈస్ట్ లో నెలకొన్న యుద్ద పరిస్థితులు, హార్మోజ్ జల సంధిని ఇరాన్ మూసివేయడం, అటు నుంచి నౌకలు వెళ్తే పేల్చి వేస్తామని హెచ్చరికల నేపధ్యంలో ఇప్పుడు భారత్ తీవ్రంగా ప్రభావితమవుతోంది. యుద్ధం ఇప్పట్లో తగ్గుముఖం పట్టే అవకాశం లేకపోవడంతో భారత్ కు వచ్చే ఆయిల్ నిల్వలపై ఆందోళన మొదలైంది. ఈ తరుణంలో అమెరికా.. భారత్ కు ఓ గుడ్ న్యూస్ చెప్పింది. శుక్రవారం అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ కీలక ప్రకటన చేసారు. రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయవచ్చన్నారు.

Also Read : స్వామి ఆశీస్సులతోనే కొత్త పార్టీ.. కవిత సంచలనం..!

భారత చమురు శుద్ధి కర్మాగారాలు.. రష్యన్ చమురును కొనుగోలు చేయడానికి 30 రోజుల మినహాయింపును ప్రకటించారు. దీనితో భారత్ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. ట్రెజరీ డిపార్ట్‌మెంట్ కు చెందిన, యొక్క విదేశీ ఆస్తుల నియంత్రణ కార్యాలయం రష్యాకు సంబంధించిన లైసెన్స్‌ను జారీ చేయడంతో భారత్ ఊపిరి పీల్చుకుంది అనే చెప్పాలి. వివిధ ఆంక్షలు, నిబంధనల ద్వారా అడ్డుకున్న ఓడలతో సహా.. ఆ అనుమతులు ఏప్రిల్ 3 వరకు ఉంటాయి అని అమెరికా తెలిపింది.

Also Read : నికోటిన్ గమ్ లు వాడుకోవచ్చా..?

మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఆందోళనల నేపధ్యంలో, ప్రపంచ ఇంధన మార్కెట్లను కంట్రోల్ చేసేందుకు అమెరికా ప్రయత్నం చేస్తున్న తరుణంలో ఈ ప్రకటన వెలువడింది. భారత్ అమెరికాకు ఎంతో కీలకమని.. కాబట్టి భారత్ అవసరాలను తాము దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. కాగా రష్యా, చైనా, పాకిస్తాన్ నౌకలను తాము అడ్డుకునేది లేదని ఇరాన్ పేర్కొంది. దీనితో భారత్ కు షాక్ తగిలింది. ఈ టైంలో అమెరికా ఇచ్చిన అనుమతులతో భారత్ కు ఉపశమనం లభించింది. ఏది ఏమైనా.. మన జేబులో డబ్బులతో ఏ బంకులో ఆయిల్ కొట్టించాలో.. అమెరికా ఆదేశించడం విడ్డూరమే.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

మరో వైసీపీ కీలక...

అనంతపురం జిల్లాలో జరుగుతోన్న అక్రమ మైనింగ్...

కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్‌హౌస్...

తెలంగాణ మాజీ సిఎం, బీఆర్ఎస్ అధినేత...

చంద్రబాబుపై కేంద్ర మంత్రి...

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత...

రచ్చకెక్కిన ఉత్తరాంధ్ర వైసీపీ...

శ్రీకాకుళం జిల్లాలో సుదీర్ఘ రాజకీయ అనుభవం...

గ్రామాల్లో అభివృద్ధి పండుగ,...

ఏపీ డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్...

నేను లండన్ వెళ్తా...

సోషల్ మీడియా సెలబ్రిటీ, ప్రముఖ యూట్యూబర్...

పోల్స్