Friday, June 19, 2026 02:16 PM
Friday, June 19, 2026 02:16 PM

భారత్ ను కెలికిన అమెరికా.. అదిరిపోయే రిప్లై..!

ఇరాన్ – ఇజ్రాయిల్ దేశాల మధ్య నెలకొన్న యుద్ధం ఇప్పుడు తీవ్ర స్థాయిలో మారుతోంది. ఆరవ రోజు కూడా ఇరు పక్షాలు ఎక్కడా కూడా వెనక్కు తగ్గడం లేదు. డ్రోన్ లు, క్షిపణి దాడులతో ఇరు వర్గాలు పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు అమెరికా అధికారి ఒకరు చేసిన కామెంట్స్ భారత్ కు చికాకు కలిగించాయి. ఇరాన్‌పై దాడి చేయడానికి అమెరికా.. భారత ఓడరేవులను ఉపయోగిస్తోందని అమెరికాకు చెందిన “వన్ అమెరికా న్యూస్ నెట్‌వర్క్‌ కు” ఇచ్చిన ఇంటర్వ్యూలో మాజీ అమెరికా ఆర్మీ కల్నల్ డగ్లస్ మాక్‌గ్రెగర్ కామెంట్ చేసారు.

Also read : ఆ సినిమాకు లైన్ క్లియర్.. అన్నీ వాయిదా..!

ఈ వ్యాఖ్యలను భారత విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. తమ స్థావరాలు అన్నీ నాశనం అయ్యాయని, ఓడరేవులపై ఇరాన్ పెద్ద ఎత్తున దాడులకు దిగిందని ఆయన వ్యాఖ్యానించారు. దీనితో భారత ఓడరేవులను వాడుకుంటున్నాం అంటూ కామెంట్ చేయడంపై విదేశాంగ శాఖ అభ్యంతరం వ్యక్తం చేసింది. అమెరికా చేసేవి అన్నీ బేస్ లెస్ కామెంట్స్ అంటూ ఫైర్ అయింది. ఇక మధ్యప్రాచ్యంలో నెలకొన్న పరిస్థితులపై భారత ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది. భారతీయులు తీవ్రంగా ప్రభావితం అవుతోన్న నేపధ్యంలో, ఆయా దేశాలతో భారత ప్రభుత్వం చర్చలు జరిపింది.

Also read : టార్గెట్ దిశగా అమిత్ షా.. ముహుర్తం ఫిక్స్..!

ఇరాన్ లోని చాబహార్ పోర్ట్ పై అమెరికా బలగాలు దాడులు చేసాయి. ఈ పోర్ట్ పై భారత్ పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టింది. ముఖ్యంగా బహ్రెయిన్, జోర్డాన్ సహా పలు దేశాల్లో ఉన్న అమెరికా స్థావరాలపై ఇరాన్ చేసిన దాడులతో.. అమెరికా నిర్మించుకున్న మౌలిక సదుపాయాలు తీవ్రంగా ప్రభావితం అవుతున్నాయి. యుద్ధం రెండు మూడు రోజుల్లో ముగుస్తుందని అమెరికా వేసిన అంచనా, తప్పు కావడం, దాడుల తీవ్రతను ఇరాన్ రోజు రోజుకి పెంచడంతో ఇజ్రాయిల్, అమెరికా ఆర్ధికంగా తీవ్రంగా నష్టపోయాయి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

బ్రేకింగ్: అల్లు అర్జున్‌...

హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య...

తెలంగాణాలో జనసేన తొలి...

గత కొన్నాళ్ళుగా తెలంగాణాలో పార్టీ బలోపేతం...

బ్రేకింగ్: కొడాలి అరెస్ట్...

ఏపీలో వైసీపీ కీలక నేతలకు చట్టపరమైన...

‘పెద్ది’కి బిగ్ సర్‌ప్రైజ్.....

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

రఘురామ కేసుపై హైకోర్ట్...

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఐపీఎస్ అధికారి సునీల్‌...

ఏపీ లిక్కర్ స్కామ్‌లో...

ఏపీలో సంచలనం సృష్టించిన మద్యం రవాణా...

పోల్స్